రెబల్ స్టార్ 1+1 ఆఫర్.. కల్కీ 2 కోసం డేట్ల వర్షం…
రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్ లురెడీ అయ్యాయి... ఇంతవరకు స్పిరిట్ మూవీ మొదలైతే ఫౌజీ ఎలా షూటింగ్ పూర్తి చేస్తారన్న డౌట్ ఉండేది..
రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్ లురెడీ అయ్యాయి… ఇంతవరకు స్పిరిట్ మూవీ మొదలైతే ఫౌజీ ఎలా షూటింగ్ పూర్తి చేస్తారన్న డౌట్ ఉండేది… ఇదే కష్టం అనుకుంటే ఫిబ్రవరిలో కల్కీ సీక్వెల్ మొదలౌతుందన్నారు. దాన్ని కూడా ఎవరూ నమ్మని పరిస్థితి.. కాని ఈరెండు నిజమౌతున్నాయి… స్పిరిట్ ఎప్పుడూ కల్కీ సీక్వెల్ కి అడ్డే కాదని తేల్చేస్తోంది నాగ్ అశ్విన్ టీం. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీప్రొడక్షన్ పనులే అందుకు సాక్షి.. అసలు స్పిరిట్ మూవీ తీయాలంటే, ప్రభాస్ మరో మూవీ చేయకూడదనే సందీప్ రెడ్డి కండీషన్ ఏమైంది? దాన్ని సైడ్ చేసేశారా? లేదంటే ఆ కండీషన్ ఫాలో అవుతూ కూడా కల్కీ2 ని పట్టాలెక్కించబోతున్నారా? ఇంతకి ఇదెలా సాధ్యం? వన్ ప్లస్ వన్ ఆఫర్ తో మళ్లీ రెబల్ స్టార్ 2024 మూడ్ లోకి వెళ్లాడా?
రెబల్ స్టార్ ప్రభాస్ మల్లీ స్పీడ్ పెంచాడు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ లేదంటే, కనీసం ఒక మూవీ విడుదలయ్యేలా తన స్పీడ్ పెరిగింది. అంతా స్పిరిట్ వల్ల, తన ఫౌజీ మూవీ కి బ్రేకులుపడ్డాయి.. కల్కీ 2 అసలు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే డౌట్లున్నాయి… ఇక సలార్ సీక్వెల్ కి కథ సిద్దమైనా, మరో ఏడాదిన్నర వరకు షూటింగ్ కి ఛాన్స్ లేదు..కాని ఇప్పుడీ సమస్యలన్నీ తీరాయా? రెబల్ స్టార్ ఏం మ్యాజిక్ చేసి ఒకేసారి మూడు సినిమాలతో మైండ్ బ్లాంక్ చేయబోతున్నాడు.? ఈ డౌట్లకు సమాధానంగా కల్కీ 2 ఫిబ్రవరిలో పట్టాలెక్కబోతోంది. ఫిబ్రవకి 9న కల్కీ సీక్వెల్ పట్టాలెక్కటం కన్పామ్ అయ్యింది. ఫౌజీ పెండింగ్ షూటింగ్ కోసం కూడా రెబల్ స్టార్ డేట్లు ఇవ్వటంతో దాని వేగం కూడా పెరగబోతోంది.
అంటే సందీప్ రెడ్డి వంగ పెట్టిన కండీషన్ ని రెబల్ స్టార్ పక్కన పెట్టేశాడా? ఎందుకంటే తనతో స్పిరిట్ చేసేప్పుడు మరో మూవీ చేయకూడదనే కండీషన్ పెట్టాడు సందీప్. అందుకోసం తను ఏకంగా ఏడాదిగా వేయిట్ చేసి, స్పిరిట్ ని పట్టాలెక్కించాడు.. అది కూడా ఫౌజీ షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యాక… కట్ చేస్తే ఇప్పుడు స్పిరిట్ తో పాటు కల్కీ సీక్వెల్ కూడా ప్యార్ లల్ గా తెరకెక్కుతుందన్న ప్రచారమే నిజమౌతోంది.ఫిబ్రవరి9 నుంచి కల్కీ షూటింగ్ కూడా జరగటం కన్పామ్ అయ్యింది. మొన్నటి వరకు స్పిరిట్ టాకీ పార్ట్ పూర్తయ్యాకే కల్కీ 2 రెగ్యులర్ షూటింగ్ జరగొచ్చన్నారు. ఈలోపు ఫిబ్రవరిలో కేవలం లాంచనంగానే కల్కీ 2 ని లాంచ్ చేస్తారన్నారు. కాని ఫిబ్రవరి 9న కల్కీ 2 లాంచ్ అవటం కాదు, రెగ్యులర్ షూటింగ్ నే జరుపుకోబోతోంది. ఇందులో తనకి లాంగ్ హేయిర్ తాలూకు విగ్ నే వాడుతున్నారు కాబట్టి, స్పిరిట్ మూవీలో ప్రభాస్ పూర్తిగా గడ్డం తీయలేదు కాబట్టి, కల్కీ 2 కి తన లుక్ వల్ల వచ్చే సమస్య ఏామీలేదు.
ఫౌజీ పెండింగ్ కి కూడా స్పిరిట్ కోసం ప్రభాస్ మార్చుకున్న కొత్త లుక్ సమస్య కాదని తెలుస్తోంది. అందుకే ఈ రెండు సినిమాలకు డేట్లు ఇస్తూ, వాటి వేగం పెంచిన ప్రభాస్ మొత్తానికి ఒకే సారి మూడు మూవీలతో బిజీ కాబోతున్నాడు.. ప్రజెంట్ ఫౌజీ, స్పిరిట్ సెట్ల మధ్య జంప్ చేసే ప్రభాస్ ఫిబ్రవరి 9 నుంచి కల్కీ 2 షూటింగ్ తో ఆ సెట్లో కూడా అడుగుపెట్టబోతున్నాడు. ఈ దసరాకు ఫౌజీ, సమ్మర్ కి స్పిరిట్, ఇక 2027 దసరాకు కల్కీ 2 వచ్చేలా మళ్లీ రిలీజ్ డేట్ల అడ్జెస్ట్ మెంట్ జరిగినట్టు తెలుస్తోంది.











