స్పిరిట్ లోకి చిరు వస్తే మెగాకిక్.. కానిపనని తెలిసినా..?
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీస్తోన్న మూవీ స్పిరిట్. రౌడీ పోలీస్ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రోల్ వేస్తున్నట్టు మనశంకర వర ప్రసాదు గారు కి ముందు అన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీస్తోన్న మూవీ స్పిరిట్. రౌడీ పోలీస్ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రోల్ వేస్తున్నట్టు మనశంకర వర ప్రసాదు గారు కి ముందు అన్నారు. కాని ఆ సినిమా వచ్చి వసూల్ల వరద తెచ్చింది… అయినా స్పిరిట్ లో చిరు గెస్ట్ రోల్ కన్ఫామ్ కాలేదు. ఇక సినిమా టీం అయితే ఏకంగా అలాంటిదేం లేదని తేల్చింది. కేవలం చిరుకి సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్ అవటం వల్లే, ఇలా అంతా ఊహించుకుంటున్నారన్నారు. కాకపోతే స్పిరిట్ లో చిరు నటించాలని కోరుకునేది మాత్రం మెగా అభిమానులే అన్న కొత్త ప్రచారం ఊపందుకుంది. ఎస్ పీ పరుశురామ్ మూవీకి, స్పిరిట్ కి ఉన్న లింకే అందుకు కారణం అంటున్నారు.. ఇంతకి ఆ లింకేంటి? స్పిరిట్ లో చిరు ఎందుకు నటించాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు?
రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లోతెరకెక్కే స్పిరిట్ లో మెగా స్టార్ చిరంజీవి అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దర్శక నిర్మాతలు అలాంటిదేం లేదని ఓపెన్ గా తేల్చారు. అయినా రూమర్లు ఆగలేదు. రీసెంట్ గా కూడా ఇవే రూమర్లు రీసౌండ్ చేశాయి. ఎక్కువ శాతం ఈ ప్రచారం జరగటానికి రెండు రీజన్స్ ఉన్నాయి.ఆ కారనావల్లే ఇది నిజం అయ్యేలా ఉంది… మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో గతంలో చేసిన ఎస్ పీ పరశురామ్ స్టోరీ లైన్ ప్రేరణతోనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కథ సిద్దం చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇందులో తండ్రి లాంటి పాత్ర ఒకటి పవర్ ఫుల్ గా ఉండబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ప్రభాస్ తండ్రిగా చిరు కనిపిస్తాడని కాదు, కాని పాత్ర ఓరేంజ్ లో ఉంటే చెప్పలేం…
ఐతే మెగా ఫ్యాన్స్ కి మాత్రం సందీప్ రెడ్డి వంగ బేసిగ్గా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అవటం వల్ల, తన మేకింగ్ లో చిరుని చూడాలనే క్యూరియాసిటి పెరుగుతోంది. ఎప్పుడో బ్లాక్ అండ్ వైజ్ జమనాలో చిరు ఫోటోని తన ఇట్లో పెట్టుకున్న సందీప్, ఎప్పుడో వచ్చిన మాస్టర్ మూవీలో చిరు సిగరెట్ సీన్ గురించి వివరించినప్పటి నుంచి, మెగా ఫ్యాన్స్ ఆటోమెటిగ్గా సందీప్ ఫ్యాన్స్ అయిపోయారు.అందుకే సందీప్ మేకింగ్ లో చిరు వస్తే, మెగా సునామీనే అన్న అంచనాలున్నాయి. అందుకు సందీప్ కూడా సిద్దమే. కాని కథ కూడా సూట్ అయ్యేలా కుదరాలి కదా… దానికోసమే వేయిటింగ్ అన్నాడు సందీప్… అందుకే ఈలోపు స్పీరిట్ కి ప్రేరణ ఎస్పీ పరశురామ్ అవటం, అందులో హీరో తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండటంతో, చిరునే ఆ పాత్ర వేస్తే క్రేజీగా ఉంటుందనేగి మెగా అభిమానుల అభిప్రాయం అంటున్నారు.
నిజం చెప్పాలంటే, ప్రభాస్ మూవీలో నిజంగా చిరంజీవి కనిపిస్తే చాలు, అదో సెన్సేషన్ అయ్యేచాన్స్ఉంది. ఇలాంటి సీనియర్, జూనియర్ కాంబినేషన్ ఎప్పుడూ కిక్ ఇస్తూనే ఉంటుంది. యానిమల్ లో కూడా రణ్ బీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ పాత్ర మెస్మరైజింగ్ గానే ఉందన్నారు. సో అదే అంత సెన్సేషన్ అయితే చిరు, ప్రభాస్ కాంబినేషన్ సెన్సేషన్ అవటం చాలా చాలా నార్మల్.. సందీప్ రెడ్డి వంగ టీం నుంచి అయితే స్పిరిట్ లో చిరు చేయట్లేదనే క్లారిటీ వచ్చినా, ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మాత్రం సందీప్ ని ఒక క్షణం ఆగి ఆలోచించేలా చేసిందట. ఇలా ఒక మార్పు జరిగిందనటానికి రీజన ,చిరుని సందీప్ కలిసినప్పుడు ఇదే డిస్కర్షన్ రావటం.. అది బయటికి లీక్ అవటం.. సో మరి సందీప్, చిరు డిస్కర్షన్ మరి ఈ రూమర్ ని నిజం చేస్తాయా? చూడాలి.











