దీనేమ్మ ఇదేం ట్విస్ట్ రా.. ఊహించని క్లైమాక్స్ అధికారంలోకి అన్నాడిఎంకే ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్ బై..? డీఎంకేతో దోస్తీకి పళనిస్వామి సై…!

మలుపులతో చెన్నై పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఒకవైపు దళపతి విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతుంటే.. మరోవైపు అన్నాడీఎంకే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Post Published By: dialnews
Updated : 9 May 2026, 9:43 AM IST

మలుపులతో చెన్నై పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఒకవైపు దళపతి విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతుంటే.. మరోవైపు అన్నాడీఎంకే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు రాబోతోందా..? చిరకాల శత్రువు డీఎంకేతో జతకట్టబోతోందా..? అన్నాడీఎంకే నేత తంబిదురై చేసిన ఆ కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి? తాజా సమాచారం ప్రకారం, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పలనిస్వామి ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే.. విజయ్ దూకుడుకు బ్రేక్ వేయడానికి తన శత్రు పక్షమైన డీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందట. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపిస్తూ, డీఎంకే-అన్నాడీఎంకే ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ ఏంటీ అంటే.. ఇప్పటివరకు డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే మరియు వామపక్షాలు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇస్తాయా లేదా అన్నదే ప్రశ్న.

ప్రస్తుతం చెన్నైలోని సీపీఎం కార్యాలయంలో స్టేట్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఒకవేళ ఈ పార్టీలు విజయ్ వైపు వెళ్తే.. అప్పుడు అన్నాడీఎంకే వెంటనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి డీఎంకేకు మద్దతు ప్రకటించే ఛాన్స్ ఉంది. అందుకే పుదుచ్చేరి రిసార్ట్‌లో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను వెంటనే బయలుదేరాలని పలనిస్వామి ఆదేశించారు. పరిణామాలు వేగంగా మారుతుండటంతో సీఎం స్టాలిన్ డీఎంకే కార్యాలయంలో సీనియర్ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. విజయ్ వ్యూహాలకు ఎలా చెక్ పెట్టాలనే దానిపై చర్చిస్తున్నారు.ఇదే సమయంలో అన్నాడీఎంకే నేత తంబిదురై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 'దేవుడి దయతో ప్రజలు కోరుకున్నట్లు అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుంది' అని ఆయన అనడం చూస్తుంటే.. తెరవెనుక ఏదో పెద్ద స్కెచ్ నడుస్తోందని అర్థమవుతోంది. మొత్తానికి తమిళనాడులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. విజయ్ కి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తాయా..? లేక డీఎంకే-అన్నాడీఎంకే కలిసి కొత్త చరిత్ర సృష్టిస్తాయా..? నేటి సాయంత్రం లోపు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే - అన్నాడీఎంకే కలవడం అనేది అసంభవం. ఒకవేళ ఇప్పుడు విజయ్ కోసం వీరు ఒక్కటైతే, 1972లో పార్టీ చీలిపోయిన తర్వాత సుమారు 54 ఏళ్ల తర్వాత ద్రావిడ దిగ్గజాలు రెండు ఒకే గొడుగు కిందకు వచ్చినట్లు అవుతుంది. ఇది దేశ రాజకీయాల్లోనే అతిపెద్ద సంచలనం కాబోతోంది. ప్రస్తుత పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి ఒక రహస్య నివేదిక పంపినట్లు సమాచారం. రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడం, ఎమ్మెల్యేలు క్యాంపు రాజకీయాల్లో ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలపై ఎంపీ మాణిక్కం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కేవలం విజయ్‌ను అడ్డుకోవడానికే రాత్రికి రాత్రే మిత్రులుగా మారుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఏకమవ్వడం తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసమో లేదా మతవాద శక్తులను ఢీకొట్టడం కోసమో కాదని, ఇది కేవలం రాజకీయ స్వార్థమేనని ఆయన దుయ్యబట్టారు. డీఎంకే కూటమి నుంచి తాము బయటకు రావడం సరైన నిర్ణయమని పేర్కొన్న ఆయన, అన్నాడీఎంకే మరియు డీఎంకేలు రెండూ బీజేపీకి బీ-టీమ్‌లని ఆరోపిస్తూ, ఇప్పటికైనా డీఎంకే తన ముసుగు తొలగించాలని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు.

ఒకవేళ అన్నాడీఎంకే ఎన్డీఏ నుంచి బయటకు వస్తే, తమిళనాడులో బీజేపీ ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఢిల్లీ పెద్దలు పలనిస్వామితో మంతనాలు జరుపుతున్నట్లు టాక్. గవర్నర్ తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని విజయ్ ఇప్పటికే న్యాయనిపుణులతో సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశంపై చర్చించారు. "సింగిల్ లార్జెస్ట్ పార్టీ"గా మాకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇటు అన్నాడీఎంకే, అటు డీఎంకే కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకోవడం మానేసి, విజయ్‌ను ఎలా అడ్డుకోవాలనే దానిపై ఉమ్మడి పోరాటం మొదలుపెట్టారు. "ద్రవిడ సిద్ధాంతం వర్సెస్ కొత్త రక్తం" అనే యుద్ధం నడుస్తోంది. తమిళనాడులో ఇప్పటిదాకా మనం 'స్టాలిన్ వర్సెస్ పలనిస్వామి'ని చూశాం. కానీ ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి 'విజయ్'ని అడ్డుకుంటారా..? లేక విజయ్ వీరిద్దరి కోటలను బద్దలు కొడతాడా..? అనేది ఇక్కడ అసలైన క్లైమాక్స్.

Published : 
  • 9 May 2026, 9:43 AM IST