బాబాయ్ కోసం అబ్బాయ్… అబ్బాయ్ తో బాబోయ్ నిజమా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఇద్దరు కలిస్తే నందమూరి అభిమానులకు పండగే. కాకపోతే పొలిటికల్ గ్యాప్, లేదంటే మరో రకంగా ఏదోలా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే అభిప్రాయం జనాల్లో ఉంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 22, 2026 | 06:45 PMLast Updated on: Jan 22, 2026 | 6:45 PM

Interest News About Balakrishna And Ntr Movie Combo

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఇద్దరు కలిస్తే నందమూరి అభిమానులకు పండగే. కాకపోతే పొలిటికల్ గ్యాప్, లేదంటే మరో రకంగా ఏదోలా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే అభిప్రాయం జనాల్లో ఉంది. గతంతో పోలిస్తే ఈ ఇద్దరు ఒకరి ప్రస్థావన మరొకరు తీసుకురావటం కూడా బాగా తగ్గించారు.. కాని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో జై బాలయ్య అంటూనే ఉన్నాడు.. ఏవో చిన్నా చితకా అంశాల విషయంతో గ్యాప్ ఉంటే నామ్ కే వాస్తే ఉందనే అభిప్రాయమే తప్ప, చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఉన్నట్టు ఎక్కడా ఓ వార్తలేదు.. అలాంటి టైంలో ఈ ఇద్దరు కలిసి ఒకే తెరమీద కనిపిస్తే ఎలా ఉంటుంది…? అలా జరుగుతుందా? అంత సీన్ ఉందా? కదిలించే కథలు ఈ ఇద్దరిలో కదలిక తేకపోవచ్చు.. కాని నవ్వించే కథే ఈ ఇద్దరిని కలిపేలా ఉంది.. అదే జరిగితే బాబాయ్ తో అబ్బాయ్ కాంబినేషన్ తో సెన్సేషనే క్రియేట్ అవుతుంది. అలాని ఇద్దరు కలిసి సినిమాచేయటం కాదు… కాకపోతే ఒకే సినిమాలో మాత్రం ఈ ఇద్దరు కలవబోతున్నారు… అదే జరిగితే ఆ క్రెడిట ఒకరికే దక్కుతుంది? ఇంతకి ఎవరా ఒక్కరు?

నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటిస్తే చూడాలనేది సగటు నందమూరి అభిమాని కోరిక… అది తీరాలంటే కత్తిలాంటి కథ, దాన్ని తీసే దర్శకుడే కాదు, మీడియాలో, వినిపిస్తున్న బాబాయ్, అబ్బాయ్ మధ్య గ్యాప్ అన్న డౌట్లకు గేట్లు పడాలి… అలాని ఇప్పడు ఈ ఇద్దరు తాము కలిసున్నామని ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలేదు.అలాని విడిపోయారని కాదు.. కాని టీడీపీకి దూరంగా ఎన్టీఆర్ ఉండటం, వైపీసీ మాటి మాటికి ఎన్టీఆర్ పేరు ప్రస్తావించటం లాంటివి, మీడియాలో పుకార్లకు కారణమౌతున్నాయి.. అయినా ఏ అకేషన్ వచ్చినా జై బాలయ్య అనుకుండా ఎన్టీఆర్ ఎన్నడూ లేడు.. కాబట్టి బాలయ్య, ఎన్టీఆర్ ఎవరి పనుల్లో వాల్లు ఉన్నంత మాత్రాన, ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోలేం..

అలానే, యంగ్ ఏజ్ లో ఎప్పుడూ ఒకరి గురించ మరొకరు ప్రస్తావించటం కుదరదు.. ఏజ్ పెరుగుతోంది. వర్క్ పెరుగుతోంది. ఎవరి పనుల్లో వాళ్లుండాల్సి ఉంటుంది… అంతేకాని తాము కలిసున్నామని మీడియా ముందు ప్రతీ సారి ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలేదనేది నందమూరి అభిమానుల మాట… అదెలా ఉన్నా, ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే అదో అద్భుతం అవుతుంది..అదే ఇప్పుడు జరిగేలా ఉంది. ఒకప్పుడు నటసింహం బాలయ్య నటించిన బాబాయ్ అబ్బాయ్ లాంటి కాన్సెప్ట్ తోనే అనిల్ రావిపుడి గాడ్ ఆఫ్ మాసెస్ ని కలిశాడట. ఆల్రెడీ బాలయ్యతో భగవంత్ కేసరి మూవీ తీశాడు. హిట్ మెట్టెక్కాడు. వెంకితో సంక్రాంతికి వస్తున్నాం,చిరుతో మన శంకర్ వర ప్రసాదు గారు లాంటి హిట్లిచ్చిన అనిల్ రావిపుడి, ఇప్పుడు వెంకీతో సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అంటూ సీక్వెల్ ప్లాన్ చేశాడన్నారు

కాని రియాలిటీచూస్తే వెంకీ ధృశ్యం మూడో సీక్వెల్ కి డేట్లిచ్చేశాడు. కాబట్టి అనిల్ రావిపుడి టార్గెట్ బాలయ్యే.. అందుకే తనని కలిసి బాబాయ్ అబ్బాయ్ కథ చెప్పినట్టు తెలుస్తోంది. అందులో అబ్బాయ్ గా ఎన్టీఆర్ 20నిమిషాల గెస్ట్ రోల్ ఉండేలా ఉంది. అదే తన కొడుకు మోక్షగ్నతో చేయాలా? కళ్యాణ్ రామ్ ని తీసుకోవాలా? అన్న డిస్కర్షన్ కూడా జరిగిందట. కాని ఎన్టీఆర్ తో అనిల్ రావిపుడి ఫోన్ లో మాట్లాడిన వెంటనే గెస్ట్ రోల్ కి ఓకే అన్నాడట. అది కథ వినకుండానే.. ఇదే ఏమాత్రం డిస్టర్ట్బ్ కాకుండా, అంతా అనుకున్నట్టు జరిగితే, రెండు సింహాలను ఒకే తెరమీద రెండు సార్లు చూసినట్టౌతుంది. ఆల్రెడీ డ్రాగన్ లో బాబాయ్ బాలయ్య ఫోటోని ఒక పాత్రకోసం వాడుతున్నారని తెలుస్తోంది.ఇప్పుడు అనిల్ రావిపుడి మేకింగ్ లో బాలయ్య చేసే సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ అంటే, బాక్సాఫీస్ బద్దలే..