డైనోసార్ మీద.. “Time”travel.. మైంబ్ బెండింగ్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు గుర్రం మీద రాజకుమారుడిగా తీసుకు రావాలని ఖలేజా టైంలో అనుకున్నాడు త్రివిక్రమ్. కాని మగధీర వచ్చాక ఇంకెవరు గుర్రం మీద స్వారిల్లాంటి సీన్లు చేయలేదు. చేసినా వర్కవుట్ కాలేదు. ఐతే అంతకుముందే టక్కరిదొంగలో గుర్రం

Post Published By: dialnews
Updated : 1 May 2026, 8:10 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు గుర్రం మీద రాజకుమారుడిగా తీసుకు రావాలని ఖలేజా టైంలో అనుకున్నాడు త్రివిక్రమ్. కాని మగధీర వచ్చాక ఇంకెవరు గుర్రం మీద స్వారిల్లాంటి సీన్లు చేయలేదు. చేసినా వర్కవుట్ కాలేదు. ఐతే అంతకుముందే టక్కరిదొంగలో గుర్రం స్వారీలో దూసుకెళ్లిన మహేశ్, ఈ సారి డైనోసార్ మీద స్వారీకి సిద్దమయ్యాడు.. ఇప్పటి వరకు ఈ వార్త ప్రచారం రూపంలో చక్కర్లు కొడుతోంది కాని, ఎన్నడూ ఫిల్మ్ టీం కన్ఫామ్ చేయలేదు. ఈ సినిమాలో టైం ట్రావెల్ విషయం కూడా రాజమౌళి అఫీషియల్ గా తేల్చలేదు. కానీ ఈ రెండీంటితోనే వరల్డ్ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలని చాలా ఆశలే పెట్టుకున్నాడు.. ఇంతకి ఇండియానాజోన్స్ స్టైల్ పాత్ర, ఐమ్యాక్స్ తో షూటింగ్ నిజంగా డైనోసార్ స్వారీకి ప్లస్ అవుతాయా? టైం ట్రావెల్ తో వరల్డ్ ఆడియన్స్ కి వారణాసి దగ్గరౌతుందా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు డైనోసార్ మీద స్వారి వింటానికివింతగా ఉండొచ్చు.. హాలీవుడ్ హీరోలు కూడా ఇలాంటి సాహసాలు చేసుండకపోవచ్చు... ఎందుకంటే అవంత పెద్దగా ఉంటాయి కాబట్టి, రియలిస్టిక్ గా అనిపించేఛాన్స్ లేదు. కాని రాజమౌళి మూవీల్లో ఏదైనా సాధ్యమే... అలాని సిల్లీగా సీన్లు తీసేసే వ్యక్తికూడా కాదు రాజమౌళి.ఆల్రెడీ త్రిబుల్ ఆర్ ఇంటర్వెల్ సీన్ లో జెంతువులతో తనిచ్చిన ట్విస్ట్ ఎంత రియలిస్టిక్ గా ఉందో, అంతే షాకింగ్ గా ఉంది. అందుకు గ్లోబల్ గా ఆ సీన్ కి తెల్లోల్లు, చైనీసు, జపనీసు ఇలా నాన్ ఇండియాన్స్ కూడా ఫిదా అయ్యారు. అలాంటి సీన్ వారణాసిలో కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అంటే, అంతకుమించేలా యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా ఉన్నాయి.ఆల్రెడీ ఏడు వింతలు, రామాయణ, మహాభారత గాథలు, కాశీ దేవదేవుడు శివుని పాత్ర, ఇలా ఎన్నో మైతలాజికల్ అంశాలు పెట్టిన రాజమౌలి, విదేశీ ఆడియన్స్ కోసం, టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని పెట్టాడు. అంటార్కిటికాలో తెరకెక్కుతున్న ఐదో వరల్డ్ సినిమాగా వారణాసిని ఎక్కడికో తీసుకెళుతున్నాడు. ఐమ్యాక్స్ కెమెరాతో హాలీవుడ్ మూవీ ఒడిస్సీ తెరకెక్కుతుంటే, అలానే మొత్తం ఐమ్యాక్స్ కెమెరాతో తీసిన రెండో వరల్డ్ మూవీగా వారణాసికి హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు

ఇంతవరకు బానే ఉంది కాని, డైనోసార్ మీద హీరో స్వారిని మరీ గుర్రం స్వారిలా చూడలేం. అవి మనకాలానికి చెందినవి కావు.. గుర్రం స్వారీలా వాటి ఆకారం కూడా సహకరించదు.. మరి ఎలాంటి డైనోసార్లను వారణాసి తో రాజమౌలి చూపించబోతున్నాడు.. ఆకాలానికి హీరో ఎందుకు వెలతాడు అన్నది తేలాలి.. మిగతా అంశాలన్నీ గ్రాఫిక్స్ వర్క్ చేసే సంస్త వల్ల బయటికొచ్చింది..అలాని ఇదేం లీకు కాదు, కాని కంటెంట్ లో ఉన్న అంశాలు మాత్రం కిక్ ఇస్తూనే షాక్ ఇస్తున్నాయి.. బాహుబలి, త్రిబుల్ ఆర్, ఈగ వేటిని చూసినా కనీసం రెండు లేదంటే ఒక్కటి రోమాలు నిక్కబొడిచే నెక్ట్స్ లెవల్ సీన్ ఉంది కాబట్టే అవి చరిత్ర స్రుష్టించాయి.. అలాంటి సీనే వారణాసిలో రామ రావణ యుద్దం అన్నాడు రాజమౌలి. ఐతే మరో సీన్ మాత్రం డైనోసార్ మీద హీరో స్వారిచేసే యాక్షన్ పార్టే అనంటున్నారు. సమ్మర్ వెకేషన్ తర్వాత ఆ యాక్షన్ సీక్వెన్స్ నే దేవర సెట్లో తీయబోతోంది ఫిల్మ్ టీం. అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయి.. ఎంటైర్ యూనిట్ వెయిటింగ్ ఫర్ మహేశ్ బాబు రిటర్న్.

Published : 
  • 1 May 2026, 8:10 PM IST