సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పేరు చెబితే చాలు.. ఇటు గ్లామర్, అటు కాంట్రవర్సీలు గుర్తొస్తాయి. ఎప్పుడూ తన హాట్ ఫోటోషూట్స్ మరియు బోల్డ్ స్టేట్‌మెంట్లతో వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరో కొత్త అడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. అదే 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' ఫీచర్. సాధారణంగా సెలబ్రిటీలు తమ ఫోటోలను, వీడియోలను అందరికీ అందుబాటులో ఉండేలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. కానీ, అషు రెడ్డి తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం ఈ పెయిడ్ సర్వీస్‌ను ప్రారంభించారు. అంటే ఆమె చేసే కొన్ని ప్రత్యేకమైన పోస్ట్‌లు, లైవ్ వీడియోలు లేదా పర్సనల్ అప్‌డేట్స్ చూడాలంటే అభిమానులు కొంత మొత్తాన్ని చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ దారిలో అషు రెడ్డి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఆమె సంపాదన చూస్తే అర్థమవుతోంది. ఈ ఫీచర్ లాంచ్ చేసిన మొదటి రోజే సుమారు 3 లక్షల రూపాయల ఆదాయం లభించినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది.దాదాపు 700 మందికి పైగా అభిమానులు వెంటనే ఆమె సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారట.కేవలం 24 గంటల్లోనే ఇంత భారీ మొత్తంలో డబ్బు రావడం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.డబ్బు సంపాదించడంలో అషు రెడ్డి చూపిస్తున్న ఈ స్పీడ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే, ఈ విషయంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఇలాంటి ట్రెండ్స్‌ను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
పర్సనల్ అప్‌డేట్స్ పేరుతో అషు రెడ్డి సోషల్ మీడియాలో అసభ్యతను పెంచుతున్నారు. కేవలం తన గ్లామర్‌ను అడ్డుపెట్టుకుని యువత నుంచి డబ్బులు వసూలు చేయడం సరికాదు అనేది విమర్శకుల వాదన. మరికొందరు మాత్రం, అషు రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్‌ను వ్యాపారంగా మార్చుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారని అంటున్నారు. నేటి డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేటర్స్ తమ కంటెంట్ ద్వారా డబ్బు సంపాదించడం తప్పు కాదని వారి అభిప్రాయం. కానీ, ఆ కంటెంట్ ఏ రకంగా ఉంది? అది సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అషు రెడ్డి రేంజ్ పూర్తిగా మారిపోయింది. వరుసగా ఫోటోషూట్స్, టీవీ షోలు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటూనే, ఇలాంటి కొత్త ఫీచర్లతో ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటోంది. అయితే, ఈ విమర్శల పట్ల అషు రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి. కేవలం ఆదాయమే లక్ష్యంగా ముందుకు సాగుతుందా లేక తన కంటెంట్‌లో ఏవైనా మార్పులు చేసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.