ఇది డ్రాగన్ దండయాత్ర.. ఆగస్ట్ 15న అర్ధరాత్రి…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా పాన్ ఆసియా దండయాత్ర పనుల్లో బిజీ అయ్యాడు. ఒకవైపు షూటింగ్, రెండో వైపు డ్రాగన్ లో రెండో పాత్ర కోసం వర్కవుట్లు...అంతా బానే ఉంది. తన బర్త్ డేకి ఇంకా 35 రోజుల టైమే ఉంది. అంటే అటు ఇటుగా నెలరోజులు..

Post Published By: dialnews
Updated : 15 April 2026, 7:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా పాన్ ఆసియా దండయాత్ర పనుల్లో బిజీ అయ్యాడు. ఒకవైపు షూటింగ్, రెండో వైపు డ్రాగన్ లో రెండో పాత్ర కోసం వర్కవుట్లు...అంతా బానే ఉంది. తన బర్త్ డేకి ఇంకా 35 రోజుల టైమే ఉంది. అంటే అటు ఇటుగా నెలరోజులు... సో వచ్చేనెల 20న డ్రాగన్ టీజర్ తో ప్రశాంత్ నీల్ టీం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భారీ గిఫ్ట్ ఇవ్వబోతోందా? ఇక్కడే డౌట్ కి గేట్లు తెరుస్తోంది ఫిల్మ్ టీం. అప్ డేట్స్ విషయంలో ఎలాంటి సౌండ్ లేదని ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్స్ పెరిగే సరికి... డ్రాగన్ టీం లో కదలిక వచ్చినట్టుంది.. ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు ఒకే మాట చెబుతున్నాడు.. ఎన్టీఆర్ ఆకలి మీదున్నాడు.. అలాని ఆగం ఆగం వద్దంటున్నాడు.. ఈ స్టేట్ మెంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఇంతకి దీనర్ధం ఏంటి? మే 20 కి మాస్ గిఫ్ట్ ఏమై ఉంటుంది? అసలు డ్రాగన్ మనసులో ఏముంది?

ఎన్టీఆర్ ఆకలి మీదున్నాడు.. కాని ఆగం ఆగం పనులు వద్దంటున్నాడు.. అంటే అర్ధమేంటి? ఇది ప్రశాంత్ నీల్ అండ్ కో నుంచి ఫీలర్స్ రూపంలో సినీ జనాలకు, ఫ్యాన్స్ కి పరోక్షంగా అందుతున్న సమాచారం.. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమొకటి వైలరౌతోంది. దాని వెనక కారనముంది. మరో 35 రోజుల తర్వాత ఎన్టీఆర్ బర్త్ డే.. అంటే మే 20 కి ఇంకా 35 రోజులే టైం ఉంది.కాబట్టి ఆరోజు డ్రాగన్ టీజరో, సాంగో, గ్లింప్సో వచ్చే ఛాన్స్ఉందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయటం కామన్. కాని అలా జరక్కపోతే ఫ్యాన్స్ ఊరుకునే ఛాన్స్ఉండదు.. అసలు దేవర టైంలో ప్రీరిలీజ్ ఈవెంట్ టైంలోనే, 5 వేల మంది ఫ్యాన్స్ వస్తారనుకుంటే, 30 వేల మంది రావటంతో, ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అప్పుడే ఆ ఈవెంట్ లొకేషన్ లో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయితే ఎలా ఉంటుందో, అక్కడ జరిగిన రచ్చ చూస్తే అర్ధమైపోతుంది.

సో ఇప్పుడు కూడా ఎన్టీఆర్ బర్త్ డే కి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోతే, సోషల్ మీడియలో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదనే, ప్రశాంత్ నీల్ టీం జాగ్రత్త పడుతోందా? అందుకే ఈ సారి ఎన్టీఆర్ బర్త్ డేకి ఎలాంటి టీజర్లు ఉండవని పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తోందా? ఇలాంటి డౌట్లు పెరుగుతున్నాయి. డ్రాగన్ జూన్ లోకాదు, దసరా, దీపావలికి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.2027 సంక్రాంతికే డ్రాగన్ గర్జించే ఛాన్స్ఉందని తెలుస్తోంది. కాబట్టి రిలీజ్ కి ఇంకా ఏడాది టైం ఉన్నప్పుడు ఇప్పుడే టీజర్ ఇస్తే ఎలా అన్న ప్రశ్న ఎన్టీఆర్ నుంచేవచ్చిందట. సో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే డ్రాగన్ టీజర్ లాంచ్ విషయంలో నో చెప్పాడా? లేదంటే ఇది జస్ట్ పుకారేనా? అప్పుడే కన్ క్లూజన్ కి రావటం కష్టం. ఐతే లాస్ట్ ఇయర్ కూడా తన బర్త్ డేకి డ్రాగన్ అప్ డేట్ వస్తుందనుకుంటే, రాలేదనే కోపం ఫ్యాన్స్ ఉంది.

కాకపోతే వార్ 2 మూవీ ప్రమోషన్ కి ఇది డైవర్షన్ కాకూడదనే, ఇలా చేశారని ఫ్యాన్స్ కూడా కూల్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు డ్రాగన్ అప్ డేట్ ని మే 20కి ఇవ్వకుంటే ఊరుకుంటారా? ఇది డ్రాగన్ టీమ్ ముందున్న ప్రశ్న. అందుకే ఆరోజు టైటిల్ ని, పోస్టర్ తోపాటు రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని కూల్ చేయాలనకుంటున్నారట. అందుకే ముందునుంచి ఫ్యాన్స్ ని మెంటల్ గా ప్రిపేర్ చేసేందుకే, గ్లింప్స్ కాని, టీజర్ కాని రిలీజ్ చేయం.. కేవలం పోస్టర్ తో సరిపెట్టుకోండనంటున్నారనే ప్రచారం జరుగోతంది. ఇక ఆగస్ట్ 15 నైట్ టీజర్ ని లాంచ్ చేయాలనే నిర్ణయానికి ఫిల్మ్ టీం వచ్చినట్టు తెలుస్తోంది. అలా అయితే డ్రాగన్ రిలీజ్ కి 6 నెల్ల ముందు టీజర్ తో ప్రమోషన్ మొదలుపెట్టినట్టౌతుందని, ఒక వార్త వైరలౌతోంది.. ఫ్యాన్స్ కి షాక్ ఇస్తోంది.

Published : 
  • 15 April 2026, 7:50 PM IST