1200 కోట్ల సినిమా వదిలేది లేదు.. కల్కీ 2 ON TRACK..
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సీక్వెల్ ప్రాజెక్టులో కదలిక మొదలైంది. ఇవాలే నాగ్ అశ్విన్ టీం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టింది.
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సీక్వెల్ ప్రాజెక్టులో కదలిక మొదలైంది. ఇవాలే నాగ్ అశ్విన్ టీం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టింది. కథ ఎప్పుడో సిద్దం.. ఇక సిద్దమవ్వాల్సింది రెబల్ స్టార్ డేట్లు, అందుకు తగ్గట్టు రెడీ అవ్వాల్సిన సెట్లు… ఆ పనులో మొదలయ్యాయా? బాహుబలి 2 తర్వాత ఆరేంజ్ లో పాన్ ఇండియా మొత్తాన్ని ఒకే స్థాయిలో షేక్ చేసిన సినిమా అంటే కల్కీనే… అలాంటి మూవీకి సీక్వెల్ ని మరి ఇంకా సాగతీయటం అంటే, కలిసొచ్చే అంశాన్ని ఆవిరి చేసుకోవటమే. అందుకే కల్కీ 2 విషయంలో రెబల్ స్టార్ ఇప్పుడు నాగ్ అశ్విన్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టే కనిపిస్తున్నాడు.. ఫౌజీ ముందు రిలీజ్ అవుతుందా? స్పిరిట్ ముందొస్తుందా అన్న డిస్కర్సన్ జరుగుతున్న టైంలో, ఇప్పుడు సీన్లో కి కల్కీ సీక్వెల్ వచ్చింది. వచ్చేనెల రెండో వారం రెబల్ బాంబ్ పేల్చేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా రెడీ అయ్యాడా? వచ్చే నెల్లోనే కల్కీ 2 మొదలౌతుందా?
రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చి, ఫౌజీ పెండింగ్ పనులకు శ్రీకారం చుడుతున్నాడు. ఆల్రెడీ అరవై శాతం షూటంగ్ పూర్తైంది. మిగతా షూటింగ్ లో కూడా టాకీ పార్టే కాని, యాక్షన్ సీక్వెన్స్ లు, భారీ ఎపిసోడ్లేమ్ లేవు.. సోహార్డ్ లీ మూడు నెలల్లో మొత్తం షూటింగ్ ని కంప్లీట్ చేయొచ్చు.. హను రాఘవపూడీ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నాడు.ఆలెక్కన స్పిరిట్ కంటే ముందు ఫౌజీనే పూర్తవుతుంది.. కాబట్టి ఫౌజీనే ముందు రిలీజ్ అయ్యేందుకు అవకాశం ఉంది.. కాని రియాలిటీ మరోలా ఉంది… దాని ప్రకారం ఫౌజీ కంటే ముందు స్పిరిట్ వచ్చే ఛాన్స్ఉంది… సరే ఈ రెండీంట్లో ఏది ముందుస్తుందనే డిబేట్ అలా ఉంచితే, ఆల్ ఆఫ్ సడన్ గా కల్కీ సీక్వెల్ పనులు మొదలు పెట్టాడు నాగ్ అశ్విన్..
చెప్పాపెట్టకుండా, నాగ్ అవ్విన్ అండ్ దత్ ఫ్యామిలీ కల్కీ సీక్వెల్ మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీ అయ్యింది. ఎప్పటి నుంచో ఫిబ్రవరిలో కల్కీ సీక్వెల్ మొదలౌతుందని ప్రచారం జరుగుతోంది. కాని ఎలాంటి ఎనౌన్స్ మెంట్లు హడావిడి లేకపోయే సరికి, అవన్నీ జరిగే పనులుకావనుకున్నారు. కట్ చేస్తే ఫిబ్రవరి రెండో వారం నుంచి కల్కీ 2 మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ పాట కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.కల్కీ ని తీసినప్పుడే సీక్వెల్ పనులు కూడా 30శాతం పూర్తి చేసినట్టు నిర్మాతే తేల్చింది. కాబట్టి సీక్వెల్ కథ కూడా అప్పుడే రెడీ అని తేలిపోతోంది.
ఇక తేలాల్సింది రెబల్ స్టార్ ప్రభాస్ డేట్లు… ఇప్పటి వరకు కమిటైన సినిమాలు, హెల్త్ ఇష్యూల లాంటి అంశాలు స్పిరిట్, కల్కీ సీక్వెల్, సలార్ పార్ట్ 2 ల ఫేట్ ని మారుస్తూ, వాయిదాలాకు కారణమయ్యాయి.. ఐతే వచ్చేనెలలో మాత్రం కల్కీ 2 కోసం ప్రభాస్ డేట్లు కేటాయించటంతో, నాగ్ అశ్విన్ వేగం పెంచాడు.ప్రజెంట్ కల్కీ 2 మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి… ఫౌజీ కొత్త షెడ్యూల్ తర్వాత అంటే వచ్చేనెల రెండో వారాంతంలో కల్కీ 2 సెట్స్ పైకెళ్లొచ్చు… ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనుకుంటున్నారు. సో స్పిరిట్, ఫౌజీ తోపాటు ప్రభాస్ ఇకనుంచి కల్కీ సీక్వెల్ సెట్లో కూడా దర్శనమివ్వటం కన్పామ్ అయ్యింది. ఒకేసారి మూడు సెట్ల మధ్య జర్నీ చేస్తూ బిజీ కాబోతున్నాడు రెబల్ స్టార్.











