NTRకి దొరక్కూడదు… విశ్వముదురుతో దేశముదురు..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బావా అని పిలవటం అందరికి తెలిసిందే.. కాని అదే బావకి అల్లు అర్జున్ వరుసగా వెన్నుపోట్లు పొడుస్తున్నాడా? లేదంటే అంతా ప్రచారంలో భాగమేనా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2026 | 01:00 PMLast Updated on: Jan 24, 2026 | 1:00 PM

Intersting News About Ntr And Alluarjun Movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బావా అని పిలవటం అందరికి తెలిసిందే.. కాని అదే బావకి అల్లు అర్జున్ వరుసగా వెన్నుపోట్లు పొడుస్తున్నాడా? లేదంటే అంతా ప్రచారంలో భాగమేనా? ఎందుకంటే మొన్నటి వరకు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్ స్ట్రాటజీ, బన్నీకి నచ్చిందన్నారు. అందుకే ఎన్టీఆర్ స్ట్రాటజీలను కాపీ కొడుతూ, తన దారిలోనే దర్శకులని, హీరోయిన్లతో కాంబినేషన్లని ప్లాన్ చేస్తున్నాడన్నారు. కట్ చేస్తే రీసెంట్ గా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నే కబ్జా చేయబోయాడన్నా ఆరోపనొచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు జస్ట్ సుకుమార్ నుంచి ఎన్టీఆర్ కి కాల్ వెల్లిందో లేదో.. వెంటనే పుష్పరాజ్ నుంచి మూడో కాల్ సుకుమార్ కి వెల్లినట్టు తెలుస్తోంది. ఎందుకు? ఎన్టీఆర్ ఎటు అడుగు వేస్తే అక్కడ బ్రేక్ వేసేందుకు బన్నీ టీం అలర్ట్ గా ఉందా? హిట్లకోసం, సాలిడ్ ప్రాజెక్టులకోసం విశ్వముదురుతోనే ఈ దేశముదురు పోటీ పడుతున్నాడా? అందుకు రాంగ్ రూట్లో రిస్క్ చేస్తున్నాడని అంతా అంటున్నారా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఈమధ్య బన్నీ ఫాలో అవుతున్నాడంటే, ఏదో తన స్ట్రాటజీని అల్లు అర్జున్ కాపీ కొడుతున్నాడనే ప్రచారం జరిగింది. కొందరు యాంటీ ఫ్యాన్స్ అయితే, పుష్ప రెండు భాగాలతో 1500 కోట్ల వసూళ్లు రాబట్టిన బన్నీకి ఏం ఖర్మ పట్టింది, ఎన్టీఆర్ ని ఫాలో అవటానికి అంటూ కామెంట్స్ కూడా చేశారు.

కాని గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ కి గ్లోబల్ గా గుర్తింపు రావొచ్చు. పాన్ ఇండియా తొలి హిట్ అదే కావొచ్చు.. దేవర పాన్ ఇండియా హిట్టే అయినా అది పుష్ప2 లా 1500 కోట్లు రాబట్టలేదు. అందులో సగం అంటే ఆలో మోస్ట్ 670 కోట్లు రాబట్టింది. అయినా దేవర పాన్ ఇండియా హిట్స్ లో వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ లో హిట్లు పడ్డాక, ఆ హీరోలు ఏ మూవీ చేసినా ఫ్లాపులు పడటం కామన్.. ప్రభాస్ అలా మూడు ఫ్లాపుల తర్వాతే కోలుకున్నాడు.రవితేజ, నాని, సునిల్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అంతా రాజమౌళి సెంటిమెంట్ బాధితులే.. కాకపోతే ఈ లిస్ట్ లోంచి ఎన్టీఆర్ ని బయట వేసింది దేవర హిట్టే… అదొక్కటే ఎన్టీఆర్ నిర్ణయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయిన బన్నీ ఫాలో అవుతున్నాడా అంటే కానే కాదు.. అది కూడా ఒక కారణం… దేవర తర్వాత, వార్ 2 చేసినా అది ఆడకున్నా, నార్త్ లో ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఎక్స్ పోజ్ అయ్యింది..

తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ, తర్వాత నెల్సన్ దీలీప్ సినమా… మధ్యలో తాను వద్దనుకున్న త్రివిక్రమ్ కథని, ఎన్టీఆర్ ఫైనల్ చేయటం.. ఇలా ఇవన్నీ బన్నీని డిస్ట్రబ్ చేస్తున్నాయనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అందుకే వద్దనుకున్న త్రివక్రమ్ కథని , మళ్లీ తానే చేయాలని మాటల మాంత్రికుడిని కబ్జా చేయబోయాడు.. కట్ చేస్తే ఇప్పుుడ సుకుమార్ కి పుష్ప రాజ్ నుంచి మళ్లీ కాల్ వెళ్లిందని తెలుస్తోంది.

కారణం రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా తీయబోతుండటం కాదు… ఎన్టీఆర్ కి సుకుమార్ తో ప్రాజెక్ట్ ఓకే అయ్యేలా ఉండటం.. నిజానికి రామ్ చరణ్ మూవీ తర్వాత మహేశ్ తో జేమ్స్ బాండ్ మూవీని ప్లాన్ చేస్తున్న సుకుమార్ అన్న ప్రచారం జరుగుతున్న వేళ, అది వెంటనే జరగకపోవచ్చనే వార్తలు కూడా వచ్చాయి… సో చరణ్ సినిమా తర్వాత సుకుమార్ తో ఎన్టీఆర్ మూవీ ఉండొచ్చని తెలుస్తోంద. వీళ్ల మధ్య ఇలా చర్చలు జరిగాయో లేవో, అంతలోన కాల్ చేసి పుష్ప3 ని 2028 లో పట్టాలెక్కించాలనే కండీషన్ పెట్టాడట బన్నీ… అంతేకాదు, మహేశ్ నుంచి రెస్పాన్స్ లేకపోవటంతో ఎన్టీఆర్ కి సందీప్ కనెక్ట్ అవటంతో, బన్నీ అటు వైపు కూడా కన్నేశాడన్నారు. సందీప్ రెడ్డి తో కూడా ప్రాజెక్ట్ పట్టాలెక్కించేలా ప్రెజర్ పెంచాడనంటున్నారు.

ఎలా చూసినా ఆట్లీ మూవీ చేస్తూనే, లోకేష్ కనకరాజ్ సినిమా కన్ఫమ్ చేసుకున్న బన్నీ, 2028 లో పుష్ప3 పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగని కూడా గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. ఇది ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్న టాక్.. తన ఫోకస్ అంతా ఎన్టీఆర్ ఎటువెలితే అటు అన్నట్టు సాగుతోంది.. ఎందుకు అంతగా ఎన్టీఆర్ స్ట్రాటజీ మీదే తాను ఫోకస్ పెంచాడనే కోణం లో ఇంకెన్ని కోణాలున్నాయో మాత్రం ఎవరికీ అర్ధం కావట్లేదు.