పాన్ వరల్డ్ గ్లోరీ మొదలైందా? ఒకవైపు వారణాసి తర్వాత రాజమౌళి మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా అంటున్నారు. ఫ్యాన్స్ తో సహా ఇండస్ట్రీ జనం కూడా ఆ ఎనౌన్స్ మెంట్ కోసం వేయిట్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇంకో వైపు రాజమౌళి మరో ఎనౌన్స్ మెంట్ కోసం వేయిటింగ్ అంటున్నాడు. అవును, తన నిర్ణయాన్ని ఈ కొత్త ఎనౌన్స్ మెంట్ ప్రభావితం చేసేలా ఉంది. అదే హాలీవుడ్ సూపర్ హీరోల ఫ్రాంచైజీ అవేంజర్స్... ఇప్పటికే అరడజన్ కి పైనే అవేంజర్స్ సీక్వెల్స్ వచ్చాయి. కట్ చేస్తే కొత్త సీక్వెల్ 2027 ఎండ్ లో మొదలయ్యేలా ఉంది. అందులోనే ఎన్టీఆర్ సూపర్ హీరోగా కనిపించబోయే తొలి ఇండియన్ గా కనిపిస్తాడా? ఆ ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు రాజమౌళి కూడా వేయిట్ చేయాలనే డిసైడ్ అయ్యాడా? దాంతో రాజమౌళి నెక్ట్స్ మూవీకి ఉన్న లింకేంటి? ఆ ప్రశ్నతోనే రోమాలు నిక్కబొడిచేలా పూనకాల రీసౌండ్స్ పెరుగుతున్నాయి... ఇంతకి హాలీవుడ్ మూవీ అవేంజర్స్ ఎనౌన్స్ మెంట్ కోసం, ఎందుకు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ ని రాజమౌళి హోల్డ్ లో పెడుతున్నాడు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా ఆల్ మోస్ట్ కన్పామ్ అయ్యిందనే అంటున్నారు. కాని కన్ఫర్ మేషన్ రావాలంటే ఎనౌన్స్ మెంట్ వచ్చి తీరాలి.. ఒక వైపు వారణాసి 50శాతం షూటింగ్ పూర్తి చేసి, జూన్ లోగా మొత్తం షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టే పనిలో ఉన్నాడు రాజమౌలి. 2027 ఉగాదికి ఈ సినిమా ను రిలీజ్ చేసే వరకు ఫోకస్ కాని, ప్రమోషన్ కాని అంతా ఈ సినిమా మీద పెట్టే రాజమౌళి ఎందుకు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను ఎనౌన్స్ చేస్తాడు?అలా చేస్తే అందరి ఫోకస్ వారణాసి మీద కాకుండా తాను ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా మీదే ఉంటుంది కదా.. అందుకే తను ఇప్పుడే ఎనౌన్స్ చేయడనే వాదనుంది. కాని అందులో నిజం లేదట..
ఎందుకంటే వారణాసి టీజర్ వచ్చే రోజే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ కూడా ఎనౌన్స్ కాబోతోంది. కాకపోతే అదే ఎప్పుడా అన్న డౌటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్ట్ బీట్ ని పెంచేలా ఉంది.నిజానికి వారణాసి టీజర్ ఈ సమ్మర్ లో సాలిడ్ గా రాబోతోందంటున్నారు. కాన్సెప్ట్ గ్లింప్స్ ని గ్రాండ్ గా లాంచ్ చేసిన రాజమౌళి, టీజర్ ని అంతకుమించేలా లాంచ్ చేస్తాడనే అంచనా ఉంది. కాకపోతే ఈ ఈవెంట్ లో తన నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ తో అనే విషయం ఎనౌన్స్ చేయటం, తర్వాత ఎనౌన్స్ చేయటం అనేది హాలీవుడ్ మీదే అదారపడి ఉంది.హాలీవుడ్ మూవీ అవేంజర్స్ కొత్త సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ప్రజెంట్ అవేంజర్స్ డూమ్స్ డే ఈ ఏడాది ఎండింగ్ కి రాబోతోంది. తర్వాత 2027 లో మరో సీక్వెల్ పట్టాలెక్కబోతోంది.
అందులో ఇండియా తరపున తొలి సూపర్ హీరో పాత్ర ఎన్టీఆర్ వేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అదే జరగితే, ఎన్టీఆర్ తో రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ తీస్తే అది జక్కన్నకే బాగా కలిసొస్తుంది.అసలు అవేంజర్స్ లో సూపర్ హీరో అంటేనే ఎన్టీఆర్ దశ తిరిగినట్టే.. ప్రతీ రెండేళ్లకోసారి అవేంజర్స్ సీక్వెల్స్ వస్తూ ఉంటాయంటే, ప్రతీ రెండేళ్లకో సారి వరల్డ్ మార్కెట్లో ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది. అలాంటి హీరోతో రాజమౌళి తన నెక్ట్స్ ప్లాన్ చేసుకుంటే, ఆ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ లెవల్లో దుమ్ముదులుపుతుంది. ఈజీగా రీచ్ అవుతుంది. ఇది ఎన్టీఆర్ కి కూడా ప్లస్సే. ఎందుకంటే పాన్ వరల్డ్ మార్కెట్ లో అవేంజర్స్ సీక్వెల్స్ తో వచ్చిన పేరు బలంగా మార్కెట్ గా మారాలంటే రాజమౌలి ప్రాజెక్టే సరైన నిర్ణయం... సో ఇది ఇద్దరికీ విన్ విన్ సిచ్చువేషనే.