NEXT”సూపర్ BOND”..HOLLYWOODతో పోటీ…?

సూపర్ స్టార్ మహేశ్ బాబు నెక్ట్స్ మూవీ జేమ్స్ బాండ్ జోనర్ లోనే అని ఫిక్స్ అయినట్టుంది. సుకుమార్ మరో సారి మహేశ్ ని కలిసిన ఫోటో బయటికి రావటం చూస్తుంటే, కథా చర్చల కోసమే అనంటున్నారు. మొన్నీ మధ్య వారణాసి సాంగ్ షూటింగ్ లో వీళ్ల మధ్య జరగిన చర్చలకు అర్ధం ప్రాజెక్ట్

Post Published By: dialnews
Updated : 29 April 2026, 7:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు నెక్ట్స్ మూవీ జేమ్స్ బాండ్ జోనర్ లోనే అని ఫిక్స్ అయినట్టుంది. సుకుమార్ మరో సారి మహేశ్ ని కలిసిన ఫోటో బయటికి రావటం చూస్తుంటే, కథా చర్చల కోసమే అనంటున్నారు. మొన్నీ మధ్య వారణాసి సాంగ్ షూటింగ్ లో వీళ్ల మధ్య జరగిన చర్చలకు అర్ధం ప్రాజెక్ట్ ఫిక్స్ అని.. ఆ ఫోటోనే ఇప్పుడు రివీల్ అయ్యింది. అంతవరకు ఓకే కాని, హాలీవుడ్ జేమ్స్ బాండ్ తో మన ఇండియన్ బాండ్ పోటీ పడగలడా? సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్స్ పరంగా, పెర్ఫామెన్స్ పరంగా జేమ్స్ బాండ్ రోల్ ని ఈజీగానే హ్యాండిల్ చేయగలడు.. కాని ఇక్కడ సమస్య తను కాదు, సుకుమార్. ఏదో పాన్ ఇండియా లెవల్లో పుష్పరాజ్ లాంటి మూవీలంటే తన పెన్ను గన్నులా పని చేస్తుంది.. ఇప్పుడు గన్ పట్టే జేమ్స్ బాండ్ మూవీతో మన ఇండియన్ బాండ్ పోటీ పడాల్సి వస్తోంది.. అది కూడా హాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజీతో మన బాండ్ పోటీ పడగలడా? ఐనా ఎందుకు మన బాండ్ హాలీవుడ్ జేమ్స్ బాండ్ తో పోటీ పడాలి?

ఇండియన్ జేమ్స్ బాండ్ మూవీ అనేది సూపర్ స్టార్ మహేశ్ బాబు కల... ఐతే ఇక్కడ ఆ కల నెరవేరే టైం, హాలీవుడ్ జేమ్స్ బాండ్ తో పోటీ పడే టైం ఒకటే ఐతే ఎలా ఉంటుంది.. అదేజరిగేలా ఉంది. అంతవరకు ఓకే కాని, మన లెవల్ ఎంత? కొన్ని సార్లు ప్రాక్టికల్ గా లెక్కలేసుకోలేకపోతే, హాలీవుడ్ తో పోటీ పడే ప్రాసెస్ లో అతిగా ఊహించుకుని బొక్కబోర్లాపడే ఛాన్స్ఉంది.ఒకసారి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మీరు హాలీవుడ్ హీరోరేంజ్ అనబోతుంటే, అలా అనుకునే చాలా మంది షెడ్డుకెళ్లిపోయారన్నాడు.. అంటే మహేశ్ బాబుకి ఎలాంటి బ్రమలు లేవు.. తను చాలా ప్రాక్టికల్ పర్సన్ అని గతంలోనే తేలింది. కాబట్టే, చాలా సెలెక్టీవ్ గా కథలు, దర్శకులని ఎంచుకుంటూ ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు.

కాబట్టే, తనిప్పుడు హాలీవుడ్ జేమ్స్ బాండ్ తోపోటీ పడాల్సి వస్తోందన్న వార్త రాగానే అదంతా రూమర్ అనుకున్నారు.కాని రిస్క్ చేస్తున్నాడు.. వారణాసి తర్వాత మహేశ్ చేయబోయే సినిమా పక్కగా జేమ్స్ బాండ్ లాంటి జోనరే.. ఇక హాలీవుడ్ కొత్త జేమ్స్ బాండ్ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కాన్సెప్ట్ తోనే కథ సిద్దమౌతున్న వార్తలొస్తున్నాయి. ఇక్కడ సుకుమార్ కూడా ఏఐ బేస్ చేసుకునే కథ సిద్దం చేయటం, మహేశ్ కి ఆల్రెడీ రెండు సార్లు వినిపించటం జరిగింది.రామ్ చరణ్ మూవీని 2027 ఎండ్ కల్లాపూర్తి చేస్తాడని, దానికి ముందు అంటే 2027 దసరాకు మహేశ్ సినిమా మొదలౌతుందని ప్రచారం జరుగుతోంది. ఎగ్జాక్ట్ గా అప్పుడే హాలీవుడ్ జేమ్స్ బాండ్ మొదలు కాబోతోంది. కేవలం షూటింగ్ టైమే కాదు, ఏఐ కాన్సెప్ట్ నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వరకు అన్నీంట్లో హాలీవుడ్ జేమ్స్ బాండ్ కి మన బాండ్ పోటీ ఇచ్చే సాహసం చేస్తున్నాడు.

అయితే ఇదేం అంత అతి అనటానికి లేదు. కారణం వారణాసితో వరల్డ్ వైడ్ గా మహేశ్ బాబుకి, గుర్తింపు,మార్కెట్, క్రేజ్ వస్తుందనటంలో ఎవరికి ఎలాంటి డౌట్లు లేవు.. అలానే జేమ్స్ బాండ్ జోనర్ లో అలాంటి పాత్రకి మహేశ్ సూట్ కాడనే సీన్ లేదు. తను పక్కాగా ఆ పాత్రని హ్యాండిల్ చేయగలడు.. కాని సుకుమార్ మీదే డౌటు.. తను పుష్పరాజ్ తో పాన్ ఇండియాని రెండు సార్లు షేక్ చేశాడు.. నాన్నకుప్రేమతో లాంటి స్టైలిష్ థ్రిల్లర్ చూపించాడు.. కాబట్టి పాన్ వరల్డ్ లెవల్లో జేమ్స్ బాండ్ స్టాండర్డ్స్ లో సుకుమార్ మన జేమ్స్ బాండ్ ని రెడీ చేయగలడా? ఇదే ప్రూవ్ చేసుకోవాలి... ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కి, టీజర్ బయటికి రావాలి.. అప్పుడే మనకు సీన్ ఉందా లేదా అన్న ఒక అభిప్రాయానికి రావచ్చు.. ఆప్రయత్నమే మొదలైనట్టు కనిపిస్తోంది.

Published : 
  • 29 April 2026, 7:50 PM IST