తెలంగాణ బిజెపి లీడర్లకి సీఎం రేవంత్ రెడ్డి భయం పట్టుకుంది.ఎక్కువ తక్కువ చేస్తే ఎన్నికల తర్వాత రేవంత్ ని పార్టీలోకి తీసుకొచ్చి పార్టీ అప్పచెప్పుతామని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అధికారం కూడా ఆయనకే కట్టబెడతామని.... మీ భవిష్యత్తు మీరే డిసైడ్ చేసుకోండి అని పార్టీ హై కమాండ్ తెలంగాణ బిజెపి లీడర్లకు చాలా సీరియస్ గా చెప్పింది.హైదరాబాద్ పర్యటనలో బహిరంగ వేదికపై, ప్రధాని నరేంద్ర మోడీ .... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్న మాటలు ఇవి. మాతో చేయి కలపండి అంటూ ప్రధాని మోడీ అన్న ఈ మాటలు ఏదో ఆషామాషీగాను.... సరదాగాను అన్నది కాదు. ఆయన సీరియస్ గానే అన్నారు. రావాలని రేవంత్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.2029 తర్వాత కాంగ్రెసులో ఒక వర్గాన్ని చీల్చుకొని బిజెపిలో విలీనమైపోమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. అంతేకాదు తెలంగాణ బిజెపిలో కుమ్ములాటలతో పార్టీని ఆనాటికి బలహీన పరుస్తున్న నేతలు అందరికీ ఓపెన్ గా హెచ్చరిక జారీ చేశారు. అక్కడినుంచి బిజెపిలో రేవంత్ సెగ మొదలైంది.
20 29లో.... రేవంత్ బీజేపీలో చేరితే పరిస్థితి ఏంటి? మన చేతకానితనం వల్లే కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నీ వీడి బిజెపిలోకి వస్తున్నాడు. సమర్థులైన నాయకులు ఉంటే... బయట నుంచి రేవంత్ రెడ్డిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది. మీలో మీరు కుమ్ములాడుకోవడం వల్లే బయట పార్టీల నుంచి నాయకులు తీసుకురావాల్సి వస్తోంది. మీరు ఇలాగే ఒకరి కింద ఒకరు ఎర్త్ లు పెట్టుకుంటూ... ముందుకు వెళితే, రేవంత్ రెడ్డి ..హరీష్ రావు లో ఒకరు కచ్చితంగా పార్టీ పగ్గాలు అందుకుంటారు.... ఆ తర్వాత మీరు సెకండ్ గ్రేడ్ లీడర్స్ గానే మిగిలిపోతారు.... మీ ఇష్టం అంటూ బిజెపి హాయ్ కమాండ్ తెలంగాణ నాయకులకు స్పష్టంగా తెగేసి చెప్పేసింది. అప్పటినుంచి బిజెపి లీడర్స్ అందరికీరేవంత్ భయం పట్టుకుంది. ఇంత కష్టపడి పార్టీని తెలంగాణలో చేసుకుంటే, గద్ద వచ్చి కోడి పిల్ల నీ తనికెళ్ళిపోయినట్లు... రేవంత్ తెలంగాణ బిజెపిని కబ్జా పెడితే చేసేది ఏమీ లేదని బిజెపి నేతలకు అర్థమైంది. ఐ కమాండ్ గెలిపించే నాయకుడిని చూసుకుంటుంది తప్ప, శక్తిహీనులైన పాత నాయకులను నెత్తికెత్తుకోదనే విషయం బిజెపి గ్రూపులకి అర్థమైంది.
జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన సందర్భంగా లీడర్ లందరికీ అదే విషయం స్పష్టం చేశాడు.పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి... కుమ్ములాటలు మాత్రం కట్టి పెట్టండి చెప్పాడు.2029లో అధికారంలోకి రావాలంటే ఇష్టా ఇష్టాలు అన్నిటిని పక్కనపెట్టి కలిసి పనిచేయాల్సిందేనని ఉక్కుమ్ జారీ చేశాడు. దానిలో భాగంగానే చాన్నాలుగా కత్తులు దూసుకుంటున్న, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరికీ గట్టి వార్నింగ్ఏ పడింది. మీ ఇద్దరి వల్లే పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయని , ఇప్పటికైనా భేష జాలు పక్కనపెట్టి ఇద్దరూ కలిసి పనిచేయకపోతే కఠిన నిర్ణయాలు ఉంటాయని, నితిన్ నబీన్ ద్వారా హై కమాండ్ బండికి, ఈటల కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి... సఖ్యత కుదర్చాలని ఎంపీ లక్ష్మణ్ కు ఆ బాధ్యత అప్పజెప్పింది.
ఈటల రాజేందర్ ని మొదటి నుంచి బండి సంజయ్ వ్యతిరేకిస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి బిజెపికి వచ్చిన ఈటల రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మల్కాజ్గిరి ఎంపీగా ఎంపికైన తర్వాత కేంద్ర మంత్రి పదవి కోసం కూడా అంతే స్థాయిలో రకరకాలుగా ప్రయత్నించాడు. కానీ బండి సంజయ్ ఎత్తు గడల ముందు ఈటల అనుభవం పనిచేయలేదు.రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఈటల ఐకమండ్ కి ఆధారాలతో సమాచారం పంపి.... తెలివిగా బండి సంజయ్ అని దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ నుంచి ఎప్పటికీ బండి సంజయ్ కోలుకోలేకపోయాడు. బండి సంజయ్ విభేదాలతో ఈటల రాజేందర్ మళ్లీ కరీంనగర్ జిల్లా వైపు చూడలేదు. ఈ ఇద్దరి వర్గాలు కొమ్ములాటలతో తెలంగాణ బిజెపి మరింత బలహీన పడింది. వీళ్ళిద్దరిని సెట్ చేస్తే గాని తెలంగాణ బిజెపి బాగుపడదని హైకమాండ్ గుర్తించింది.
అందుకే వీళ్ళిద్దరికీ రాజు చేసి దారిలో పెట్టింది. అందుకు రేవంత్ నీ బూచిగా చూపించి భయపెట్టింది.బిజెపి హై కమాండ్ ఎలా చెప్తున్నప్పటికీ తెలంగాణలో బిజెపి నాయకులు అందరికీ రేవంత్ భయం లేకపోలేదు. రేవంత్ కి పార్టీలు మారడం కొత్తవి కాదు. బిజెపి, టిఆర్ఎస్, టిడిపి, ఆ తర్వాత కాంగ్రెస్ కి మారి ముఖ్యమంత్రి అయ్యారా ఆయన.తెలంగాణ బిజెపి నేతలు చేతకానితనాన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ కనక బీజేపీ వైపు వస్తే వీళ్ళ అందరి పని అయిపోయినట్లే. అందుకే ఇప్పుడు రేవంత్ భయంతో ఎవరికి వాళ్లు పార్టీని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. వీళ్ళ భయాన్ని చూసి బిజెపి హై కమాండ్ రేవంత్నే బూచిగా చూపెడుతోంది.