ఇండియా షేక్ డ్రాగన్ ఇంట్రో సీక్వెన్స్..!

యాక్షన్ చిత్రాల సంచలనం ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Post Published By: dialnews
Updated : 1 July 2026, 2:30 PM IST

యాక్షన్ చిత్రాల సంచలనం ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంట్రీ సీక్వెన్స్ గురించి వినిపిస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల ఎలివేషన్లు, ఎంట్రీ సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేజీఎఫ్, సలార్ చిత్రాలలో మనం అది చూశాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం అంతకుమించి ప్లాన్ చేస్తున్నారట. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ గెటప్ చాలా కొత్తగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతుందట.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఈ సీక్వెన్స్‌ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ ఎంట్రీ సీన్‌లో ఎన్టీఆర్‌తో పాటు దాదాపు 40 మంది ఫైటర్స్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, తదుపరి షెడ్యూల్‌లో ఒక స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్స్. ఆయన గత చిత్రాలైన ‘ఉగ్రామ్’, ‘కేజీఎఫ్’, ‘సలార్’ లలో డార్క్ థీమ్, మైనింగ్ బ్యాక్‌డ్రాప్, డస్ట్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపించాయి. కానీ ఎన్టీఆర్‌తో తీస్తున్న ‘డ్రాగన్’ సినిమా మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండబోతుందట.

ఈ చిత్రం పూర్తి కలర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. పైగా, ప్రశాంత్ నీల్ రెగ్యులర్ స్టైల్ అయిన బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా ఈ సినిమాలో అస్సలు కనిపించదట. మరి ఎప్పుడూ డార్క్ మోడ్‌లో సినిమాలు తీసే ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో అంత కలర్‌ఫుల్‌గా ఏం చూపించబోతున్నాడు? ఎలాంటి విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నాడు? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ఎక్కడా బడ్జెట్ విషయంలో వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా, సరికొత్త కలర్ ఫుల్ విజువల్స్‌తో, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి మరిన్ని అధికారిక అప్‌డేట్స్ రానున్నాయి.

Published : 
  • 1 July 2026, 2:30 PM IST