Top story:త్రిషపై విజయ్ కొడుకు సంచలన కామెంట్స్… వైరల్ అవుతోన్న సోషల్ మీడియా పోస్ట్… కష్టాల్లో ఉన్నప్పుడు మా అమ్మ నిలబడింది…!

సినిమా స్క్రీన్‌పై సూపర్ హిట్లు కొడుతూ, ఇప్పుడు పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టి.. ఏకంగా సీఎం అయిపోయిన ‘దళపతి’ విజయ్ పర్సనల్ లైఫ్ కూడా అదే రేంజ్ లో సంచలనం అవుతోంది. ఎన్నికల ముందు విడాకుల కోసం అప్లయ్ చేసిన.

Post Published By: dialnews
Updated : 15 May 2026, 2:30 PM IST

సినిమా స్క్రీన్‌పై సూపర్ హిట్లు కొడుతూ, ఇప్పుడు పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టి.. ఏకంగా సీఎం అయిపోయిన ‘దళపతి’ విజయ్ పర్సనల్ లైఫ్ కూడా అదే రేంజ్ లో సంచలనం అవుతోంది. ఎన్నికల ముందు విడాకుల కోసం అప్లయ్ చేసిన.. అతని భార్య సంగీత గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరి విడాకుల గురించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, రీసెంట్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి వచ్చిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సంగీతకు సపోర్ట్ చేస్తూ పెట్టిన అతని కొడుకు సంజయ్ పెట్టిన ఈ పోస్ట్‌లో అసలు ఏముంది..? సంగీతతో ఉన్న ఫోటోను సంజయ్ పోస్ట్ చేసాడు. అందులో రాసిన మాటలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. "అంతా ఇంత ఓపెన్‌గా, ఎలాంటి నైతిక విలువలు లేకుండా జరుగుతుంటే నా మనసంతా చాలా బాధగా అనిపించింది. ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ఆమె లాస్ట్ మినిట్‌లో ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది. తన ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకుంది. చాలా రెస్పెక్ట్‌తో ఆమె ఆ బంధం నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ సక్సెస్‌ని ఎవరితోనైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు.. అంటూ త్రిష గురించి ప్రత్యేకంగా.. పరోక్షంగా ప్రస్తావించాడు.

కానీ ఆయన కెరీర్ స్టార్టింగ్‌లో కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నేళ్లు ఆయన పక్కన నిలబడింది మాత్రం ఆమే. ఆమెకు, ఆమె పిల్లలకు లైఫ్‌లో ప్రశాంతత, సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలకు తల్లి స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఐ స్టాండ్ విత్ యు సంగీత మేమ్. ఈ పోస్ట్ కింద తమిళంలో ఒక లైన్ కూడా రాశారు.. ‘కెట్టాలుం మేన్మక్కల్ మేన్మక్కలే’.. అంటే ‘పరిస్థితులు ఎంత బ్యాడ్‌గా మారినా, మంచి మనసున్న వాళ్లు తమ పద్ధతిని, హుందాతనాన్ని అస్సలు వదులుకోరు’ అని దీని మీనింగ్.విజయ్, సంగీతలకు 1999లో పెళ్లయింది. వీరికి ఒక కొడుకు.. జాసన్ సంజయ్, ఒక కూతురు దివ్య సాష ఉన్నారు. ఇన్నేళ్లలో వీళ్ల ఫ్యామిలీ గురించి ఎలాంటి బ్యాడ్ రూమర్స్ రాలేదు. కానీ కొన్నాళ్లుగా వీరిద్దరూ విడిగా ఉంటున్నారనే న్యూస్ ఫ్యాన్స్‌ను బాగా అప్‌సెట్ చేస్తోంది. అయితే ఈ గొడవలన్నిటి మధ్య సంగీత ఇప్పటివరకు ఎక్కడా మీడియా ముందుకు రాలేదు.. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు.. విజయ్‌పై ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఆమె మెయింటైన్ చేస్తున్న ఈ ‘సైలెన్స్’ చూసి నెటిజన్లు ఆమె పద్ధతిని, సంస్కారాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

ఈ వైరల్ పోస్ట్‌లో మెయిన్‌గా తమ గురించి, తల్లి స్థానం గురించి హైలైట్ చేశాడు. జనరల్‌గా పేరెంట్స్ మధ్య గొడవలు వస్తే పిల్లలు చాలా మెంటల్ స్ట్రెస్ ఫీలవుతారు. ఇక్కడ కూడా పిల్లలు తమ తల్లి సంగీత పక్కనే ఉంటూ ఆమెకు ఫుల్ అండగా నిలబడుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఈ పోస్ట్‌కు వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. చాలా మంది ఆడవాళ్లు, ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. "మేము కూడా సంగీత మేడమ్‌కే సపోర్ట్ చేస్తున్నాం" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.నిజానికి స్క్రీన్‌పై కనిపించే రంగుల ప్రపంచానికి, రియల్ లైఫ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక పెద్ద స్టార్ హీరోగా ఎంత సక్సెస్ సాధించినా, పర్సనల్ లైఫ్‌లో వచ్చే ఇలాంటి ఒడిదుడుకులు ఫ్యాన్స్‌ని కూడా చాలా బాధపెడతాయి. ఏదేమైనా, ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే సంగీత పట్ల అభిమానుల్లో ఎంత రెస్పెక్ట్ ఉందో క్లియర్ గా అర్థమవుతోంది.

Published : 
  • 15 May 2026, 2:30 PM IST