మహిళలకు ధన్యోస్మి మెగా హీరో…!

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందడి మామూలుగా లేదు. కానీ, అందరిలోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్

Post Published By: dialnews
Updated : 9 March 2026, 12:22 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం  శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆయన ఇచ్చిన సందేశం అందరినీ ఆలోచింపజేస్తోంది. మగతనం అంటే సోషల్ మీడియాలో అందరూ మగవారు అలా ఉండరు అని రాయడం కాదు, మన ప్రవర్తనతో దాన్ని నిరూపించాలి" అని తేజ్ పేర్కొన్నారు.

సమాజంలో తప్పు చేసే రాక్షసులు కొందరే ఉంటారు, కానీ ఆ తప్పును చూసి మౌనంగా ఉండేవారు ఎక్కువ మంది ఉంటారు. ఆ మౌనాన్ని వీడి మహిళల పక్షాన నిలబడటమే నిజమైన ధైర్యం. మహిళలకు ఏదైనా ఆపద వస్తే అందరూ ఏకమై ఒక 'వానర సైన్యం'లా వారి వెనుక రక్షణగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన "Stand With Her" క్యాంపెయిన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో మహిళలకు అండగా ఉండాలని ఈ వేదికపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టినప్పుడు వారు సర్దుకుపోవాలని చెప్పే సమాజం మారాలని ఆయన కోరారు. గత ఏడాది తన పేరును "సాయి ధరమ్ తేజ్" నుండి "సాయి దుర్గా తేజ్" గా మార్చుకున్న సంగతి తెలిసిందే. తన తల్లి మీద ఉన్న గౌరవంతో ఆమె పేరును తన పేరులో చేర్చుకున్నారు.

నా ప్రాణం, నా సర్వస్వం నా కన్నతల్లి" అని ఎప్పుడూ చెప్పే తేజ్, ఈ ఉమెన్స్ డే రోజున కూడా ప్రతి ఇంట్లో ఉండే మహిళను గౌరవించాలని, వారిని పూజించడం కంటే విలువనివ్వడం నేర్చుకోవాలని హితవు పలికారు. సాయి ధరమ్ తేజ్ కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. 'మహిళల పక్షాన నిలబడదాం.. వారి భద్రతకు బాధ్యత వహిద్దాం' అన్న ఆయన పిలుపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Published : 
  • 9 March 2026, 12:22 PM IST