Dragon కత్తి .. జోర్డాన్ ఎడారిలో టీజ్ చేస్తూ…!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేలా చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒకే కత్తి తో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మొత్తం షేక్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ కత్తి ఫోటో మీద భారీ చర్చే జరుగుతోంది.

Post Published By: dialnews
Updated : 15 May 2026, 5:15 PM IST

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేలా చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒకే కత్తి తో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మొత్తం షేక్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ కత్తి ఫోటో మీద భారీ చర్చే జరుగుతోంది. అసలు జోర్డాన్ ఎడారికి, ప్రశాంత్ నీల్ పట్టుకున్న కత్తికున్న లింకే, డ్రాగన్ ప్రోమో ఏరేంజ్ లో ఉండోబోతోందో తెలిసేలా చేస్తోంది. ఈ లింకులవల్లే హాలీవుడ్ మూవీ డ్యూన్ ఫీచర్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.. ప్రపంచ ప్రేక్షకులని పిచ్చెక్కిపోయేలా చేసిన డ్యూన్ ఫిల్మ్, నిజానికి ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్.. అయితే ఆ సినిమా ఫీజర్స్ తో డ్రాగన్ కి ఉన్న లింక్ ని, ఇప్పుడొచ్చిన రెండో ఫోటో కన్ఫామ్ చేసింది. మొదటి పోస్టర్ తో ఒక హింటు, ఇప్పుడు కత్తి ఫోటోతో మరో హింట్ ఇచ్చి, హాలీవుడ్ మూవీ డ్యూన్ తో పోల్చుకునేలా చేశాడు ప్రశాంత్ నీల్.. ఆల్రెడీ డ్రాగన్ మూవీ టైటిల్ ఇదే అని కన్పామ్ అయ్యింది. ఇక హాలీవుడ్ కనెక్షన్ మాత్రం వచ్చే మంగళవారం కన్ఫామ్ అయ్యేలా ఉంది. అసలు డ్యూన్ తో డ్రాగన్ కి లింక్ ఉంటే ఏమౌతుంది? ఎందుకీ అంశం సెన్సేషన్ గా మారుతోంది?

ఒక్క ఫోటో ఒకే ఒక్క ఫోటోతో, లెక్కలన్నీ మారిపోయాయి.. ఇంతవరకు డ్రాగన్ అంటే మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఇండో, చైనా, బూటాన్ నేపథ్యంలో సాగే సినిమా అనుకున్నారు. టైటిల్ ని బట్టి, సౌత్ ఏసియా అంటే చైనా, జపాన్, కొరియా ఇలా ఈ దేశాలతో మాత్రమే కనెక్షన్ ఉన్న కథనుకున్నారు. కాని డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కత్తితో బాంబుపేల్చాడు..అవును జోర్జాన్ లోని వాడి రమ్ ఏరియాలోని ఎడారిలో ఒక ఖడ్గం తో ఒక ఫోటో, అలానే గోల్ప్ బ్యాట్ లాంటి టెస్టింగ్ కిట్ తో మరో ఫోటో ఈరెండు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ నీల్ బెస్ట్ హాఫ్ లిఖితా రెడ్డి నీల్ పెట్టిన పోస్ట్ వైరలైంది. అంతగా ఈ ఫోటోలో ఏం తేలుతోందంటే, అదే హాలీవుడ్ సినిమా డ్యూన్ తో ఉన్న లింకులు.

ఐను ఒక్కసారి డ్రాగన్ టీం ముందు వదిలిని పోస్టర్ ని గుర్తుతెచ్చుకుంటే ఈజీగా ఎవరికైనా ఈ కనెక్సన్ అర్ధమైపోతుంది. చాలా మాడ్రన్ ఔట్ ఫిట్ తో గెడ్డం లుక్ లోఉన్న ఎన్టీఆర్ పోస్టర్ ని మూడు వారాల క్రితం రివీల్ చేశారు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ని వదలబోతున్నట్టు తేల్చారు. ఇక ఇది పాన్ వరల్డ్ మూవీ అనే విధంగా, ప్రపంచ యాత్రకి సిద్దమైన హీరో అన్నట్టు చిన్న టెక్ట్స్ తో హింట్ ఇచ్చారు.ఆ ఫోటోని, ఇప్పుడు జోర్డాన్ ఎడారుల్లో ప్రశాంత్ నీల్ కడ్గం పట్టుకున్న ఫోటోని చూస్తే హాలీవుడ్ మూవీ డ్యూన్ గుర్తుకొస్తుంది.. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీల్లో ఇప్పుడు ప్రపంచ సినిమా ట్రెండ్ ని మార్చిన మూవీ అంటే డ్యూనే.. అందులో అత్యాధునిక యంత్రాలు ఉన్నా, కత్తులని కీ టూల్స్ గా వాడటం ఓ కల్చరల్ కనెక్షన్ లా కనిపిస్తుంది. దానికి, డ్రాగన్ కి ఉన్న లింకేంటంటే, యాంబియన్స్ఔను అప్పట్లో మ్యాడ్ మ్యాక్స్ సీరీస్, ఇప్పుడు డ్యూన్ మూవీ లో కామన్ ఎలిమెంట్ ఎడారి.. ఒక విచిత్రమైన వాతావరణం, అంటే కొన్ని వందల ఏళ్ల తర్వాత ఎడారిలా మారిపోయే గ్రహంలో మనుషుల జీవితం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం మ్యాడ్ మ్యాక్స్ మూవీ చేసింది. డ్యూన్ మాత్రం మరో గ్రహంతర వాసుల జీవితం చూపించింది.

ఈ రెండూ వరల్డ్ బాక్సాఫీస్ బెండు తీశాయి.. ఇప్పుడు ఈ జోనర్ ని టచ్ చేస్తున్న మొదటి ఇండియన్ సినిమా అవటంతో, డ్రాగన్ రేంజ్ వరల్డ్ మార్కెట్ ని రీచ్ అయ్యే వరకు వెలుతోంది. ఏదేమైనా కొన్ని సార్లు కథెంత ఇంపార్టెంటో, అది ఏ జోనర్ లో, ఎలాంటి యాంబియన్స్ లో తీస్తున్నారనే దాని బట్టి, దాని స్థాయి నెక్ట్స్ లెవల్ కి వెలుతుంది.సింపుల్ గా చూస్తే కేజీయఫ్ బంగారు గనులు కాకుండా, ఆ నల్లటి దిబ్బలు లేకుండా చూస్తే అదో జస్ట్ మాఫియా మూవీనే.. కాని యాంబియెన్స్ తో దానికో ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకతతోనే డ్రాగన్ ని రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అదే ఈ కొత్త ఫోటోతో తేలింది.. వచ్చే వారం గ్లింప్స్ పేలుతుందని కన్పామ్ అయ్యింది.

Published : 
  • 15 May 2026, 5:15 PM IST