Top story: 5 లక్షల మంది మృతి…చివరి అస్త్రం సిద్ధం…ఇక ఉక్రెయిన్‌ వరల్డ్ మ్యాప్‌లో ఉండదు…!

ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధంలో రష్యా ఘోరంగా దెబ్బతిందా? నాలుగున్నరేళ్ల కాలంలో ఏకంగా ఐదు లక్షల మంది సైన్యాన్ని కోల్పోయిందా? తీవ్ర సైనికుల కొరతతోనే టెన్ మిలియన్ రూబుల్స్ రుణ మాఫీఆఫర్ ప్రకటించిందా? బ్రిటన్ రిపోర్ట్స్ ఔననే అంటున్నాయి.

Post Published By: dialnews
Updated : 29 May 2026, 12:15 PM IST

ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధంలో రష్యా ఘోరంగా దెబ్బతిందా? నాలుగున్నరేళ్ల కాలంలో ఏకంగా ఐదు లక్షల మంది సైన్యాన్ని కోల్పోయిందా? తీవ్ర సైనికుల కొరతతోనే టెన్ మిలియన్ రూబుల్స్ రుణ మాఫీఆఫర్ ప్రకటించిందా? బ్రిటన్ రిపోర్ట్స్ ఔననే అంటున్నాయి. సుదీర్ఘ యుద్ధంలో పుతిన్ సైన్యం దారుణంగా దెబ్బతింది అని యూకే నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాలే రష్యాను ఓటమి దిశగా నడిపిస్తున్నట్టు విశ్లేషించాయి. కానీ, కథ అంత వరకూ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే, పుతిన్ అన్నింటికీ తెగించి ఉన్నారు. తన చివరి అస్త్రాన్ని బయటకుతీస్తే ఉక్రెయిన్ ఒక్కటే కాదు.. సగం యూరోప్ నాశనమవుతుంది.

రీసెంట్‌గా ఒక వార్త అంతర్జాతీయ రాజకీయంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ వార్తలోని సారాంశం.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడానికి సైన్యంలో చేరే యువత అప్పులు తీరుస్తాం అని మాస్కో ఆఫర్ ఇచ్చిందని చెప్పడం. నిజమే.. రక్షణశాఖతో ఒప్పందం కుదుర్చుకుంటే, వారికి, వారి కుటుంబాలకు ఉండే రుణాల్లో 10 మిలియన్‌ రూబుల్స్‌ రుణాల్లో 10 మిలియన్‌ రూబుల్స్‌ అంటే మన కరెన్సీలో సుమారు 1.33కోట్ల వరకు రుణంనుంచి విముక్తి కలిగిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నిర్ణయంపై అధ్యక్షుడు పుతిన్‌ సంతకం చేసినట్లు క్రెమ్లిన్‌ వర్గాలు వెల్లడించాయి. మే 1వ తేదీకి ముందు రుణాలు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా సైన్యంలో చేరాలనుకునే వారు కనీసం ఏడాది పాటు కొనసాగుతానని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ వార్త బయటకు రాగానే బ్రిటన్ నిఘా వర్గాలు రష్యా సైన్యం పరిస్థితులను విశ్లేషించాయి. యుద్ధంలో పెద్ద ఎత్తున సైనికులు మరణించబట్టే యువతకు ఇలా ఎర వేస్తున్నారని ఇన్‌డైరెక్టుగా చెప్పాయి.

బ్రిటన్ నిఘఆ వర్గాల నివేదికల ప్రకారం 2022 నుంచి జరుగుతోన్న ఈ ఘర్షణల్లో రష్యాకు సైనిక పరంగా భారీ నష్టం వాటిల్లింది. ఈ పోరులో ఐదు లక్షల మంది మాస్కో సైనికులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ నిఘా వర్గాలు అంచనావేశాయి. మరోవైపు, యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి తాము 55వేలమంది సైనికులను కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 2026 ఫిబ్రవరిలో ప్రకటించారు. ఇరువైపులా ప్రాణనష్టం భారీగా ఉన్నా.. వాస్తవ లెక్కలను వెల్లడించట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా డాన్‌బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశలవారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్నవారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేకపోవడం.. యుద్ధరంగంలో భారీగా ప్రాణనష్టానికి దారితీస్తున్నట్లు బ్రిటన్ నిఘా వర్గాలు వెల్లడించాయి.

నిజానికి.. అమెరికా, దాని మిత్రదేశాలు సరఫరా చేసే క్షిపణి వ్యవస్థలు, ఫిరంగి, అధునాతన డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. కమాండ్ పోస్టులు, సైనిక సమూహాలు లక్ష్యంగా జెలెన్‌స్కీ సైన్యం దాడులు చేస్తోంది. దాంతో ఈ నష్టం మరింత పెరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఈ దాడులను ఎదుర్కొనేలా రష్యా సుశిక్షితులైన సైనికులను నియమించుకోలేకపోతుందని, విధుల్లో ఉన్నవారిని కాపాడుకునేలా ఎలాంటి రక్షణకవచాలను సమీకరించలేకపోతుందని యూకే నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ కారణాలే రష్యాను దెబ్బతీస్తున్నట్లు యూకే నిఘా వర్గాలు చెప్పుకొచ్చాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ యుద్ధంలో రష్యా ఓటమి పాలవ్వడం ఖాయమని విశ్లేషించాయి. ఇందులో చాలా వరకూనిజమే.. యుద్ధం అన్న తర్వాత ప్రాణ నష్టం జరగకుండా ఉండదు. నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో లక్షల్లో సైనికులు మరణించకుండా ఉండరు కూడా. కానీ, ఈ గణాంకాలు రష్యాను ఓడిస్తాయన్నదే తప్పుడు లెక్క.

సుదీర్ఘ యుద్ధంలో పుతిన్ అసలు సిసలు అస్త్రాలను ఇప్పుడిప్పుడే బయటకు తీస్తున్నారు. రీసెంట్‌గా కీవ్‌పై ఓరెన్షిక్ క్షిపణితో దాడి చేయడమే అందుకు ఉదాహరణ. ఇన్నేళ్ల భీకర యుద్ధంలో ఈ తరహా హైపర్‌సోనిక్ క్షిపణులతో దాడి చేయడం చాలా అరుదు. విధ్వంసకర క్షిపణిని ఇప్పుడే బయటకు తీశారంటే ఈ యుద్ధంలో ఎంతవరకూ వెళ్లడానికైనా సిద్ధం అని సందేశమివ్వడమే. బ్రిటన్ నిఘా వర్గాలు చెప్పినట్టు రష్యా ఓడిపోయే పరిస్థితే వస్తే న్యూక్లియర్ క్షిపణులతోనూ దాడులు చేస్తారు. ఆ దిశగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సిద్ధం చేసినట్టు అంతర్జాతీయ నివేదికలు ఎప్పట్నుంచో చెబుతున్నాయి. సో.. సైనికుల మరణంతో యుద్ధం ఆగదు.. అసలు సిసలు విధ్వంసం ఇంకా మిగిలే ఉంది.

 

Published : 
  • 29 May 2026, 12:15 PM IST