రామ్ చరణ్ 'రై రై రా రా' పాటపై చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చిరంజీవి తన పోస్ట్‌లో చరణ్‌ను చూసి చాలా గర్వంగా ఉంది అని పేర్కొన్నాడు. స్క్రీన్‌పై ఇది కేవలం పాట కాదు, ఒక ఫైర్ అని వర్ణించాడు. చరణ్ డ్యాన్స్‌లో ఉండే ఎలక్ట్రిఫయింగ్ స్పీడ్, ఎఫర్ట్‌లెస్ గ్రేస్ తనను ముగ్ధుడిని చేశాయని చిరు రాసుకొచ్చాడు. చరణ్ కదలికలు చూడటం ఒక కనులవిందు" అని చెప్పడం మెగా ఫ్యాన్స్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చింది.
చిరంజీవి పోస్ట్‌కు స్పందిస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు ఒక ఎమోషనల్ విషయాన్ని బయటపెట్టాడు. ఈ పాట షూటింగ్ సమయంలో చరణ్‌కు తీవ్రమైన జ్వరం ఉందట. షూటింగ్ ఆపేద్దామని యూనిట్ చెప్పినా, చరణ్ వినకుండా అదే ఎనర్జీతో డ్యాన్స్ చేశారట. "ఈ అటిట్యూడ్, ఈ డెడికేషన్ అంతా మీ నుంచి వచ్చిందే సార్" అని బుచ్చిబాబు పేర్కొనడం విశేషం.ఆస్కార్ విజేత AR రెహమాన్ అందించిన మాస్ బీట్ మరియు వోకల్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. మొత్తానికి మెగాస్టార్ మెచ్చిన పాట, ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.