ప్రస్తుతం ప్రపంచమంతా మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తోందా అనే భయం పట్టుకుంది. ఒకవైపు రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం, మరోవైపు పశ్చిమ ఆసియాను కుదిపేస్తున్న ఇరాన్ - ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు. ప్రపంచ అగ్రరాజ్యాలు సైతం ఈ మంటలను చల్లార్చలేక చేతులెత్తేస్తున్న తరుణంలో.. గ్లోబల్ పాలిటిక్స్‌ను షేక్ చేసే ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఈ ఇద్దరు బద్ధశత్రువుల మధ్య శాంతిని నెలకొల్పే సత్తా, యుద్ధాన్ని ఆపగలిగే పవర్ కేవలం ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందంటూ అంతర్జాతీయ వేదికపై ఒక బిగ్ స్టేట్మెంట్ వచ్చేసింది. అసలు ఎవరా ప్రకటన చేశారు? భారత్ ఈ యుద్ధాన్ని ఎలా ఆపగలదు?
అవును బాస్, మీరు విన్నది అక్షరాలా నిజం.. భారతదేశంలో ఉన్న పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబు షావిష్ అంతర్జాతీయ మీడియా సాక్షిగా భారత్ దౌత్య నీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య రోజురోజుకూ ముదురుతున్న వైరాన్ని తగ్గించి, పశ్చిమ ఆసియాలో శాంతిని తీసుకురావడంలో భారత్ అత్యంత కీలకమైన, చారిత్రాత్మక పాత్ర పోషించగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశానికి ఉన్న పెరుగుతున్న అంతర్జాతీయ ప్రభావం, బలమైన దౌత్య సంబంధాల వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
ఇండియా గనుక ఈ విషయంలో గట్టిగా నిలబడి మధ్యవర్తిత్వం వహిస్తే, గ్లోబల్ పీస్ అనేది సాధ్యమవుతుందంటూ ఆయన పెట్టిన నమ్మకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న.. అమెరికా, రష్యా లాంటి సూపర్ పవర్స్ చేయలేని పనిని ఇండియా ఎలా చేయగలదు..? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ప్రస్తుత ప్రపంచంలో ఇటు ఇజ్రాయెల్‌తో అత్యంత బలమైన స్నేహ బంధాన్ని కొనసాగిస్తూనే.. అటు ఇరాన్‌తో కూడా సమానమైన వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను మేనేజ్ చేయగల ఏకైక దేశం మన భారతదేశం మాత్రమే.
అమెరికా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌కు సపోర్ట్ ఇస్తుంటే, చైనా, రష్యాలు మరోలా వ్యవహరిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఎప్పుడూ 'న్యూట్రల్' పాలసీని నమ్ముకుంటుంది. ఇరు దేశాల అగ్రనేతలతో నేరుగా మాట్లాడగల క్రెడిబిలిటీ, దౌత్య పరమైన పట్టు మన దేశానికి ఉంది. అందుకే, ఈ రెండు దేశాలను ఒకే టేబుల్ పైకి తీసుకురావడానికి భారత్ కంటే సరైన మొనగాడు మరొకరు లేరని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పాలస్తీనా రాయబారి అబు షావిష్ మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనపై కొన్ని కీలక అనుమానాలను కూడా వ్యక్తపరిచారు.
ఒకవేళ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంబంధాలు మెరుగై, తాత్కాలికంగా కాల్పుల విరమణ లేదా శాంతి ఒప్పందం కుదిరినా అది ఎక్కువ కాలం నిలుస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో శాంతిని ఎక్కువ కాలం కొనసాగనివ్వదని, ఏదో ఒక కారణంతో మళ్లీ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా నలుగుతున్న గాజా సంక్షోభం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాల వెనుక 1917, 1948 నాటి సుదీర్ఘమైన చరిత్ర దాగి ఉందని, దీన్ని కేవలం ఒకట్రెండు రోజుల్లో పరిష్కరించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, ఒకప్పుడు అంతర్జాతీయ సమస్యలపై పెద్దగా జోక్యం చేసుకోని భారతదేశం.. ఇవాళ గ్లోబల్ క్రైసిస్‌ను సెటిల్ చేయగల లీడర్‌గా ఎదగడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపి, వేలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను కాపాడటంలో భారత్ గనుక ముందడుగు వేస్తే.. విశ్వగురువుగా ఇండియా కీర్తి ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.