ఎప్పటి నుంచో టాలీవుడ్లో ఆసక్తి రేపుతున్న ఒక క్రేజీ కాంబినేషన్‌ను ఎట్టకేలకు మైత్రీ మూవీ మేకర్స్ లాక్ చేసింది. ఎంతో మంది బడా నిర్మాతలు ట్రై చేసినా కుదరని ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ సంస్థ తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫామ్‌లో ఉన్న టాలెంట్‌ను పట్టడంలో తమకు సాటి లేరని మైత్రీ నిర్మాతలు మరోసారి నిరూపించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి సినిమాల ఎంపిక విషయంలో ఎంత పక్కాగా ఉంటారో అందరికీ తెలిసిందే. రెమ్యునరేషన్ విషయంలో ఆయన కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉన్నా, స్క్రిప్ట్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కారు. కథ నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు తప్ప.. హడావిడిగా సినిమాలు చేసే రకం కాదు.
అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఏర్పడింది. ఇటీవల విడుదలైన అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ సినిమాతో ఆయన తన కెరీర్లో తొలిసారిగా ₹100 కోట్ల క్లబ్లో చేరారు. ఈ భారీ విజయంతో ఇండస్ట్రీ మొత్తం నవీన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ సక్సెస్ జోష్‌లోనే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా ఫిక్స్ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మైత్రీ సంస్థ నవీన్‌కు మూడు ఏళ్ల క్రితమే అడ్వాన్స్ ఇచ్చింది. సరైన కథ, దర్శకుడు దొరకలేదో ఏమో కానీ.. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.
ఎప్పుడో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, పర్ఫెక్ట్ టైమింగ్‌లో మైత్రీ ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడం విశేషం. ఈ ఆలస్యం వెనుక ఒక సాలిడ్ స్క్రిప్ట్ ఉండి ఉంటుందని ఇన్ సైడ్ టాక్. నవీన్ డేట్స్ కోసం కేవలం మైత్రీ మాత్రమే కాదు, మరికొందరు ప్రముఖ నిర్మాతలు కూడా క్యూలో ఉన్నారు. వెంకట్ బోయనపల్లి, సాహూ గారపాటి వంటి నిర్మాతలు కూడా నవీన్‌కు అడ్వాన్స్‌లు ఇచ్చి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారట. ఏదేమైనా వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి లైనప్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఆయన బాక్సాఫీస్ దగ్గర మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.