ఒకసారి ఓకే.. ప్రతీసారీ కష్టం…!

సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. రీసెంట్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి

Post Published By: dialnews
Updated : 21 May 2026, 4:50 PM IST

సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. రీసెంట్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. గతంలో రిలేషన్‌షిప్‌ని ‘సిట్యుయేషన్‌షిప్’ అని పిలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన రకుల్.. తాజాగా రిలేషన్‌షిప్‌లో మోసం చేయడం అనే అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌లతో బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో తేడా కొట్టిందంటూ కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నింటికీ రకుల్ ఇప్పటికే ఒకసారి క్లారిటీ ఇచ్చి ఫుల్‌స్టాప్ పెట్టింది. అయితే, తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఒక టాక్ షోలో పాల్గొంది.

ఈ షోలో రకుల్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్, యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంధాలు, వాటిలో జరిగే నమ్మకద్రోహం గురించి ఆసక్తికరమైన చర్చ వచ్చింది. సాధారణంగా రిలేషన్‌షిప్‌లో మోసాన్ని ఎవరూ అంగీకరించరు. రకుల్ కూడా మొదట అదే మాట చెప్పింది. ప్రేమలో లేదా పెళ్లిలో ఒకరినొకరు మోసం చేసుకోవడాన్ని అస్సలు ఒప్పుకోలేమని స్పష్టం చేసింది. అయితే, చర్చ మరింత ముందుకు సాగుతున్నప్పుడు రకుల్ అందరినీ ఆలోచింపజేసే ఒక భిన్నమైన అభిప్రాయాన్ని పంచుకుంది."జీవితం చాలా పెద్దది. ఎవరైనా పొరపాటున, తెలియక ఒక్కసారి ఆ తప్పు చేసి.. దానికి మనస్ఫూర్తిగా, నిజాయితీగా క్షమాపణ చెబితే, వారిని క్షమించవచ్చు. ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు" అని రకుల్ పేర్కొంది.

కానీ, అదే సమయంలో రకుల్ మరో ముఖ్యమైన కండిషన్ పెట్టింది."ఒక్కసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు.. కానీ, మోసం చేయడమే ఒక అలవాటుగా మారితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు, వెంటనే దూరం పెట్టాలి" అని క్లియర్ కట్‌గా చెప్పేసింది.ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్‌పై మాట్లాడినప్పుడు మీడియా మరియు నెటిజన్లు దాన్ని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి ముడిపెడతారని రకుల్‌కు బాగా తెలుసు. గతంలో తన భర్త చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుని రూమర్స్ క్రియేట్ చేశారు. అందుకే ఈసారి రకుల్ చాలా తెలివిగా వ్యవహరించింది. తన వ్యాఖ్యలు ముగిసేలోపే ఒక గట్టి క్లారిటీ ఇచ్చింది."ఇది కేవలం ఒక జనరల్ టాపిక్ మీద నా సాధారణ అభిప్రాయం మాత్రమే. నా వ్యక్తిగత జీవితానికి, ఈ కామెంట్స్‌కు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఇది నా భర్తకు కూడా వర్తించదు. దయచేసి దీనిపై ఎవరూ తప్పుడు వార్తలు, పుకార్లు సృష్టించకండి" అని ముందే హెచ్చరించింది.దీంతో ఎలాంటి గాసిప్స్ రాయడానికి వీల్లేకుండా రకుల్ ముందే చెక్ పెట్టేసింది.

Published : 
  • 21 May 2026, 4:50 PM IST