బాలయ్య కోసం అనిరుధ్…!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో మునుపెన్నడూ లేని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉన్న బాలయ్య, తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

Post Published By: dialnews
Updated : 4 May 2026, 11:50 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో మునుపెన్నడూ లేని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉన్న బాలయ్య, తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సై అన్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా బాలయ్య సినిమాలకు గత కొంతకాలంగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు. బాలయ్య మాస్ ఎలివేషన్లకు థమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం NBK 112 కోసం థమన్ స్థానంలో మరో మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచందర్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన 'దేవర' చిత్రానికి అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఇదే దేవర' సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, బాలయ్య సినిమాకు కూడా అనిరుధ్‌నే తీసుకోవాలని కొరటాల భావిస్తున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడి మార్పుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. థమన్‌ను ఉద్దేశించి 'బండోడు' అని, అనిరుధ్‌ను ఉద్దేశించి 'బక్కోడు' అని పిలుచుకుంటూ.. "బండోడు ప్లేస్‌లోకి బక్కోడు వచ్చాడు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ అందించే బిగ్ సౌండ్స్‌కు బాలయ్య ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అనిరుధ్ లాంటి ట్రెండీ మ్యూజిక్ డైరెక్టర్ బాలయ్య వంటి మాస్ హీరోకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తారో అన్నది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

బాలయ్య సినిమాలకు థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నప్పటికీ, కొరటాల శివ తన సినిమాల్లో మ్యూజిక్ విషయంలో చాలా కొత్తదనం కోరుకుంటారు. ముఖ్యంగా కథలోని గాఢతను ఎలివేట్ చేయడంలో అనిరుధ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ కు అనిరుధ్ అయితేనే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, బాలయ్య-అనిరుధ్ కాంబోలో రాబోయే ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది. కొరటాల శివ సినిమాలు కేవలం మాస్ మసాలా మాత్రమే కాకుండా, ఒక సామాజిక సందేశాన్ని కూడా కలిగి ఉంటాయి. బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్ కు కొరటాల మార్క్ మేకింగ్ తోడైతే, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Published : 
  • 4 May 2026, 11:50 AM IST