3000కోట్ల ముఖాలు.. క్విక్ గన్ మురుగన్…!

డ్రాగన్ తో పాన్ వరల్డ్ మార్కెట్ ని ఎన్టీఆర్ శాసిస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లోనే కాదు, ఇండస్ట్రీ జనాల్లో కూడా పెరిగింది. గ్లింప్స్ ఆరేంజ్ లో ఉండటం వల్లే ఇలాంటి వైబ్స్ వస్తున్నాయి.. కాని ఆ తర్వాతేంటనే ప్రశ్న అంతకుమించేలా సౌండ్ చేస్తోంది.

Post Published By: dialnews
Updated : 28 May 2026, 6:15 PM IST

డ్రాగన్ తో పాన్ వరల్డ్ మార్కెట్ ని ఎన్టీఆర్ శాసిస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లోనే కాదు, ఇండస్ట్రీ జనాల్లో కూడా పెరిగింది. గ్లింప్స్ ఆరేంజ్ లో ఉండటం వల్లే ఇలాంటి వైబ్స్ వస్తున్నాయి.. కాని ఆ తర్వాతేంటనే ప్రశ్న అంతకుమించేలా సౌండ్ చేస్తోంది. దాని ఆన్సర్ కూడా రీసౌండ్ చేయటం మొదలుపెట్టింది. అదే మురుగన్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆరు ముఖాలు.. ఇంతకాలం రెండు పాత్రలు, మూడు పాత్రలు అని లెక్కేసుకున్న ఫ్యాన్స్ కి లెక్కలేనన్ని పాత్రలతో షాక్ ఇచ్చేలా ఉన్నాడు ఎన్టీఆర్. ఓరకంగా లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత ప్లేస్ తనదే అని ప్రూవ్ చేస్తున్నాడు.లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా తెరకెక్కబోయే గాడ్ ఆఫ్ వార్ మూవీలో మురుగన్ గా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. అలాని తను దేవుడు కాదు... సాధారన మానవుడు కూడా కాదు.. ఇంకా రాని వీడియోతో, ఎవరూచేయని ఎనౌన్స్ మెంట్ తో అప్పుడే తన పాత్ర ఇది అని అనుకోలేం. కాని దేవుడు కాదు, మనిషా కాదు అన్న మాటని రిజిస్టర్ చేయించే ప్రయత్నం చేయటం షాకింగ్ గా మారింది. బేసిగ్గా టైటిల్స్ ని రిజిస్టర్ చేయిస్తారు.. కాని తనేంటి ఒక్క మాటని రిజిస్టర్ చేయిస్తున్నాడు?

డ్రాగన్ తర్వాత పక్కగా ఎన్టీఆర్ చేయబోయే సినిమా గాడ్ ఆఫ్ వారే. ఇది ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. కాని ఎన్టీఆర్ బర్త్ డేకి చిన్న వీడియోతో అప్ డేట్ ఇచ్చి ఉంటే, సినిమా వేరే లా ఉండేది. కాని డ్రాగన్ టీం రిక్వెస్ట్ వల్లే, త్రివిక్రమ్ అండ్ కో గాడ్ ఆఫ్ వార్ అప్ డేట్ ని ఆపేశారని సమాచారం అందుతోంది. ఏదేమైనా డ్రాగన్ గ్లింప్స్ ఓరేంజ్ లో ఫ్యాన్స్ ని, ఇండస్ట్రీ జనాలని గాల్లో తేలేలా చేసింది.కట్ చేస్తే డ్రాగన్ తర్వాత ఆరు ముఖాలతో అష్ట అవతారాలెత్తేందుకు ఎన్టీఆర్ సిద్దమైనట్టున్నాడు. ఐతే ఇది మైథలాజికల్ డ్రామాగా వస్తుందా? మాడ్రన్ డ్రామాగా సబ్జెక్ట్ ని సోషలైజ్ చేస్తారా అన్నది, ఫస్ట్ ఎనౌన్స్ మెంట్ తో తేలే ఛాన్స్ ఉంది. ఐతే గాడ్ ఆఫ్ వార్ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని, చాలా సార్లు ఆ బుక్ ఎన్టీఆర్ చేతిలో కనిపించటం వల్లే,అంతా ఓ క్లారిటీ కి వచ్చారు.

ఐతే, లార్డ్ సుబ్రహ్హణ్య స్వామి ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాలో, ఎన్టీఆర్ పాత్ర ఆరు షేడ్స్ లో ఉంటుందా? లేదంటే మైఖేల్ మదన కామరాజు లా కవల సోదరుల కధలా వస్తుందా? అన్నదే తేలలేదు. చాలా వరకు దశావతారంలో కమల్ హాసన్ పది అవతారాలెత్తినట్టు, ఎన్టీఆర్ కూడా ఆరు పాత్రలతో ఆ తర్వాతి స్తానంలో నిలుచునేలా ఉన్నాడు.ఒకే మూవీలో ఎక్కువ పాత్రలేసిన స్టార్స్ లిస్ట్ లో ఏకంగా కమల్ హాసన్ తోనే పోటీ పడేలా ఉన్నాడు ఎన్టీఆర్. ఐతే వారణాసిలో మహేశ్ రాముడు, శివుడి పాత్రలేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ ఓకే అయితే, అందులో కృష్ణావతారం కన్పామ్ అయినట్టే.. ఇక చరణ్ ఇలాంటి మైథలాజికల్ డ్రామాకో సం ప్రిపేర్ అవుతుంటే, ఆల్రెడీ మాడ్రన్ పాత్రలో కనిపిస్తూ, సడన్ గా కర్ణుడిగా మారి కల్కీతో మైథలాజికల్ కిక్ ఇచ్చాడు ప్రభాస్.

సో ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్లో గ్యాంగ్ స్టర్ డ్రామా తర్వాత మైథలాజికల్ డ్రామాల ట్రెండే నడుస్తోంది. అందుకే గాడ్ ఆఫ్ వార్ లో షణ్ముఖుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడంటే, డివోషనల్ గా కలిసొచ్చే కథకి, మాస్ ఎమోషన్ యాడ్ అయితే, పాన్ ఇండియా మార్కెట్ లో వసూళ్ల వరద గ్యారెంటీ. అందుకోసం త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు? ఎన్టీఆర్ తో ఏం వీడియో తీశాడు...? అదెప్పుడు వదలబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే నెల రెండో వారం తర్వాత తేలొచ్చు.. బాబాయ్ బాలయ్య బర్త్ డే సందడి తర్వాతే, జూన్ 15 లేదా 18కి త్రివిక్రమ్ మూవీ ఎనౌన్స్ మెంట్ తో వీడియో వదలొచ్చు... ప్రస్థుతా ప్రచారం చూస్తుంటే, జూన్ లోపే గాడ్ ఆఫ్ వార్ షణ్హుఖ అలియాస్ మురుగన్ గా ఎన్టీఆర్ ఆరుడోసులు ప్రోమో రూపంలో కన్పామ్ అయ్యేలా ఉన్నాయి. 3000 కోట్ల వసూళ్ల అంచనాలతో డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ మూవీలు క్యూ కడుతున్నాయి.

Published : 
  • 28 May 2026, 6:15 PM IST