త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ మాత్రమే!

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్స్ అనగానే గుర్తొచ్చే పేరు 'ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్'. వీరిద్దరి కలయికలో ఇప్పటికే వచ్చిన అరవింద సమేత సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

Post Published By: dialnews
Updated : 4 July 2026, 9:50 AM IST

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్స్ అనగానే గుర్తొచ్చే పేరు 'ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్'. వీరిద్దరి కలయికలో ఇప్పటికే వచ్చిన అరవింద సమేత సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రంలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరును అధికారికంగా ప్రకటించడంతో, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న రకరకాల రూమర్లకు పూర్తిగా తెరపడింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ జరిగాయి. అయితే, వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ నుండి అల్లు అర్జున్ ఎందుకు తప్పుకున్నాడు? అసలు బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో లేకపోవడానికి గల అసలు కారణాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మైథలాజికల్ కథను కేవలం ఎన్టీఆర్‌ను మాత్రమే మనసులో పెట్టుకుని రాసుకున్నారట. మొదట్నుంచీ ఈ కథకు ఎన్టీఆరే సరైన న్యాయం చేయగలరని ఆయన భావించారు.

సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నుండి బన్నీని ఎవరూ తొలగించలేదు. ఆయనే స్వయంగా ప్రాజెక్ట్ అడిగారని, ఆ తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టుకుని ముందుకు సాగారని స్పష్టమవుతోంది. ఫైనల్‌గా.. త్రివిక్రమ్ తాను మొదటి నుండి అనుకున్న హీరో ఎన్టీఆర్‌తోనే ఈ భారీ పాన్-ఇండియా విజువల్ వండర్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్‌కు, త్రివిక్రమ్ మేకింగ్‌కు ఈ మైథలాజికల్ డ్రామా ఒక సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Published : 
  • 4 July 2026, 9:50 AM IST