గాయం కారణంగా అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ .. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సిద్ధం అవుతున్నాడు. జులై 14 నుంచి జరగనున్న ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది . ఈ జట్టులో విరాట్ కోహ్లీకి సైతం చోటు దక్కింది. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే అతడు బరిలోకి దిగుతాడని కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేశాడు. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి విరాట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది చూసిన అభిమానులు.. కింగ్ వచ్చేస్తున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ రీఎంట్రీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంటున్నారు.2014 నుండి 2019 వరకు కోహ్లీ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన కాలంలో సంజయ్ బంగర్ భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.ఈ కీలక సిరీస్ కోసం కోహ్లీ ఇప్పటికే ముంబై, అలీబాగ్‌లలో ప్రత్యేక బ్యాటింగ్ క్యాంప్‌ను పూర్తి చేసుకున్నాడు. తన బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకునేందుకు కోహ్లీ ఈ శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.
జూలై 14 నుండి ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. అయితే, గతంలో ఎదురైన గాయం ఆందోళనల నేపథ్యంలో, కోహ్లీ ఈ సిరీస్‌లో ఆడటం అనేది పూర్తిగా 'ఫిట్‌నెస్ క్లియరెన్స్'పైనే ఆధారపడి ఉంది. వన్డే ప్రపంచకప్ 2027లో కచ్చితంగా ఆడాలని పట్టుదలతో ముందుకెళ్తున్నాడు. దీంతో అతడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ సైతం వన్డే ప్రపంచకప్‌లో ఆడాలంటే.. ఇంగ్లాండ్ గడ్డపై సత్తాచాటడం ముఖ్యం. ఇక ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. కానీ కాస్త విరామం తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చాడు.