వదినమ్మ వచ్చేసింది…!

గత ఎనిమిదేళ్లుగా సినీ అభిమానులు ఏ వార్త కోసమైతే వెయిట్ చేస్తున్నామో, ఆ శుభవార్త వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Post Published By: dialnews
Updated : 28 February 2026, 4:58 PM IST

గత ఎనిమిదేళ్లుగా సినీ అభిమానులు ఏ వార్త కోసమైతే వెయిట్ చేస్తున్నామో, ఆ శుభవార్త వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి తర్వాత విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తమ అభిమానులతో కన్నీళ్లు పెట్టిస్తోంది.

విజయ్ పెళ్లి తర్వాత ఆనంద్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మికను కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఒక బ్యూటిఫుల్ నోట్ రాశారు. 'చాలా కాలంగా నన్ను ఎక్కడ చూసినా ఫ్యాన్స్ అందరూ వదిన ఎలా ఉన్నారు? అని అడుగుతుండేవారు. అప్పుడు నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం అయ్యేది కాదు, కేవలం నవ్వి ఊరుకునేవాడిని. కానీ ఈరోజు నా అన్నయ్య పెళ్లి జరిగింది.. ప్రపంచంలోనే అత్యంత పాజిటివ్ మరియు దయాగుణం ఉన్న వ్యక్తిని నేను వదినగా పొందాను' అంటూ ఆనంద్ ఎమోషనల్ అయ్యారు.

ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ 'నేషనల్ క్రష్ ఇప్పుడు మా దేవరకొండ ఫ్యామిలీ వదిన' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే, ఈ పెళ్లి రెండు పద్ధతుల్లో జరిగింది. ఉదయం 10 గంటలకు విజయ్ వంశీయుల సంప్రదాయం ప్రకారం తెలుగు హిందూ పద్ధతిలో వివాహం జరగగా, సాయంత్రం రష్మిక మూలాలను గౌరవిస్తూ కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వేడుక నిర్వహించారు. వీరి పెళ్లికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా శుభాకాంక్షలు తెలపడం విశేషం.

Published : 
  • 28 February 2026, 4:58 PM IST