30,000 కోట్ల ఆట.. 5K కోట్లు కొల్లగొట్టేదెవరు..?

100 కోట్ల నుంచి 1000 కోట్ల వసూళ్లని తెలుుగ సినిమా ఎదిగింది. అందుకు పెద్ది నుంచి డ్రాగన్ వరకు ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరగబోతోందన్న మాటే, మార్కెట్ ని షేక్ చేస్తోంది. ఎందుకంటే, టాలీవుడ్ ఎన్నడూ వినని నెంబర్

Post Published By: dialnews
Updated : 30 May 2026, 7:50 PM IST

100 కోట్ల నుంచి 1000 కోట్ల వసూళ్లని తెలుుగ సినిమా ఎదిగింది. అందుకు పెద్ది నుంచి డ్రాగన్ వరకు ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరగబోతోందన్న మాటే, మార్కెట్ ని షేక్ చేస్తోంది. ఎందుకంటే, టాలీవుడ్ ఎన్నడూ వినని నెంబర్, ఎన్నడూ తెలుగు నిర్మాతలు చూడని కలెక్షన్స్ రాబోయే వన్ ఇయర్ లో రాబోతున్నాయి... 12 నెలల్లో ఐదు సినిమాలు, 50 వేల కోట్లు రాబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అదే జరగబోతోందా? పెద్ది, ఫౌజీ, వారనాసి, డ్రాగన్ ఈ నాలుగు మూవీలకు తోడు ఐదో సినిమాగా హిందీ రామాయణం లిస్ట్ లో చేరబోతోంది. ఒక్కో సినిమా గట్టిగా 5 వేల కోట్లు రాబడితే, మొత్తంగా 50 వేల కోట్ల వసూళ్ళు వచ్చినట్టే.. 2000 కోట్లలోపే కనిష్టంగా కలెక్సన్స్ రాబడితే, కనీసం 20 వేల కోట్లు ఏడాదిలో వసూళైనట్టే... ఇలాంటి వింత కేవలం అంటే కేవలం, రానున్న 12 నెలల్లోనే జరగబోతోంది. ఔను జూన్ లో పెద్ది తో మొదలై, వచ్చే ఏడాది జూన్ లో విడుదలయ్యే డ్రాగన్ తో ఈ 50 వేల కోట్ల వసూల్ల వేట ఎండ్ కాబోతోంది.. ఇంతకి ఈ నెంబర్ నిజమౌతుందా? అందుకు అవకాశం ఎంత?

ఒక్క సారి ఊహించుకోండి.. పెద్ది మూవీ జూన్ లో వస్తే, వచ్చే ఏడాది జూన్ డ్రాగన్ రాబోతోంది.. అంటే 50 వేల కోట్ల వసూళ్ల నామ సంవత్సరంగా మారనే ఈ 12 నెలల జర్నీని, మొదలుపెట్టేది, ముగించేది త్రిబుల్ ఆర్ బ్రదర్సే... ఔను నాటు పాటతో గ్లోబల్ గా దూసుకెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి, 50 వేల కోట్ల ఇండియన్ సినిమా జర్నీకి ఓపెనింగ్, అండ్ క్లోజీంగ్ కటౌట్స్ గా మారుతున్నారు.పెద్ది మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది... డ్రాగన్ వచ్చేఏడాది జూన్ 11న రాబోతోంది. ఈరెండీంటి మధ్యే మరో 3 పాన్ వరల్డ్ మూవీలు రాబోతున్నాయి. ఇవన్నీ చేసే బిజినెస్సే 50 వేల కోట్లనంటున్నారు. ఇందులో నాలుగు తెలుగు సినిమాలే.. ఒకటి మాత్రంమే హిందీ మూవీ. అది 2 వేల కోట్ల తో తెరకెక్కుతున్న రామాయణం.ఇక పెద్ది విషయానికొస్తే, ఇది 5 వేల కోట్లు రాబడుతుందా? ఖచ్చితంగా డౌటే.. త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్స్ తో ఫ్లాఫ్స్ ఫేస్ చేసిన రామ్ చరణ్ కి హిట్ పడితే, అదే గొప్ప విషయం..అందుకే పెద్ది మీద చాలా పెద్ద ఆశలతోనే ఉన్నాడు. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయటం, జాన్వీకపూర్ సీన్లో ఉండటం ఈ సినిమాకు ప్లస్సే అయినా. పాటలు రెహమాన్ స్థాయిలో మాత్రం లేవనేది కాస్త మైనెస్ గా మారింది.

ఇక క్రికెట్, కుస్తీ, అథ్లెటిక్స్ ని కలిపి చూడబోతుండటంతో, ఏమాత్రం కథ వర్కవుట్ అయినా, లగాన్, దంగల్ గా దూసుకెళ్లటం ఖాయం.. ఆ ఒక్కకోణంలోనే ఇది 1000 కోట్లని మించుతుందనుకుంటున్నారు.కాని అలాకకాపోతే, జస్ట్ టాలీవుడ్ లో మాత్రంమే సందడి చేసే సినిమా అనుకుంటున్నారు.ఇక పెద్ది తర్వాత వచ్చే మూవీ అంటే ఫౌజీ... దసరాకు రెబల్ స్టార్ ఈ సినిమాతో దాడి చేయబోతున్నాడు. హనురాఘవపూడీ మేకింగ్ లో వస్తున్న సినిమా కాబట్టి, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కనీసం 2 వేల కోట్ల నుంచి 3 వేల కోట్ల రేంజ్ టచ్ చేయొచ్చు.. హిట్ టాక్ వస్తే, 5 వేల కోట్లు అసలు పెద్ద నెంబరే కాకపోవచ్చు.. అది పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్.

ఇక డివోషనల్ మూవీ హిందీ రామాయనం దంగల్ దర్శకుడు నితీష్ తీవారి తీయటంతో, ఏమాత్రం పర్లేదన్న టాక్ వచ్చినా ఇది 3 వేల కోట్ల నుంచి 5 వేలకోట్లు రాబట్టే సినిమా అనుకోవాల్సిందే.. ఇక వారనాసి ఎలాగూ 5 వేల కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అంచనాలతో ఏప్రిల్ లో రాబోతోంది. దీనికి పోటీగా డ్రాగన్ మూవీ పాన్ ఆసియా, పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ తో రాబోతోంది.ఈ రెండే కనీసం 5 వేల కోట్ల వసూళ్ల ను మించే మూవీలుగా రిలీజ్ కి ముందే బజ్ ని క్రియేట్ చేసుకున్నాయి. ఎలా చూసినా పెద్దినుంచి డ్రాగన్ వరకు ఐదు సినిమాలు, 50 వేల కోట్ల పైనే బిజినెస్ చేసే అంచనాలతో రాబోతున్నాయి.. రానున్న 12 నెలల్లో మైండ్ బ్లాంక్ అయ్యే నెంబర్స్ వినిపించేలా ఉన్నాయ్.

Published : 
  • 30 May 2026, 7:50 PM IST