డైనోసార్లకు కూడా.. కుర్చీ మడత పెడుతూ…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్చీ మడత పెడితే, గుంటూరు కారం ఎరుపెక్కింది. గుంటూరులోనే కాదు టాలీవుడ్ మొత్తం బాక్సాపీస్ బరువెక్కింది. త్రివిక్రమ్ రైటర్ గా ఈ మూవీ క్వాలిటీ విషయంలో మోసం చేసినా, సూపర్ స్టార్ క్రేజ్ తో గుంటూరు కారంలో ఘాటు మిస్ కాలేదు..

Post Published By: dialnews
Updated : 25 March 2026, 8:20 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్చీ మడత పెడితే, గుంటూరు కారం ఎరుపెక్కింది. గుంటూరులోనే కాదు టాలీవుడ్ మొత్తం బాక్సాపీస్ బరువెక్కింది. త్రివిక్రమ్ రైటర్ గా ఈ మూవీ క్వాలిటీ విషయంలో మోసం చేసినా, సూపర్ స్టార్ క్రేజ్ తో గుంటూరు కారంలో ఘాటు మిస్ కాలేదు.. బాక్సాపీస్ లో 200 కోట్ల వరద కూడా ఆగలేదు. ఐతే ఇప్పుడు మహేశ్ బాబు మరోసారి కుర్చీ మడత పెడుతున్నాడు.. అది కూడా ఇక్కడ కాదు ఐస్ ల్యాండ్ లో.. అక్కడ సూపర్ స్టార్ కుర్చీ మడత పెడితే, ఇక్కడ వరకు డైనోసార్లు పారిపోతాయా? ఔను మొన్నటి వరకు వారణాసిలో డైనోసార్ల సీన్స్ అంటే అంతా డౌట్ ఫుల్ గా చూశారు.. కాని ఇప్పుడు ఏకంగా రాక్షస బల్లులకి కూడా సూపర్ స్టార్ కుర్చీ మడత పెట్టే టైం వచ్చినట్టుంది.. ఇంతకి డైనోసార్లకోసం మహేశ్ ఎందుకు ఐస్ ల్యాండ్ వెలుతున్నాడు?

సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్చీ మడతపెడితే, ఇప్పుడు డైనోసార్లు కూడా పరుగులు తీయాల్సిందే. వారాణాసి కోసం ఇప్పుడు మహేశ్ బాబు కుర్చీ మడత పెట్టాల్సి వస్తోంది. శివుడు, రుద్రుడు, రాముడు ఇలా మూడు పాత్రల్లో కనిపించబోతున్న మహేశ్ బాబు, తన మాస్ ఫ్యాన్స్ కోసం మాత్రం మరో సాహసం కూడా చేస్తున్నాడు. మాస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకూడదని, రాక్షస బల్లుల్ని రంగంలోకి దింపబోతున్నాడు.ప్లాన్, ఎగ్జిగూషన్ రాజమౌలిదే అయినా, రంగంలోకి దిగి రాక్షస బల్లలకోసం కుర్చీ మడత పెట్టేంది మాత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబే..ఆల్రెడీ జార్జియాలో ఒకషెడ్యూల్ తర్వాత, హైద్రబాద్ లో యాక్షన్ మోడ్ లోకెళ్లిన వారణాసి టీం, భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసింది. ఇప్పడు ఐస్ ల్యాండ్ కి బయలు దేరబోతోంది. ఆతర్వాతే అంటార్కిటికాకు వెళుతుందని తెలుస్తోంది.

ఐస్ ల్యాండ్ కి వారణాసి లో డైనోసార్లకి లింకున్నట్టు తేలుస్తోంది. వారణాసిలో టైం ట్రావెల్ ఎపిసోడ్ లో హీరో రాక్షస బల్లుల కాలానికి వెళ్లటమో, ఆకాలానికి చెందిన రాక్ష బల్లులు ఈ కాలానికి రావటమో జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ సీక్వెన్స్ నే ఐస్ ల్యాండ్ లో తీయబోతున్నారట. ఆఫ్రికాలో ప్లాన్ చేసిన సీక్వెన్స్ ఎందుకు అక్కడికి షిఫ్ట్ చేశారో కాని. అక్కడ మాత్రం రాక్షస బల్లులు సీక్వెన్స్ తీయటం కన్ఫామ్ అయిపోయింది.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు మన తెరమీద రాక్షస బల్లులని ఎవరూ చూపించలేకపోయారు. దానికి కారనం బడ్జెట్. అంతేకాకుండా ఆరేంజ్ లో మేకింగ్ అంటే, అలాంటి ఇన్ ఫ్రాస్ట్రక్ఛర్ కూడా ఉండాలి.. అవన్నీ రాజమౌళి తన వారణాసి మూవీకి ఎరేంజ్ చేస్తున్నాడు. వారణాసి లో ఏముంటి, వరల్డ్ ఆడియన్స్ ఈ సినమాను చూస్తారో కాని...ఏముంటే ఇండియన్ థియేటర్స్ లోపూనకాలు వస్తాయో అవన్నీ ఇందులో పెడుతున్నాడు జక్కన్న. రాముడిని, రావణుడితో యుద్దాన్ని, రుద్రుడిని, శివుని తత్వాన్ని ఇలా, భక్తిని యాక్షణ్ ఎమోషన్ ని పెడుతూనే... మాస్ మతిపోగొట్టేందుకు డైనోసార్లను రంగంలోకి దింపబోతున్నాడు.. అక్కడే సూపర్ స్టార్ మహేశ్ బాబు రాక్షస బల్లులకు కుర్చీ మడతపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

Published : 
  • 25 March 2026, 8:20 PM IST