మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని డ్రాగన్ గా చూపిస్తానని, లూగర్ గా చూపించాడు ప్రశాంత్ నీల్. అంతా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ కి ఫిదా అయిపోయారు. ఎప్పటి నుంచో కరువులో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కాదు, ఫ్యామిలీ ప్యాకేజే ఆఫర్ చేసింది డ్రాగన్ టీం. అందుకే ఆ మత్తులో ఉన్న వాళ్లంతా గుర్తించని మరో విషయం డ్రాగన్... అసలు డ్రాగన్ గ్లింప్స్ అయితే వచ్చింది కాని, అందులో డ్రాగన్ ని ఫిల్మ్ టీం పరిచయం చేయలేదు. అది గమనించారా? చాలా క్లియర్ గా ప్రశాంత్ నీల్ ఈమూవీలో ఎన్టీఆర్ పాత్రని లూగర్ అని చెప్పేశాడు.. ఒకవేల ఎన్టీఆర్ పాత్ర పేరు డ్రాగన్ అయితే, అదే పేరుతో టైటిల్ కార్డ్ పడాలి.. అలా జరగలేదు.. అంటే అసలైన డ్రాగన్ ని ప్రశాంత్ నీల్ ఇంకా దాచిపెట్టాడా? లూగర్ అంటే డ్రాగన్ కాకుండా ఎన్టీఆర్ వేసిన రెండో పాత్రేనా? అంటే మొదటి పాత్ర డ్రాగన్ నే అనుకోవాలా? అదెప్పుడు ప్రశాంత్ నీల్ పరిచయం చేస్తాడు?
డ్రాగన్ టీజర్ గ్లింప్స్ అన్ని భాషల వ్యూస్ కలిపితే, 150మిలియన్లు, అంటే 15 కోట్లు... ఇలా గ్లింప్స్ పేలుతూ పోతూ ఉంటే, కథ, పాత్రలు, ఇలా అన్నీ తెలుసు కాబట్టి, సినిమా ఎలా ఉంటుందో అని అంతా ఊహించుకుంటూ ఉంటుంటే, ఒకే డౌట్, ఒకే ఒక్క డౌట్, డ్రాగన్ విషయంలో ఇండస్ట్రీలో షాక్ వేవ్ క్రియేట్ చేస్తోంది.. అదే అసలు డ్రాగన్ పాత్ర ఎప్పుడు రివీల్ చేస్తారని..ఆల్రెడీ డ్రాగన్ గ్లింప్స్ వచ్చాక, డ్రాగన్ ని ఎప్పుడు చూపిస్తారనటంలో అర్ధం లేదనిపించొచ్చు.. కాని ఇప్పడు అంతా చూస్తోంది డ్రాగన్ గ్లింప్స్ కాదు.. డ్రాగన్ మూవీ గ్లింప్స్.. రెండీంటికి చాలా తేడా ఉంది. డ్రాగన్ మూవీ విజువల్స్ తోనిండిన ప్రోమోగా డ్రాగన్ గ్లింప్స్ వచ్చింది. కాని అందులో డ్రాగన్ ని చూపించకుండా దాచేశాడు ప్రశాంత్ నీల్.
మరి మనకు కనిపించిన ఎన్టీఆర్ ఎవరంటే, తనే లూగర్... ఎవరైనా సినిమాలో టైటిల్ కార్డ్ వేసి చూపించారంటే, ఖచ్చితంగా అది అందులో హీరో పేరే.. అందుకే అందరికి లూగర్ పాత్రని మాత్రమే ప్రశాంత్ నీల్ చూపించాడు.. అలా డ్రాగన్ గ్లింప్స్ వదిలాడు. కాని అసలు డ్రాగన్ ఎవరోచూపించలేదు. అది టీజర్ లో చూపిస్తాడా? ట్రైలర్ లో సర్ ప్రైజ్ ఇస్తాడా అన్నది చూడాలి.డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ వేసేది రెండు పాత్రలని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
దానికి తగ్గట్టే టైటిలేమో డ్రాగన్ అని పెట్టి, అందులో హీరో పాత్ర లూగర్ అంటున్నాడంటే, ఇదికాకుండా టైటిల్ రోల్ వేసే మరో ఎన్టీఆర్ ఉన్నాడని పరోక్షంగా తేల్చినట్టే.. అందుకే ఆ పాత్రని నిదానంగా, ట్రైలర్ లో తేలుస్తాడా? మరోలాచూపిస్తాడా అన్నది సస్పెన్స్ గా ఉంది.బహుషా, లూగర్ విలనీ లక్షణాలతో ఉంటే, డ్రాగన్ హీరోయిన్ షాక్ వేవ్ లా వస్తాడా? లేదంటే ఇద్దరూ తాతా మనవలా? తండ్రి కొడుకులా? అన్నదమ్ములా... రిలేషన్ షిప్ ఏదైనా, డ్రాగన్ గ్లింప్స్ లో మనం చూసింది ఎన్టీఆర్ ఒక ముఖమే.. తన రెండో ముఖం అసలు సిసలు సర్ ప్రైజింగ్ గా వస్తుందని తెలుస్తోంది. మోస్ట్ లి దసారాకు డ్రాగన్ బాంబు టీజర్ రూపంలో పేలే అవకాం ఉంది. గ్లింప్సే ఇంత షాక్ వేవ్స్ తెస్తే, ఇక టీజర్ భూకంపమే తీసుకొచ్చే అవకాశం ఉంది. అది కూడా డ్రాగన్ పాత్రతో అంటే రెస్పాన్స్ లోరీసౌండ్ షాకిచ్చే ఛాన్స్ఉంది.