ఇటీవల దుబాయ్ వేదికగా అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ గ్రాండ్‌గా జరిగింది.. సోషల్ మీడియాలో ఈ పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకలో టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖ సోషలైట్స్, హీరోయిన్స్ సోఫీ చౌదరి, సహీబా బాలి వంటి వాళ్ళతో శిరీష్ క్లోజ్‌గా మూవ్ అవ్వడం, ఆ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సౌత్ ఈవెంట్లలో తక్కువగా కనిపించే ఈ బాలీవుడ్ భామలు.. శిరీష్‌తో కలిసి దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతన్ని హైలైట్ చేయడం చూస్తుంటే, అక్కడ ఏదో పెద్ద ప్లానింగే జరుగుతోందని అర్థమవుతుంది. సాధారణంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే అల్లు శిరీష్ చుట్టూ ఇంత సడెన్‌గా బాలీవుడ్ పీఆర్ హడావుడి కనిపించడం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. సోఫీ చౌదరి, సహీబా బాలి వంటి సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, బాలీవుడ్ సర్కిల్‌లో మంచి నెట్‌వర్క్ ఉన్నవాళ్ళే.
వాళ్లతో ఇంటరాక్షన్స్ ద్వారా శిరీష్ పేరును బీ-టౌన్ వర్గాల్లో నానబెట్టడమే ఈ పీఆర్ స్ట్రాటజీ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ముంబై మీడియా సర్కిల్స్‌లో అల్లు శిరీష్ గురించి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడానికి, అలాగే అక్కడ బలమైన పరిచయాలను పెంచుకోవడానికి ఈ దుబాయ్ పార్టీని ఒక వేదికగా వాడుకున్నారని స్పష్టమవుతోంది. ఈ పీఆర్ హడావుడి వెనుక ఉన్న అసలు కారణం.. టాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ బాలీవుడ్ ఎంట్రీ అని బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్లను అందించిన అల్లు అరవింద్ కాంపౌండ్.. ఇప్పుడు హిందీ చిత్రసీమలో కూడా తమ ముద్ర వేయాలని చూస్తోంది. గతంలో జెర్సీ వంటి రీమేక్స్‌తో అక్కడ అడుగుపెట్టినప్పటికీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ముంబైలో స్థాపించి, భారీ చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. పైగా అల్లు అర్జున్ ఇప్పుడు హిందీలో కూడా సూపర్ స్టార్.. ఆయన కోసం టాప్ ప్రొడక్షన్ హౌజ్‌లు పోటీ పడుతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి చూసుకునే బాధ్యతను అల్లు శిరీష్ భుజాన వేసుకున్నాడని ఇండస్ట్రీ టాక్. తన పెళ్లితో ఈ ప్రమోషన్ మొదలుపెట్టాడు శిరీష్. అలా చేస్తే స్వామికార్యం స్వకార్యం పూర్తైపోతాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అల్లు శిరీష్ బాలీవుడ్ వెళ్తోంది నటుడిగా కాదు.. పూర్తిగా నిర్మాత అవతారంలోనే..! హీరోగా తెలుగులో సినిమాలు చేస్తూనే, తనలోని బిజినెస్ స్కిల్స్‌ను బయటపెడుతూ గీతా ఆర్ట్స్ హిందీ విభాగానికి బాస్ రేంజ్‌లో వ్యవహరించనున్నారని తెలుస్తుంది. కథల ఎంపిక, కాస్టింగ్, బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కొలాబరేషన్స్ వంటి కీలక బాధ్యతలను శిరీష్ నిర్వర్తించనున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్పతో ఉత్తరాదిలో మెగా బ్రాండ్‌కు బీభత్సమైన క్రేజ్ వచ్చింది.. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి శిరీష్ నిర్మాతగా మారుతున్నారన్నమాట. మొత్తానికి దుబాయ్ పార్టీ కేవలం విందు వినోదాల కోసమే కాదు, భవిష్యత్తు వ్యాపార విస్తరణ కోసమని అర్థమవుతోంది. అల్లు అరవింద్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. అల్లు శిరీష్ ఇప్పుడు గీతా ఆర్ట్స్ జెండాను బాలీవుడ్ గడ్డపై ఎగురవేయడానికి రెడీ అయ్యాడు.