Top story: తమిళనాడు విజయ్ సరికొత్త చరిత్ర డీఎంకే, అన్నాడీఎంకే కాలేదు…విజయ్‌కు మాత్రమే సాధ్యం…!

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సాధ్యం కానీ...రికార్డులను విజయ్ సుసాధ్యం చేశాడు. మూడు నెలల క్రితం ఈసీ ఎన్నికల సింబల్ ప్రకటించినా...ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని సీట్లు సాధించాడు. తమిళనాడులో కొత్త రాజకీయాలు షురూ కాబోతున్నాయి.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 5:51 PM IST

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సాధ్యం కానీ...రికార్డులను విజయ్ సుసాధ్యం చేశాడు. మూడు నెలల క్రితం ఈసీ ఎన్నికల సింబల్ ప్రకటించినా...ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని సీట్లు సాధించాడు. తమిళనాడులో కొత్త రాజకీయాలు షురూ కాబోతున్నాయి. యంగ్‌స్టర్స్‌ అసెంబ్లీలో తలపడబోతున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయడం పక్కా. అటు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్ఠాలిన్ వ్యవహరించబోతున్నారు.చరిత్రది ఏముంది చించేస్తే...చిరిగిపోతుందనేది సినిమాలో డైలాగ్‌. రాజకీయాల్లో దాన్ని నిజం చేసి చూపించాడు దళపతి విజయ్. పోటీ చేసిన ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేశాడు. 234 సీట్లున్న తమిళనాడులో ఏకంగా వందకుపైగా సీట్లలో గెలుపొంది చరిత్ర సృష్టించాడు. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేశాడు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. 76 సంవత్సరాలు చరిత్ర ఉన్న ద్రావిడ మున్నేట్ర కజగంకు సాధ్యం కానీ...54 ఏళ్ల హిస్టరీ ఉన్న అన్నాడీఎంకేకు సాధ్యం కానిది...విజయ్ సుసాధ్యం చేసి చూపించాడు.

రెండేళ్ల క్రితమే పార్టీని స్థాపించి...సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. విజయ్ ఈ స్థాయిలో సీట్లు సాధించడం మాములు విషయం కాదు. ఎన్‌టీఆర్, ఎంజీఆర్ తరహాలో స్టార్ హీరో విజయ్ సైతం తొలి ఎన్నికల్లోనే సూపర్ హిట్ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ విజిల్ గుర్తు ప్రభంజనం సృష్టించింది. విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం పార్టీ సింగిల్‌గానే 100కుపైగా అసెంబ్లీ సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో కాబోయే తమిళనాడు సీఎం హీరో విజయే అని స్పష్టమైంది. అయితే దక్షిణాదిన గత కొన్ని దశాబ్దాల్లో సినీరంగానికి చెందిన ఎంతోమంది స్టార్‌లు రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సక్సెస్ రేటు చాలా తక్కువే. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినీతార దళపతి విజయ్ మాత్రమే. ఎన్టీఆర్ తర్వాత విజయ్ కాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు రాజకీయాల్లో వచ్చినా ఈ స్థాయిలో విజయం సాధించలేకపోయారు. రాజకీయ అరంగేట్రంలోనే సీఎంలు అయిన ఎన్‌టీఆర్, ఎంజీఆర్‌లతో హీరో విజయ్‌ను పోల్చుతున్నారు.

హీరో విజయ్ చాలా తక్కువ టైంలోనే రాజకీయాల్లో అద్భుత ఫలితాన్ని సాధించారు. 2024 ఫిబ్రవరి 2నే తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించారు. 2024 ఆగస్టు 22న పార్టీ జెండాను, గీతాన్ని ఆవిష్కరించారు. 2024 అక్టోబర్ 27న టీవీకే సిద్ధాంతాలను విజయ్ ప్రకటించారు. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం 2026 జనవరి 22న అధికారికంగా విజిల్ గుర్తును కేటాయించింది. అంటే టీవీకే పార్టీకి గుర్తును మూడు నెలల క్రితమే కేటాయించారు. అయినప్పటికీ అతిస్వల్ప వ్యవధిలోనే అత్యంత వేగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు తన పార్టీ గుర్తును, అజెండాను చేరవేయడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మార్చి 18నే ఆయన ప్రకటించారు. చెప్పినట్లే ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. కేసులు పెట్టి వేధించినా విజయ్ మాత్రం లొంగలేదు. సింహం సింగిల్‌ అంటూ ఎన్నికల్లో తలపడ్డారు. అద్భుతమైన ఫలితాలతో ప్రత్యర్థులకు షాక్‌ ఇచ్చాడు. దళపతి దెబ్బకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సైతం ఓటమి పాలయ్యాడు. స్టాలిన్‌ ఓటమితో తమిళనాడు రాజకీయాలు మారబోతున్నాయి. అరవ నేలపై కొత్త తరం రాజకీయాలు మొదలు కానున్నాయి. స్టాలిన్‌ ఓటమి ఉదయనిధి గెలుపుతో...తమిళనాట కొత్త శకం షురూ కానుంది.

వాస్తవానికి డీఎంకే పార్టీని సీఎన్ అన్నాదురై 1949 సెప్టెంబర్ 17న స్థాపించారు. ఆయన 1969 ఫిబ్రవరి 3న అన్నాదురై మరణించిన అనంతరం కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయానికి ఎంజీ రామచంద్రన్ డీఎంకేలోనే ఉన్నారు. ఆయనకు పార్టీలో మంచి పాపులారిటీ ఉండేది. అన్నాదురై మరణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీఎంకే పార్టీని నడిపే విషయంలో కరుణానిధి, ఎంజీఆర్ మధ్య విభేదాలు వచ్చాయి. 1971లో కరుణానిధి మంత్రి వర్గంలోనూ ఎంజీఆర్‌కు చోటు దక్కలేదు. దీంతో డీఎంకే‌లోనే ఉంటూ, కరుణానిధి సర్కారుకు వ్యతిరేకంగా ఎంజీఆర్ మాట్లాడటం మొదలుపెట్టారు. 1972లో డీఎంకే కోశాధికారిగా ఉన్న సమయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే మంత్రుల వ్యక్తిగత ఆస్తుల లెక్కలను విడుదల చేయాలని ఎంజీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో 1972 అక్టోబరు 10న ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించారు. తనను పార్టీ నుంచి పంపేసిన వారం రోజుల్లోనే 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ ప్రకటించారు. అన్నాదురై ఆశయాల సాధన కోసం పనిచేసే అసలైన పార్టీ అన్నాడీఎంకేనే అంటూ ప్రజలకు చేరువయ్యారు. కట్ చేస్తే, 1977 తమిళనాడు ఎన్నికల్లో ఎంజీఆర్ నాయకత్వంలోని అన్నా డీఎంకే కూటమి 144 సీట్లతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది. హీరో విజయ్ సైతం ఇలాంటి వ్యూహాన్నే క్షేత్రస్థాయిలో అమలు చేశారు. డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ నిలుస్తుందని విజయ్ చేసిన ప్రకటనలు నిజమయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం.

Published : 
  • 5 May 2026, 5:51 PM IST