తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పేరు ఒక సంచలనం. 'అర్జున్ రెడ్డి'తో మొదలైన ఆయన ప్రస్థానం, బాలీవుడ్లో 'కబీర్ సింగ్', 'యానిమల్' సినిమాలతో గ్లోబల్ స్థాయికి చేరుకుంది. కేవలం మూడంటే మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లు రాబట్టడమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన 'రా' అండ్ 'ఇంటెన్స్' మేకింగ్ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నారు సందీప్. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రేజీ డైరెక్టర్ మనసులో ఒక తీరని కోరిక, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందట. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!
సందీప్ రెడ్డి వంగాకు ప్రపంచ ప్రఖ్యాత లెజెండరీ సింగర్, కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ అంటే ప్రాణం. మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఒక భారీ బయోపిక్‌ను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనేది సందీప్ డ్రీమ్. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మైఖేల్ జాక్సన్ జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.
చిన్నతనంలోనే 'జాక్సన్ 5' బ్యాండ్‌తో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత సోలో స్టార్‌గా ఎదిగి ప్రపంచాన్ని తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించడం నిజంగా ఒక అద్భుతమైన కథ అని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, ఇంతటి గొప్ప ప్రాజెక్టును పట్టాలెక్కించడంలో సందీప్‌కు ఒక ప్రధానమైన చిక్కు వచ్చి పడింది. అదే 'నటుడి ఎంపిక'. మైఖేల్ జాక్సన్ పాత్రను తెరపై ఎవరు పోషించగలరు? అనేది అసలు ప్రశ్న అని సందీప్ ఆగిపోయారట. జాక్సన్ బాడీ లాంగ్వేజ్ఆయన సిగ్నేచర్ డ్యాన్స్ మూవ్స్స్టేజ్ ప్రెజెన్స్అన్నింటికీ మించి ఆ వ్యక్తిత్వంలోని ఇంటెన్సిటీని పలకించడం ఏ నటుడికైనా ఒక అతిపెద్ద సవాల్ అని సందీప్ అభిప్రాయం. మైఖేల్ జాక్సన్ ఎదుర్కొన్న అవమానాలు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు, ఆయన చర్మం రంగు మార్పు గురించి వచ్చిన విమర్శలు.. ఇలా ప్రతి దశలోనూ ఒక గొప్ప డ్రామా ఉంది. అయితే, ఈ లెజెండ్‌ను తెరపై సజీవంగా చూపించే నటుడు దొరక్కపోవడమే ఈ సినిమా పట్టాలెక్కకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
సందీప్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్న తరుణంలోనే, హాలీవుడ్ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా 'మైఖేల్' పేరుతో ఒక బయోపిక్‌ను తెరకెక్కించారు. ఇందులో మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ కథానాయకుడిగా నటించడం విశేషం.సొంత మేనల్లుడు కావడంతో జాఫర్.. మైఖేల్ జాక్సన్ రూపురేఖలను, స్టైల్‌ను అద్భుతంగా ప్రతిబింబించాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, అప్డేట్స్ చూస్తుంటే, మైఖేల్ మళ్ళీ బతికి వచ్చాడా? అన్నట్లుగా జాఫర్ నటన ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగా ఫోకస్ అంతా ప్రభాస్ 'స్పిరిట్' మరియు అల్లు అర్జున్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌లపైనే ఉంది. కానీ, భవిష్యత్తులో సరైన నటుడు దొరికితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మైఖేల్ జాక్సన్ కథను తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే అవకాశం లేకపోలేదు.ఒకవేళ వంగా గనుక మైఖేల్ జాక్సన్ సినిమా తీస్తే, అందులో ఎమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదూ! మరి సందీప్ రెడ్డి వంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ఎప్పటికి నెరవేర్చుకుంటారో చూడాలి.