670 కోట్లుకు డబుల్ ఎఫెక్ట్… 2027 దేవర ఈజ్ బ్యాక్..!
ఎన్టీఆర్ దేవర 2 విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత. ఒకే ఒక్క మాట..మే లో మూవీ మొదలౌతుంది.. వచ్చే ఏడాది వస్తుంది..
ఎన్టీఆర్ దేవర 2 విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత. ఒకే ఒక్క మాట..మే లో మూవీ మొదలౌతుంది.. వచ్చే ఏడాది వస్తుంది… ఈ స్టేట్ మెంట్ అంత కాన్ఫిడెంట్ గా ఇవ్వటానికి రీజన్ ఉంది… మ్యాన్ ఆప్ మాసెస్ ఎన్టీఆర్ విజనే అక్కడ కనిపిస్తోంది. ఆల్రెడీ డ్రాగన్ ప్రజెంట్ షెడ్యూల్ పూర్తైంది.. కొత్త షెడ్యూల్ తర్వాత ఇక త్రివిక్రమ్ ప్రాజెక్టే పట్టాలెక్కతుందనుకున్నారు. మధ్యాలో బన్నీ ఎపిసోడ్, కథ ని కబ్జా చేశారన్న వివాదం, ఇవన్నీ ముగిసిపోయాయి.. మాటల మాంత్రికుడు కూడా సారి చెప్పి గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాడని కూడా ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో దేవర నిర్మాత ఇచ్చిన స్టేట్ మెంట్ తో దేవర సీక్వెల్ పనులు మొదలైనట్టు తేలింది. 670 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాకు సీక్వెల్ రాబోతోందన్న మాట ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది.. కాకపోతే డ్రాగన్, దేవర 2, గాడ్ ఆఫ్ వార్ ఈమూడింట్లో ఏది ఎప్పుడు రాబోతోంది? ముందు డ్రాగనే వస్తుంది.. కాని తేలాల్సింది దేవర సీక్వెల్, గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టుల ఫేటే? సో నిర్మాత మాటలను బట్టి చూస్తే ఏమని తెలుస్తోంది? ఏది ముందు రాబోతోంది?
దేవర సీక్వెల్ ఇక మీదట ఏమాత్రం రూమర్ కాదు.. అది లేదని, రాదని, వస్తే గిస్తే ఇంకాస్త లేటుగా వస్తుందేమో లాంటి వార్తలకు బ్రేక్ పడుతోంది. నిర్మాతే ఈ సినిమా మే నుంచి మొదలౌతోందని తేల్చటం తో చాలా నెగెటివ్ ప్రచారాలకు బ్రేకులు పడ్డాయి. అంతా బానే ఉంది కాని ఈ సడన్ మార్పేంటి? అన్నీంటికంటే ముఖ్యంగా డ్రాగన్, తర్వాత త్రివిక్రమ్ సినిమా అన్నారు..మరి ఆ మూవీ అడ్డు పుడుతుంటే దేవర 2 ని ఎలా మే నుంచి మొదలు పెడతారు? ఇలాంటి డౌట్లకు కూడా క్లారిటీ దొరికినట్టే ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈవిషయంలో దర్శక నిర్మాతలకు క్లియర్ కట్ రూట్ మ్యాప్ ని, ఇచ్చేశాడట.. రూట్ మ్యాప్ అంటే ఏదో కాదు జస్ట్ తన డేట్లు ఇచ్చి ఏ సినిమా తర్వాత మరే మూవీ పట్టాలెక్కబోతోంది? ఏది ముందు వస్తుందన్నది అక్కడే తేలిపోతున్నాయి.
ముందుగా అన్నీంటికంటేముందుగా డ్రాగన్ నిప్పుల వర్షం కురిపించటం ఖాయం. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అని మొదట్లో అన్నారు. తర్వాత జూన్ రిలిజ్ అన్నారు. కాని దసరా, దీపావళి కూడా కాదని వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. జూన్ కల్లా టాకీ పార్ట్, దసరాకల్లా పాటల షూటింగ్ పూర్తవుతుందట… కాకపోతే ఈ గ్యాప్ లోనే త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్, కొరటాల శివ మేకింగ్ లో దేవర 2 తెరకెక్కుతుంటాయి…అయితే ఇందులో ఏది ముందు? ఏది తర్వాత అంటే మాత్రం, రిలీజ్ పరంగా చూస్తే దేవర సీక్వెలే ముందుని తెలుస్తోంది.
డ్రాగన్ సంక్రాంతికి ప్లాన్ చేస్తే దేవర సీక్వెల్ ని 2027 దసరాకు రిలీజ్ చేయాలనుకుంటోందట ఫిల్మ్ టీం. మే నెల్లో దేవర 2 సెట్స్ పైకెళ్లటం ఖాయం… దీనికంటే ముందే అంటే వచ్చే నెలలోనే త్రివిక్రమ్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ మొదలౌతుంది.. కాని రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచే అని తెలుస్తోంది..దేవరని మే నెలాఖర్లో పట్టాలెక్కించి జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ లోపు మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీ అయ్యాడు కొరటాల శివ. ఒకరకంగా నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి, దసరాకు డ్రాగన్, దేవర 2 ల రిలీజ్ డేట్లు ఫైనల్ అయినట్టే.. కాకపోతే త్రివిక్రమ్ మేకింగ్ లో ప్లాన్ చేసిన మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ మాత్రం 2028 లోనే వచ్చేలా ఉంది. మేకింగ్ కి, పోస్ట్ ప్రొడక్షన్ కి కాస్త ఎక్కువే టైం పట్టేలా ఉంది కాబట్టే, అలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.











