1000 కోట్ల బ్రాండ్ బాబు.. 5000 కోట్ల షాకింగ్ డీల్..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసితో, కొడితే పాన్ ఇండియా స్టార్స్ అందరికి, ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. అస్సలు పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క మూవీ రిలీజ్ కాలేదు.. వారణాసి వరల్డ్ మూవీగా రాబోతోంది.

Post Published By: dialnews
Updated : 15 May 2026, 6:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసితో, కొడితే పాన్ ఇండియా స్టార్స్ అందరికి, ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. అస్సలు పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క మూవీ రిలీజ్ కాలేదు.. వారణాసి వరల్డ్ మూవీగా రాబోతోంది. కాని అది రిలీజ్ అయ్యేది వచ్చే ఏడాది.. ఈలోపే వెయ్యికోట్ల పండగలొస్తున్నాయి. ఒకటి కాదురెండు కాదు ఏకంగా ఐదు వేల కోట్ల పండగలు సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంతం.. అంతా గ్లోబల్ సినిమా వారణాసి మహిమే.. ఆ మూవీ వల్లే ఇప్పుడు తను హాలీవుడ్ హీరోల రేంజ్ లో వెయ్యికోట్లు, 500 కోట్ల యాడ్స్ తో షాక్ ఇస్తున్నాడు. తన ఒక్కో యాడ్ ఎండోర్స్ మెంట్ వ్యాల్యూ ఏకంగా 500 కోట్ల నుంచి 1000 కోట్లకు చేరుతోంది. కూల్ డ్రింక్ కంపెనీ, సన్ స్క్రీన్ కంపెనీలతో తన డీల్ చూస్తే... వారణాసి బడ్జెట్ ని ఒక్క డీల్ తోనే రాబట్టేయొచ్చనిపిస్తుంది... పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న స్టార్స్ కి కూడా రాని డీల్స్, దక్కని అద్రుష్టం మహేశ్ బాబుకి దక్కుతోందా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు జస్ట్ 10 సెకన్లు ఒక యాడ్ లో కనిపిస్తే చాలు 500 కోట్లు.. మరో యాడ్ లో ఇలానే 10 సెకన్లు కనిపిస్తే చాలు 1000 కోట్లు.. ఇంత ఎమౌంట్ మరే పాన్ ఇండియా హీరో నుంచి విన్నామా? కాని ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇంతవరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియ మూవీ ,చేయలేదు.కాని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసితో మాత్రం వరల్డ్ మార్కెట్ ని వాయించబోతున్నాడు. ఒకే సారి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ మీద దండెత్తేందుకు సిద్దమయ్యాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో వారణాసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అంటే ఈ సినిమా ఇంకా రావటానిక ఏడాది టైంఉంది. ఒక వేల ఇది రిలీజైనా, రికార్డులు క్రియేట్ చేసేంతగా పూనకాలు వస్తే... అప్పుడు మహేశ్ బాబు కోసం యాడ్ ఎండోర్స్ మెంట్స్ క్యూ కట్టాయంటే అర్ధముంది.

దేశ వ్యాప్తంగా మహేశ్ బాబుకి గుడ్ లుక్స్ వల్ల, తన సినిమాల వల్ల మంచి క్రేజ్, ఇమేజ్ ఉంది.కాని అది మార్కెట్ గా మారాలంటే పాన్ ఇండియా హిట్ పడాలి.. అందుకే తను పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ లను ఒకే వారణాసితో కలిపి కొట్టేయాలనుకుంటున్నాడు. కాకపోతే అది భవిష్యత్తు.. తన పాస్ట్ చూస్తే పాన్ ఇండియా హిట్స్ లేవు.కాని పాన్ ఇండియా హీరోలను మించిపోతున్నాయి తన యాడ్ ఎండోర్స్ మెంట్ లు.. ఏ హీరో అయినా ఒక యాడ్ చేస్తే 40 కోట్లు, ఎండోర్స్ మెంట్ డీల్ 100 కోట్లు ఉంటే అదే మహా ఎక్కువ.. అలాంటిది 500 కోట్ల పైనే డీల్స్ తో షాక్ ఇస్తున్నాడు మహేశ్ బాబు. కూల్ డ్రిక్స్, సన్ స్క్రిమ్ ఇలా ఒక్కో యాడ్ ఎండోర్స్ మెంట్ డీల్ 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఉంటున్నాయి.

బేసిగ్గా ఈ నెంబర్స్ హాలీవుడ్ హీరోల నుంచే వింటాం.. వాళ్ల రెమ్యునరేషన్ 600 కోట్లు, 1000 కోట్లనే వార్తలే కామన్. ఇక వాళ్లు యాడ్స్ చేస్తే 500 కోట్లు, 1000 కోట్లు ఇలాంటి వార్తలై వైరలౌతాయి.. ఇక ఖాన్ల నుంచి కపూర్ల వరకు ఇక మన పాన్ ఇండియన్ హీరోల నుంచి మాస్ స్టార్ల వరకు ఎవరూ ఇలాంటి నెంబర్స్ చూడలేదు. వినలేదు.. సో పది యాడ్ ఎండోర్స్ మెంట్ లలో ఒక్కోకటి 500 కోట్లంటే, కేవలం యాడ్స్ తోనే 5 వేల కోట్ల స్టార్ గా మారుతున్నాడు మహేశ్ బాబు..నిజం చెప్పాలంటే వారణాసి వరల్డ్ మార్కెట్ ని వచ్చే ఏడాది కుమ్మేస్తుందేమోకాని, సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం వారణాసి వచ్చే ఏడాది ముందే, వేల కోట్ల డీల్స్ తో షాక్ ఇస్తున్నాడు. మార్కెట్ ని షేక్ చేస్తున్నాడు.

Published : 
  • 15 May 2026, 6:50 PM IST