బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కపుల్స్ అనగానే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చే పేరు టైగర్ ష్రాఫ్ మరియు దిశా పటానీ. వీరిద్దరూ విడిపోయారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించగా, ఇప్పుడు దిశా పటానీ మరో యంగ్ సింగర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలు వీరి మధ్య ఏం జరిగింది? ఆ కొత్త వ్యక్తి ఎవరు? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2016లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు 6 సంవత్సరాల పాటు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. విదేశాల్లో వెకేషన్లు, జిమ్ వర్కౌట్లు, రెస్టారెంట్లలో సందడి.. ఇలా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసి మెలిసి ఉండేవారు. టైగర్ ష్రాఫ్ ఫ్యామిలీకి కూడా దిశా చాలా దగ్గరైంది. 'బాఘీ 2' సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2022 నుంచి వీరి మధ్య దూరం పెరిగింది.
చాలా కాలం పాటు మౌనంగా ఉన్న ఈ జంట బ్రేకప్‌కు ప్రధాన కారణం 'పెళ్లి' అని తెలుస్తోంది. దిశా పటానీ తన బంధాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్లాలని, పెళ్లి చేసుకోవాలని టైగర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే, టైగర్ ష్రాఫ్ అప్పట్లో పెళ్లికి సిద్ధంగా లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాదాపు నాలుగేళ్లుగా దిశా తన ప్రియుడి నుండి సానుకూల స్పందన కోసం ఎదురుచూసింది. చివరకు టైగర్ వైపు నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో, మనస్తాపానికి గురైన దిశా తన దారి తాను చూసుకుంది. టైగర్‌కు గుడ్ బై చెప్పేసిన దిశా పటానీ, ఇప్పుడు పంజాబీ యంగ్ సింగర్ తల్విందర్ సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక పెళ్లి వేడుకలో మాస్క్ మ్యాన్‌గా పిలవబడే తల్విందర్‌తో దిశాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఇటీవల ఉదయ్‌పూర్‌లో తల్విందర్ సింగ్ నిర్వహించిన ఒక ఈవెంట్‌కు దిశా హాజరైంది. మ్యూజిక్ కాన్సర్ట్ తర్వాత వీరిద్దరూ జంటగా కనిపించడమే కాకుండా, చేతిలో చేయి వేసుకుని తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. వీరిద్దరి మధ్య ఉన్న క్లోజ్‌నెస్ చూస్తుంటే, దిశా పటానీ తన కొత్త అఫైర్‌ను అధికారికంగా ఖరారు చేసినట్లే కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు పక్కన పెడితే, దిశా తన కెరీర్‌పై కూడా గట్టిగానే ఫోకస్ చేస్తోంది. 2025లో ఆమె సినిమాలు ఏవీ విడుదల కానప్పటికీ, 2024 ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. యోధా, కల్కి 2898 ఏడీ, కంగువా వంటి భారీ చిత్రాల్లో నటించింది. ఓ రోమియో'లో అతిథి పాత్రలో, అలాగే 'హోలీ గార్డ్స్ సాగా' చిత్రంలో కనిపించనుంది. ప్రస్తుతం ఆమె చేతిలో వెల్కమ్ టు ది జంగిల్' మరియు 'ఆవారాపన్ 2' వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.టైగర్ ష్రాఫ్‌తో ఆరేళ్ల బంధానికి ముగింపు పలికి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న దిశా పటానీ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్‌లో దిశా ముందుకు సాగుతున్న తీరు ఆసక్తికరంగా మారింది.