టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది.. అదే మీనాక్షి చౌదరి. తన అందం, అభినయం మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ బ్యూటీ, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి, ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచింది. అది కూడా ఒక తమిళ స్టార్ హీరోతో తాజా సమాచారం ప్రకారం, తమిళ స్టార్ హీరో కార్తీ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఎంపికైంది. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు కల్యాణ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇదొక పూర్తిస్థాయి లవ్ అండ్ ఎంటర్టైనర్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనుంది. మీనాక్షి చౌదరి ప్రయాణం మోడలింగ్‌తో మొదలైంది. 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మెరిసిన ఆమె, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ గుర్తింపు ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు, HIT: The Second Case, లక్కీ భాస్కర్, వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
గత ఏడాది వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మరియు 'అనగనగా ఒక రాజు' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మీనాక్షి, ఇప్పుడు స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటోంది.
ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ భాషల్లో బిజీగా ఉన్న మీనాక్షి, కార్తీతో చేయబోతున్న ఈ కొత్త సినిమాతో మరో మైలురాయిని చేరుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.