ఇది న్యూ ఇండియా.. ఇటు చూడు HOLLYWOOD..!

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న వారాణాసి మూవీ పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టాలని కోట్ల మందికోరుకోవచ్చు.. కాని రాజమౌళి ఒక్కసారైనా కింద పడితే చూద్దాం అనుకునే శాడిస్టిక్ ఆలోచనలున్న బ్యాచ్ కూడా ఉంది.

Post Published By: dialnews
Updated : 8 May 2026, 7:10 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న వారాణాసి మూవీ పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టాలని కోట్ల మందికోరుకోవచ్చు.. కాని రాజమౌళి ఒక్కసారైనా కింద పడితే చూద్దాం అనుకునే శాడిస్టిక్ ఆలోచనలున్న బ్యాచ్ కూడా ఉంది. అదెక్కువగా బాలీవుడ్ లోనే ఉండొచ్చు... అక్కడే ఈ రోగం కాస్త ఎక్కువ మందికి ఉంది.. అలాని సౌత్ ఇండియా లో ఉన్న స్టార్స్, ఇక్కడి బ్యాచ్ సుద్ద పూసలని కాదు.. అలాంటి వాళ్ల ఎక్కడైనా ఉంటారు. కాని ఎక్కువ శాతం బాలీవుడ్ బ్యాచ్ రాజమౌళి వారాణాసి డిజాస్టర్ అవ్వాలనే కోరుకుంటుంది. ఎంతైనా బాలీవుడ్ గాలి తీసేసి, సౌత్ సినిమా ని చూసి వాళ్లు భయపడే పరిస్థితులు తెచ్చింది రాజమౌళే కాబట్టి.. అయితే ఇదంత ఇండియా వరకు ఓకే.. కాని వరల్డ్ మార్కెట్ లో రాజమౌళి సీన్ ఎంత..? మహేశ్ బాబు ఇక్కడి జనాలకు అందగాడు కావొచ్చు... సూపర్ స్టార్ కావొచ్చు.. కాని అమెరికన్లు, యూరోపియన్లు,మెక్సికన్లు, బ్రెజీలియన్లు ఇంకా చెప్పాలంటే చైనావాళ్లు మన మూవీలెందుకు చూడాలి... ఇది అసలైన ప్రశ్న.. ఎవరి ఊర్లో వాళ్లు మొనగాళ్లే కావొచ్చు.. కాని ప్రపంచ మార్కెట్ లో రాజమౌళి ఒక చిన్న డైరక్టర్... తన స్టామినా తక్కువని కాదు.. తన రేంజ్ ని తగ్గించట్లేదు.. తనకి ఇండియాలో ఉన్నంత బ్రాండ్ ఇమేజ్, వరల్డ్ మార్కెట్ లో ఇంకా క్రియేట్ కాలేదు.. అదే వారణాసితో క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నారు.. ఇక్కడే అసలు వారణాసి సీన్ ఎంత? మెక్సికో, పారిస్ ప్రమోషన్ లో ఎందుకు వారాణసి వీడియోలకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.. అయినా ఇది 10 వేల కోట్లు కొల్లగొట్టే సినిమాగా రాజమౌలి ఎలా మారుస్తున్నాడో చూస్తూ, ఎవరికైనా రోమాలు నిక్కబొడుస్తాయి.. ఎందుకు రాజమౌళిని విజినరీ అంటారో కూడా అర్ధమౌతుంది.

సూపర్ స్టార్ మహేవ్ బాబు మనకి గొప్ప... ప్రపంచాన్నికి కాదు.. ఇది ఫ్యాన్స్ కి నచ్చినా నచ్చకున్నా, ప్రాక్టికల్ వాస్తవం... ఇక రాజమౌలి అయితే, ఏదో బాహుబలి పుణ్యమాని రష్యా, జపాన్, తో పాటు మరికొన్ని ఏరియాల్లో మీడియా గుర్తింపు కొంత దక్కింది. త్రిబుల్ ఆర్ నాటు నాటు పాట వల్ల, ఇంటర్వెల్ సీన్ వల్ల, హాలీవుడ్ స్టార్స్ వల్ల ఇంకొంత వరల్డ్ మీడియా ఎక్స్ పోజర్ దక్కింది.

కాని నిజంగా హాలీవుడ్ తో పోటీ పడటం కాదు, ఆ స్థాయిలో వరల్డ్ మార్కెట్లో మన సినిమాను రిలీజ్ చేస్తే జనం చూస్తారా? అలా చూడాలంటే ఏం చేయాలి...? ఈ సినిమా ఎంత గొప్పదైనా, ఎవరో కొందరు చూసి, మిగతా వాళ్లకు చెబితేనే కదా, వారణాసి వండర్స్ కి ఛాన్స్ ఉంది.. అలా జరగాలంటే, మళ్లీ మనం బాహుబలిని గుర్తు చేసుకోవాలి..బాహుబలి వచ్చే వరకు నార్త్ తో ఎవరూ ఈ మూవీ టీజర్లు, ట్రైలర్లు పట్టించుకోలేదు.. ఏదో బాగుందన్నారు కాని, ఇది బాలీవుడ్ కోటల్ని కూల్చేసి, బాలీవుడ్ భవిష్యత్తునే ప్రశ్నార్దకం చేస్తుందని ఎవరూ ఊహించలేదు.ఇక ఈ విషయం పక్కన పెట్టి, ప్రజెంట్ వారణాసికి వరల్డ్ మార్కెట్ లో సీన్ ఏంత? మెక్సికో, పారిస్ ప్రమోషన్ లో వారణాసి టీజర్ కి సోసో రెస్పాన్స్ కారణాలు చూస్తే... ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాన్ సినిమాలంటే, అమెరికన్లు, యూరపియన్లుకి గుర్తొచ్చేది పాటలు, రొమాన్స్, అంతకుమించి మన మూవీల సీన్ ఏంటి, సత్తా ఎంతన అని ఎవరికీ తెలియదు.

రష్యన్స్ అయితే ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ జమానా హిందీ పాటలే, ఇప్పటికీ గుర్తు చేస్తారు తప్ప.. న్యూఇండియన్ సినిమాసీన్ ఏంటో ఎవరికీ తెలియదు..అలాంటిది వారణాసి టీజర్ ని మెక్సికోలో స్కీన్ మీద వేస్తే ఎవరు పట్టించుకుంటారు.. ఎవిరి పనులు వాళ్లవి.. ఒకసారి వారణాసి మూవీ వచ్చి, వరల్డ్ ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేస్తే, ఆతర్వాత రాజమౌళి అంటే జనం గుర్తిస్తారు..త న సినిమా ప్రమోషన్ అంటే క్యూ కడతారు.ఇది ప్రాక్టికల్ థింగ్.. అందుకే వారణాసి సీన్ ఏంటో తెలియక మెక్సికో జనాలు ఈమూవీ టీజర్ టెలికాస్ట్ చేస్తే పెద్దగా చూడకుండా, వెళ్లిపోయారనే మాటని, ఇక్కడ వక్రీకరిస్తున్నారు. అదేం అంత తప్పు పట్టే అంశం కాదు.. మనమే ఏ కొరియనో, ఇటాలియనో సినిమా టీజర్ ఇక్కడ టెలికాస్ట్ చేస్తే చూస్తామా? అది వచ్చి అద్భుతంగా ఉందనే టాక్ వస్తే అంతా క్యూ కడతాం కాని, పనికట్టుకుని టీజర్లు, ట్రైలర్లు చూడం కదా..

ఇక వారణాసి ఎందుకు న్యూ ఇండియా సినిమా? హాలీవుడ్ ని ఇది ఎలా షేక్ చేసే ఛాన్స్ ఉందనే విషయానికొస్తే. సౌత్ సినిమా అంటే ఇదే అని బాలీవుడ్ వెక్కిరిస్తున్న టైంలో, ఇక్కడ చాలా స్టఫ్ ఉంది. అంతెందుకు సల్మాన్ అండ్ కో సౌత్ మూవీల రీమేక్ లతోనే కెరీర్ నెట్టుకొస్తున్నారని గుర్తు చేశాడు రాజమౌలి. అది కూడా బాహుబలిని తీసుకొచ్చి, సౌత్ సినిమా అంటే ఇది అని బాలీవుడ్ కి చెంప చెల్లుమనేలా చెప్పాడు..అదే పని హాలీవుడ్ లో చేయటం కష్టమే.. ఎందుకంటే అక్కడ మహామహులు , మైండ్ బ్లాంక్ చేసే ప్రయోగాలు కామన్. అందుకే 1400 కోట్ల బడ్జెట్ తో ఐమ్యాక్స్ కెమెరాతో వీడియో క్వాలిటీని, ఇండియానా జోన్స్ లాంటి అమెరికన్స్ కి పరిచయం ఉన్న హీరోయిజాన్ని వాడి వారణాసి తీస్తున్నాడు రాజమౌళి. ఇక ఏడు ప్రపంచ వింతలు, రామాయణం లాంటి ఎపిక్స్ తో వరల్డ్ ఆడియన్స్ కి హాలీవుడ్ కాకుండా ఎంటర్ టైన్ మెంట్ కి మరో కోణంలో సినిమాలు తీసే బ్యాచ్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదంత తేలిక కాదు.. బాహుబలి రిలీజ్ టైంలో ఒక్కో మెట్టెక్కుతూ, బాహుబలి రిలీజ్ అయ్యాకే రిలాక్స్ అయ్యాడు రాజమౌలి. తర్వాత బాహుబలి 2 తో ఏనుగు కుంభస్థలం కొట్టాడు. ఇప్పుడు మెక్సికో ఫిల్మ్ ఈవెంట్స్ లో వారణాసి ప్రమోషన్ మొదలు పెట్టాడు. తర్వాత పారిస్. ఆవెంటనే చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా.. ఇలా ప్రపంచంలో అన్ని మార్కెట్స్ కి మన వారనాసిని చూపిస్తూ, మెల్లగా ప్రచారం పెంచాడు. ఇంకో విషయం ఏంటంటే బాహుబలి, త్రిబుల్ ఆర్ ఎంత బాగున్నాచైనాలో అవి సరిగ్గా ఆడలేదు.. అందుకే వారణాసి కనుక చైనీస్ కి కనెక్ట్ అయితే అక్కడి నుంచే కనీసం 3 నుంచి 4 వేల కోట్లొచ్చే ఛాన్స్ఉందని, అక్కడ సాలిడ్ ప్రమోషన్ ని ప్లాన్ చేశాడు.ఇలా మెక్కికోతో లాటిన్ అమెరికా, ఫ్రాన్స్ ప్రమోషన్ తో యూరప్, తర్వాత చైనా, అమెరికా ఇలా వరల్డ్ ఆడియన్స్ కి మెల్లి మెల్లిగా మన వారణాసిని ఇంజెక్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా ఈ ప్రమోషన్ లో ఎమోషన్ వరల్డ్ ఆడియన్స్ వరకు క్యారీ అయితే, హాలీవుడ్ గేట్లు కూడా బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాగా వారణాసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయొచ్చు.

Published : 
  • 8 May 2026, 7:10 PM IST