Top story: కిమ్ జోంగ్ ఉన్ ఊర మాస్ ట్రంప్ కు ఉచ్చ పోయించే డెసిషన్…అణు బాంబులు భారీగా తయారు చేయండి…సైన్యానికి సంచలన ఆదేశాలు..!

ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశాడు. అమెరికా, దక్షిణ కొరియా లాంటి అగ్రదేశాలకు నిద్ర లేకుండా చేసేలా కిమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Post Published By: dialnews
Updated : 24 June 2026, 5:18 PM IST

ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశాడు. అమెరికా, దక్షిణ కొరియా లాంటి అగ్రదేశాలకు నిద్ర లేకుండా చేసేలా కిమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా, అణ్వాయుధ రంగంలో "ప్రపంచాన్ని మించిపోవడమే మా లక్ష్యం" అంటూ శపథం చేశాడు. ఉత్తర కొరియా అధికార పక్షం 'వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా' కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశంలో కిమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు కిమ్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ఆయన తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలు ఏంటి?

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కొరియాలో అత్యంత కీలకమైన 'వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా' కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశాలు మూడు రోజుల పాటు అత్యంత రహస్యంగా, సస్పెన్స్ మధ్య జరిగాయి. ఈ కీలక సమావేశంలో ఆ దేశ సర్వోన్నత నేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. ప్రసంగం ప్రారంభం నుంచే కిమ్ తన మార్క్ అగ్రెసివ్ స్టైల్ ను చూపించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మరియు శత్రుదేశాల దాడులను తిప్పికొట్టడానికి అణ్వాయుధాల విస్తరణే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరమైన రాజకీయ, సైనిక పరిస్థితుల నేపథ్యంలో.. ఉత్తర కొరియా ఒక శక్తివంతమైన అణు దేశంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ ప్లీనరీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేవలం అణ్వాయుధాలు కలిగి ఉండటమే కాదు, టెక్నాలజీ పరంగా ప్రపంచంలో మరే దేశానికి లేనంతగా అగ్రస్థానానికి చేరుకోవాలని కిమ్ తన శాస్త్రవేత్తలకు, సైన్యానికి టార్గెట్ విధించారు. అయితే, కిమ్ జోంగ్ ఉన్ ఇంతలా అణ్వాయుధాల వేగాన్ని పెంచడానికి అసలు కారణం ఏంటో తెలుసా? అమెరికా మరియు దక్షిణ కొరియాల కూటమే.

కొరియా ద్వీపకల్పంలో ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్న మిలిటరీ విన్యాసాలు ఉత్తర కొరియా భద్రతకు తీవ్ర ముప్పుగా మారాయని కిమ్ ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా-దక్షిణ కొరియాలు ఏర్పాటు చేసిన 'న్యూక్లియర్ కన్సల్టేటివ్ గ్రూప్' సమావేశాలను, అలాగే దక్షిణ కొరియాకు అణుశక్తితో పనిచేసే సబ్‌మెరైన్లను అందించే ప్లాన్స్‌ను కిమ్ తీవ్రంగా తప్పుపట్టారు. హెగేమోనిక్ శక్తుల, అంటే కొన్ని అగ్రరాజ్యాల దురాశ వల్లే ఈరోజు యూరప్ మరియు మిడిల్ ఈస్ట్‌ (పశ్చిమ ఆసియా) లో యుద్ధాలు, రక్తపాతం జరుగుతున్నాయని అమెరికాపై కిమ్ నేరుగా నిందలు వేశారు.

తమ దేశానికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదంటే, తమ రక్షణ వ్యవస్థను శత్రువుల ఊహకు అందని రీతిలో బలోపేతం చేయడమే ఏకైక మార్గమని ఆయన క్యాడర్ కు పిలుపునిచ్చారు. కిమ్ కేవలం మాటలతో సరిపెట్టలేదు, ఆచరణలో కూడా భారీ స్కెచ్ వేశారు. ఈ ప్లీనరీ సమావేశంలో రక్షణ రంగానికి సంబంధించి ఆయన కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేశారు. అందులో అత్యంత ముఖ్యమైనది.. ఏకంగా 10 వేల టన్నుల సామర్థ్యం గల వ్యూహాత్మక గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ యుద్ధనౌక నిర్మాణం.

ఈ భారీ యుద్ధనౌక నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని కిమ్ ఆదేశించారు. దీనితో పాటు, దక్షిణ సరిహద్దుల్లో రక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, సరికొత్త నావికాదళ స్థావరాలను నిర్మించాలని స్పష్టం చేశారు. సాధారణ సాంప్రదాయ ఆయుధాల ఉత్పత్తిని కూడా భారీగా పెంచాలన్నారు. దక్షిణ కొరియాను తమ దేశానికి అత్యంత శత్రు పూరితమైన దేశంగా పరిగణిస్తూ, ఎలాంటి యుద్ధానికైనా తమ సైన్యం క్షణాల మీద సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వేస్తున్న అడుగులు చూస్తుంటే రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా మరిన్ని ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అణ్వాయుధాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదని, చర్చల ప్రసక్తే లేదని కిమ్ క్లియర్ కట్ సిగ్నల్స్ ఇచ్చేసారు.

Published : 
  • 24 June 2026, 5:18 PM IST