మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సేఫ్ గేమ్ అన్న కాన్సెప్ట్ కే నీల్లొదిలాడు.. రిస్క్ లేందే రికార్డులుండవు.. అలాని రికార్డులకోసం కథల్ని ఎంచుకోవట్లేదు.. ప్రాజెక్టుల విషయంలో తను ఏమాత్రం తగ్గట్లేదు. పాన్ ఇండియా స్టార్ గా మారాక కూడా తనకి, ఇప్పుడు తన ఇమేజ్ నచ్చట్లేదా? త్రిబుల్ ఆర్ తో 1450 కోట్ల రికార్డు దక్కింది. నాటు నాటు పాట గ్లోబల్ గా పేలింది. దేవర తో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన క్రెడిట్ దక్కింది. అయినా తన కెరీర్ ని రీడిజైన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. అంటే మళ్లీ కొత్త హీరోల మొదటి నుంచి షురూ చేస్తాడా? అంత అవసరమేమొచ్చింది. డ్రాగన్ ఏమాత్రం బాగున్నా 1000 కోట్లు మినిమమ్ గ్యారెంటీ. అంతకుమించి వస్తే, బోనస్సే.. అయినా సరిపోదు.. అందుకే మైథాలజీలో కూడా మాస్, కమ్ యాక్షన్ డ్రామాని మిక్స్ చేయిస్తున్నాడట. ఇంతకి ఎన్టీఆర్ మనసులో ఏముంది... తోటి పాన్ ఇండియా హీరోలతో పోలికే కాదు, అసలు పాన్ ఇండియా మార్కెట్ తాలూకు ఫార్ములానే పక్కన పెడుతున్నాడు. సేఫ్ గేమ్ వద్దంటున్నా కాని, సేఫ్ జోన్ ని వదలట్లేదు.. ఇంతకి తన కొత్త స్ట్రాటజీ ఏంటి?
ఎన్టీఆర్ తన బ్రాండ్ ఇమేజ్ ని రీబిల్డ్ చేస్తున్నాడు. సేఫ్ గేమ్ లొద్దు.. రిస్కులే ముద్దంటున్నాడు. బాహుబలి ఇమేజ్ లో ఇరుక్కున్నాక, అందులోంచి బయట పడేందుకు ప్రభాస్ చాలా ప్రయోగాలు చేశాడు. కాని అన్నీంట్లో కామన్ గా ఒక మిస్టేక్ చేశాడు. అదే ఫార్ములా ప్రాజెక్ట్స్... పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక, ఆరేంజ్ లోనే కథలు, పాత్రలు, మేకింగ్ ఉండాలని, లార్జర్ దేన్ లైఫ్ అనిపించే సినిమాలే చేశాడు.ఆప్రాసెస్ లోనే సాహో వచ్చింది. కొంతవరకు పర్లేదనిపించినా, స్క్రిప్ట్ పరంగా చాలా వీక్ కంటెంట్ అన్నారు. కేవలం ప్రభాస్ వల్లే అది అంతగా ఆడింది. రాదేశ్యామ్ ఓ చిన్న హీరో చేయాల్సిన మూవీ.. కేవలం ప్రభాస్ కోసమే, అంతబడ్జెట్ పెట్టారు.. ఇవన్నీ చూసే ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డట్టున్నాడు. ఎంత పాన్ ఇండియా హిట్లు పడ్డా, పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ వచ్చినా, ప్రతీ మూవీని భారీతనం తో తీయటం కాదు, కంటెంట్ లో భారీతనం పెంచాలని ఫిక్స్ అయ్యాడు.
అందుకే స్టార్ డమ్ ని ఎంజాయ్ చేయటం కాదు.. సరికొత్త్ స్టార్ డమ్ ని క్రియేట్ చేసే జోనర్లు, పాత్రలు, కంటెంట్స్ ని ఎంచుకుంటన్నాడు. అందుకోసం, తెలుగు దర్శకులే కాదు, తమిళ, మలయాళ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు.
ఇదే దారిలో తను అనుకున్నట్టే డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్, నెల్సన్ దిలీప్ మేకింగ్ లో డార్క్ కామెడీ ఇవన్నీ వర్కవుట్ అయితే... అన్ని జోనర్స్ లో గొప్ప పెర్పార్మన్ అనిపించుకున్న కమల్ హాసన్ లా దేశవ్యాప్తంగా స్థిరమైన ఇమేజ్ ని గుర్తింపుని దక్కించుకున్న వాడవుతాడు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి దేశవ్యాప్తంగా ఎంత ఇమేజ్ ఉన్నా, ఫార్ములా మూవీస్ చేస్తే ఫ్లాపవుతాయని తేలింది. అదే కమల్ మాత్రం కంటెండ్ డ్రివెన్ స్టోరీస్ చేసి విక్రమ్ తో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు.. సో ఓరకంగా కంటెంటే కింగ్ అన్న రూట్లో ఎన్టీఆర్ వెలుతున్నాడు. అందుకే వార్ 2 దెబ్బ తగిలినప్పటి నుంచి మొహమాటం లేకుండా కంటెంట్ ని, డైరెక్టర్స్ ని చూస్ చేసుకుంటున్నాడు.ఒక వేల ఎన్టీఆర్ ఇప్పుడు ఎంచుకున్న సేఫ్ గేమ్ వద్దు, రిస్క్ తో పంచ్ లు పడ్డా పర్లేదు కాని, లాంగ్ రన్ లో పాన్ ఇండియా లో జెండా పర్మినెంట్ గా పాతాలన్న ఐడియా వర్కవుల్ అయితే లెక్కలు మారిపోతాయి. తనకి పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ కాదు, పాన్ ఇండియా బెంచ్ మార్క్ స్టార్ గా మారే ఛాన్స్ఉంది. అందుకే తాత్కాలిక హిట్లకంటే, నిధానంగా సౌత్ నార్త్ ని ఏలేలా జోనర్లు, సినిమాలో ఫ్లేవర్లు ఎంచుకుంటున్నాడు.