అల్లు అర్జున్ నో అంటే ఎన్టీఆర్..!

టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయిందంటే చాలు, సోషల్ మీడియాలో దాని చుట్టూ రకరకాల చర్చలు, విశ్లేషణలు మొదలవుతుంటాయి. తాజాగా ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

Post Published By: dialnews
Updated : 2 July 2026, 7:50 PM IST

టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయిందంటే చాలు, సోషల్ మీడియాలో దాని చుట్టూ రకరకాల చర్చలు, విశ్లేషణలు మొదలవుతుంటాయి. తాజాగా ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. డ్రాగన్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్‌లో చేరిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన కొత్త చర్చ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ వర్గాల్లో మరియు అభిమానుల్లో ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం.. ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ కథ మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అనుకున్నదనే ప్రచారం జరుగుతోంది.

గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో విడుదల చేసిన పోస్టర్‌లోని కొన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ పోస్టర్‌లో ఉన్న వివరాలు ఒకేలా ఉండటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
ఇలాంటి ఘటనే గతంలో కూడా జరిగింది. దర్శకుడు కొరటాల శివ మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమాను ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ తర్వాత అదే కథ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి, నెవర్ బిఫోర్ విజువల్ వండర్‌గా, భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దేవర’ చిత్రంగా రూపాంతరం చెందింది. అప్పట్లో వచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్‌లో కూడా దేవర నేపథ్య ఛాయలు కనిపించాయి. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతోందని, బన్నీ వదులుకున్న సబ్జెక్ట్‌నే ఎన్టీఆర్ చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

నిజానికి అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ‘బావ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటూ ఇద్దరు హీరోలు తమ అభిమానులకు ఎంతో ఆనందాన్ని పంచుతుంటారు. ఇద్దరి ఫ్యాన్ బేస్ కూడా చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఒక హీరో అనుకున్న ప్రాజెక్ట్ మరో హీరో వద్దకు వెళ్లడంతో, నెటిజన్లు మరోసారి వీరిద్దరి బాండింగ్ గురించి చర్చించుకుంటున్నారు.కథ ఎవరిదైనా, మొదట ఎవరు అనుకున్నా.. ప్రస్తుత తరుణంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ గ్లోబల్ మరియు పాన్ ఇండియా స్థాయి స్టార్స్. భారీ బడ్జెట్ చిత్రాలను, అంతర్జాతీయ స్థాయి స్కేల్‌ను తమ భుజాలపై మోయగల మార్కెట్ వాల్యూ మరియు నటన సామర్థ్యం ఇద్దరికీ పుష్కలంగా ఉన్నాయి.త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ మేకింగ్, ఎన్టీఆర్ విశ్వరూపం తోడైతే ‘గాడ్ ఆఫ్ వార్’ భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. కాబట్టి ఈ కథా మార్పిడి గురించిన ప్రచారాన్ని నెగటివ్‌గా కాకుండా, ఒక మంచి క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందనే పాజిటివ్ కోణంలోనే చూడాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Published : 
  • 2 July 2026, 7:50 PM IST