ఈ వారం థియేటర్లలోకి వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' సినిమా ఒకటి. 'కెజిఎఫ్' వంటి సంచలనాత్మక విజయాల తర్వాత యష్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ అంచనాలు, షాకింగ్ బుకింగ్స్‌తో ఈ సినిమా థియేటర్లలోకి దూసుకొచ్చింది. మరి ఈ సినిమా ఆ హైప్‌ను ఏ మేరకు అందుకుంది? సామాన్య ప్రేక్షకుడిని ఈ చిత్రం ఏ విధంగా అలరించింది అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ చిత్ర కథ 1947 నాటి కాలం నేపథ్యంలో సాగుతుంది. ఒక సినిమాకు రొటీన్ కథ ఉన్నప్పటికీ, కథనం ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. కానీ 'టాక్సిక్' చిత్రంలో బలమైన కథాంశం లోపించింది. కెజిఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రతి ఒక్కరూ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఆశిస్తారు, కానీ ఇక్కడ అది మిస్ అయింది.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పూర్తిగా బోల్డ్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ పైనే దృష్టి పెట్టారు. అయితే ఆమె ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. అనవసరమైన హంగులు, ప్రయోజనం లేని పాత్రలతో ట్రాక్ తప్పుతున్నట్లు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే డ్రామా ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. ముఖ్యంగా రుక్మిణి వసంత్ ట్రాక్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. అలాగే తెలుగు డబ్బింగ్ మరియు డైలాగ్స్ మరింత నేచురల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. గ్రాండ్ సెట్ వర్క్ సినిమాకు రిసల్ట్ తెచ్చిపెట్టింది. హాలీవుడ్ సంస్థ అందించిన విఎఫ్ఎక్స్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది.
రాజీవ్ కెమెరా వర్క్ విజువల్స్ పరంగా ఆకట్టుకుంటుంది. అయితే ఉజ్జ్వల్ కులకర్ణి ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండి, కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కొంచెం మైనస్ అయింది. మొత్తంగా చెప్పాలంటే, 'టాక్సిక్' సినిమాపై నెలకొన్న భారీ హైప్‌ను పూర్తిగా అందుకోలేకపోయింది. యష్ తన నటనతో, అనుభవంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, రచనాపరమైన లోపాలు సినిమాను దెబ్బతీశాయి. స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ మినహా.. బలం లేని కథ, సాగదీతగా అనిపించే సెకండాఫ్ ప్రేక్షకులకు నిరాశ మిగులుస్తాయి.