రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా అని ఎప్పటి నుంచో అంటున్నారు. అంతెందుకు మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఇప్పటికి అరడజన్ సార్లు కలిశాడు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ మూవీ అయిపోగానే ఎన్టీఆర్ తో తన సినిమా ఉంటుందని అంతా ఓ అంచనాకి వస్తున్న టైంలో, సడన్ గా లెక్కలు మారాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సందీప్ రెడ్డి వంగ సినిమా ఓకే అవటానికి ఒక జంతువు కారణం.. అది అలాంటి ఇలాంటి జంతువు కాదు.. 900 కోట్ల యానిమల్... ఔను రణ్ బీర్ కపూర్ చేసిన పనికి, సందీప్ రెడ్డి వంగ, సడన్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సినిమాను సెట్ పైకి తీసుకెళ్లేలా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, వచ్చే ఏడాది దసరాకు, సూపర్ దంచుడే అని తెలుస్తోంది. ఇంతకి ఇంతలా ఈక్వేషన్స్ ఎంతుకు మారాయి? ఎన్టీఆర్ ఎందుకు సందీప్ ని సైడ్ చేశాడు?
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఎప్పుడో 2014 లోనే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాలి...అదేంటో కాదు అర్జున్ రెడ్డి... ఆ కథ తనకి నచ్చలేదు. శర్వానంద్ మెచ్చుకోలేదు.. బన్నీకి నచ్చినా కమిట్ అవ్వాలేదు.. ఇవి అర్జున్ రెడ్డి సెన్సేషనల్ హిట్ అయ్యాక చాలా మంది నుంచి ఇలాంటి కథెలా మిస్ చేసుకున్నాడని.. కాకపోతే మహేశ్ బాబు అర్జున్ రెడ్డి పాత్ర వేస్తే, కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ పరంగాచూస్తే, తను ఆ కథని ఎంచుకోకపోవటమే కరెక్ట్ అన్నారు.ఏదో కొత్త హీరో కాబట్టి, కొన్ని సీన్స్ తో ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. ఏదేమైనా, మహేశ్ ఒప్పుకుని ఉంటే, కథ మార్చేవాడేమో సందీప్ చెప్పలేం.. ఆతర్వాత కూడా మహేశ్ బాబుతో ఒక ఫ్యాక్టరీ బ్యాక్ డ్రాప్ లో మాఫియా జోనర్ లో మూవీ ప్లాన్ చేశాడు. మహేశ్ బాబు కూడా కమిటవ్వాలనుకున్నా, కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో కబీర్ సింగ్, యానిమల్ తీసి హిట్ మెట్లెక్కాడు సందీప్.
అప్పుడు కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీయాలనే మరో కథతో తనని కలిశాడు. ఈ సారి కథ ఓరేంజ్ లో ఒకే చేశాడు.. కాకపోతే రాజమౌళి మూవీ వారనాసికి మహేశ్ కమిటైతే, గత కమిట్మెంట్ ప్రకారం ప్రభాస్ తో స్పిరిట్ చేయాల్సి వస్తోంది... అయితే ఈలోపు బన్నీ వచ్చి సందీప్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ కూడా, ఎన్టీఆర్ కి కథ చెప్పి చాలా సార్లు తనతో చర్చించాడు.సూపర్ స్టార్ మహేశ్ బాబు కి కూడా సందీప్ మరో సారి స్టోరీ నెరేట్ చేశాడు. అయితేమోస్ట్ లీ ఎన్టీఆర్ తోనే సందీప్ సినిమా ముందు గా మొదలవ్వొచ్చనున్నారు. కాని ఎన్టీఆర్ డ్రాగన్ ఒక భాగం కాదు, రెండు భాగాలుగా మారటంతో, షూటింగ్ డిలే అవుతోంది. తర్వాత దేవర2 చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక త్రివిక్రమ్ షణ్ముఖుడు కూడా దసరాలోపు పట్టాలెక్కే చాన్స్ఉంది.
కాబట్టి, తను ఫ్రీ అవటానికి 2 ఏళ్ల టైం పడుతుంది. ఈలోపు స్పిరిట్ ని పూర్తి చేసి సందీప్ ఖాలీగా ఉంటాడు.. బన్నీ కూడా రాకా తర్వాత లోకేష్ కనకరాజ్ మూవీ చేయబోతున్నాడు. సో ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సందీప్ సినిమా కమిటైతే, బన్నీ,ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ రాకపోవచ్చు.. ఎందుకంటే మహేశ్ కి ఎప్పటి నుంచో సందీప్ కథ చెబుతున్నా, కమిట్మెంట్ మాత్రం బన్నీ, ఎన్టీఆర్ లే ముందిచ్చారు. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ గా మహేశ్ బాబుకి షిఫ్ట్ అయితే సందీప్ వల్ల బన్నీ, ఎన్టీఆర్ నొచ్చుకున్నట్టౌతుంది.
కాని ప్రజెంట్ ఈ ఇద్దరు కమిట్మెంట్స్ వల్ల, సందీప్ స్పిరిట్ తీశాక చాలా ఫ్రీ అవుతాడు. వారనాసి షూట్ తర్వాత మహేశ్ కూడా ఎవైలబుల్గా ఉంటాడు.. కాబట్టే, ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చలకు అర్ధం, ఈ కాంబినేషన్ లో నే దసరాకి, దంచుడు మొదలయ్యేలా ఉందనే టాక్ వస్తోంది. మోస్ట్ లీ దసరా పండక్కి, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సందీప్ రెడ్డి నుంచి సాలిడ్ అప్ డేట్ రావొచ్చు.. ఇలాంటి డైరెక్టర్ తో అలాంటి సూపర్ స్టార్ సినిమా అంటే, అది కూడా పాన్ వరల్డ్ మూవీ వారణాసి తర్వాత అంటే, భూమి బద్దలే... ఇదే సడన్ గా ఇండస్ట్రీలో జరిగిన అతిపెద్ద షాకింగ్ డెవలప్ మెంట్.