NTR మారాడు… ఇక మారాల్సింది రెబల్ స్టారే…
మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మొహమాటం తక్కువనంటారు. సినిమా స్టోరీల విషయంలో తన సెలక్షన్ చాలా స్పెషల్ అంటారు. ఆ విషయంలో తనో విశ్వముదురు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మొహమాటం తక్కువనంటారు. సినిమా స్టోరీల విషయంలో తన సెలక్షన్ చాలా స్పెషల్ అంటారు. ఆ విషయంలో తనో విశ్వముదురు. తన మాట లానే, ఆలోచనకి పదునెక్కువ… కాని ఇన్ని ఉన్నా కొన్ని సార్లు వార్2, శక్తి మూవీ లాంటి నిర్ణయాలు తనకి ఎదురు దెబ్బ తగిలేలా చేశాయి. అందుకే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నుంచి నెల్సన్ దిలీప్ ప్రాజెక్ట్ వరకు ఎక్కడ మొహమాట పడట్లేదు. వార్ 2 విషయంలో టాప్ ప్రొడ్యూసర్ అన్న ఉధ్దేశ్యంతో మొహపాట పడ్డ తారక్, తర్వాత షారుఖ్ ఖాన్ కే షాక్ ఇచ్చాడు. మూడు హిందీ ఆఫర్లకు సింపుల్ గా నో చెప్పాడు… ఇదంతా బానే ఉంది.. కాని తనతో పోలిస్తే రెబల్ స్టార్ లో ఇలాంటి మార్పెప్పుడు వస్తుంది? తన మొహమాటమే తనకు శత్రువౌతోంది… మారుతి, సుజిత్, రాధాకృష్ణ, ఓం రౌత్ లాంటి దర్శకుల విషయంలో తన మొహమాటమే తన కొంపముంచింది. ఇకనైనా మారుతాడా? మొహాటాన్ని తను పక్కన పెడతాడా? అసలు పెట్టగలడా? డార్లింగ్ తారక్ లా మారేదెన్నడు?
నో చెప్పకపోవటం చాలా పెద్ద శాపం.. అదే రెబల్ స్టార్ ప్రభాస్ ని వెంటాడుతోందా? లేదంటే తన అతిమంచితనాన్ని అంతా క్యాష్ చేసుకుంటున్నారా? పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా తనలో ఎలాంటి మార్పులేదు. రెబల్ స్టార్ అందరి వాడు.. మంచి వాడు.. అందరికి డార్లింగ్ అనిపించుకునేంత కూల్ పర్సన్ అంటారు..కొన్ని సార్లు మంచి వాడనిపించుకోవటంతో, ముంచటమే తప్ప, ఆ పేరుతో వచ్చేదేముండదు.. ఇది సాధారణంగా చాలా నష్టపోయినవాల్ల నుంచి వచ్చే కామెంట్.. రెబల్ స్టార్ ప్రభాస్ కి అంత నష్టమేమి లేదు.. కాని తను కష్టపడకుండా, కేవలం అలా నడిచొస్తూ కనిపిస్తేనే, వెండితెర వెలిగిపోతుంది. అలాంటి ఔరా ఉన్న నటుడు ప్రభాస్.. అలాంటి స్టార్ కి కత్తిలాంటి కథ కాదు, యావరేజ్ కథ పడ్డా, వసూళ్ల వరదలొస్తాయి..అలాంటి తనతో మరీ కథలో లోపం తప్ప మరేం లేని సినిమాలు ప్లాన్ చేస్తే ఎలా? మారుతి అసలు ప్రభాస్ ని హ్యాండిల్ చేసే సత్తా ఉన్న దర్శకుడేనా? ఇలా అనటం కూడా కరెక్ట్ కాదు.. కాని ఒక స్టార్ ఇమేజ్ కి తగ్గ కథ తోరాని దర్శకుడిని, ఇలానే ప్రశ్నించాల్సి వస్తుంది… ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి వచ్చే స్పందన. అప్పట్లో సుజీత్ డైరెక్షన్ లో సాహో మూవీ చేశాడు ప్రభాస్..
కేవలం ప్రభాస్ లుక్, తన పెర్ఫామెన్స్, తన ఇమేజ్ వల్లే వీక్ కంటెంట్ కూడా 450 కోట్లు రాబట్టింది… దటీస్ ప్రభాస్ ఇమేజ్. కాని సాహో లో స్క్రిప్ట్ లోపాలు లెక్కలేన్నని.. ఇక రాధేశ్యామ్ పరిస్థితేంటి? జిల్ లాంటి మూవీ తప్ప మరో సినిమా చేయని, తన సత్తా ఏంటో తెలియని కుర్ర దర్శకుడు రాధాకృష్ణకు ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్..కేవలం నాలుగు ఏళ్లు వేయిట్ చేశాడని సుజిత్ కి, అలానే తనతో ట్రావెల్ అయ్యాడని రాధాకృష్ణకు ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ తన ఇమేజ్ కి తగ్గ ప్రాజెక్టులు చేయలేదు. తన ఇమేజ్ భారాన్ని మోసేంత సత్తా ఉన్న దర్శకులతో సినిమాచేయలేదు.. అంతా మొహామాటమేనా? మారుతికి అలానే ఆఫర్ చేసి, రాజాసాబ్ గా 1000 కోట్ల పరుగుకి బ్రేక్ వేసుకున్నాడా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా గతంలో అశ్వినీదత్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ అడిగాడని శక్తి చేస్తే, మోహర్ రమేష్ పుణ్యమాని అది ప్లాన్ అయ్యిందంటారు. తర్వాత హిందీలో టాప్ ప్రొడ్యూసర్ అదిత్య చోప్రా అడిగాడని వార్ 2 లో గెస్ట్ రోల్ చేస్తే,ఎన్టీఆర్ ని ట్రోల్ చేయటం ఒక వైపు, సినిమా రిజల్ట్ రివర్స్ అవటం మరో వైపు.. ఇలా రెండు దెబ్బలు తగిలాకే మొహమాటాన్ని పక్కన పెట్టాడు ఎన్టీఆర్. అందుక షారుఖ్ అడిగాన పటాన్ 2 లో గెస్ట్ రోల్ కి నోచెప్పాడు… అజయ్ దేవ్ గన్ కి కూడా నో చెప్పాల్సి వచ్చిందట. కేవల కథ బాగుంటేనే సరి, లేదంటే లేదు… అలాంటి మార్పు ప్రభాస్ లో కూడా రావాలనేది సగటు అభిమాని కోరిక… ఇలా కుర్రదర్శకుల మీద జాలిపడో, దయ చూపో, లేదంటే నో చెప్పలేకనో ఇలా మొహానాటానికి పోతే, మొదటికే మోసం వస్తుంది.. కాబట్టి కథ, దర్శకుడు ఈ రెండు తప్ప, జాలికి చోటులేకుండా ప్రాజెక్టులు ఎంచుకోవాలి ప్రభాస్.. ఇది సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి పెరిగిపోతున్న రిక్వెస్టుల ట్రెండ్.











