10kకోట్ల తాండవం..? పాన్ వరల్డ్ shake..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు మాస్ డాన్స్ ఇరగదీస్తే ఎలా ఉంటుందో గుంటూరు కారంలో చూపించారు. అంతకుముందు కూడా తను మాస్ డాన్స్ లేశాడు.

Post Published By: dialnews
Updated : 28 May 2026, 6:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు మాస్ డాన్స్ ఇరగదీస్తే ఎలా ఉంటుందో గుంటూరు కారంలో చూపించారు. అంతకుముందు కూడా తను మాస్ డాన్స్ లేశాడు. అయినా అవి క్లాస్ గానే అనిపించాయి. కాని గుంటూరు కారంలోకుర్చీ మడత పెడితే, మాస్ మైండ్ బ్లాంక్ అయ్యింది. కట్ చేస్తే అదే సూపర్ స్టార్ ఇప్పడు శివ తాండవం చేయబోతున్నాడా? అప్పట్లో ఎన్టీఆర్ తాండవం చేస్తే, థియేటర్స్ షేక్ అయ్యాయి.. మరి మహేశ్ బాబు తాండవం ఎలా ఉంటుంది?వారణాసిలో మహేశ్ బాబు రాముడిగా కనిపిస్తాడంటేనే ఫ్యాన్స్ నుంచి మూవీ లవర్స్ వరకు అందరికి ఎగ్జైటింగ్ గా ఉంది. ఇక ప్రశాంత్ నీల్ మేకింగ్ లో మహేశ్ బాబు కృష్ణావతారం వేస్తున్నాడంటే, అది కూడా జనాల్లో క్యూరియాసిటీని పెంచుంతోంది. కాని వారణాసిలో శివుడిగా మహేశ్ బాబు ఎలా ఉండబోతున్నాడు? ఆ లుక్ టెస్ట్ ని సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేశాకే చేస్తున్నారా? ఇదేం ట్విస్ట్?

వారణాసి మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు మాడ్రన్ దొంగగా పరిచయం కాబోతున్నాడని, లీకైన వీడియో చూస్తే ఎవరైనా అంచనాకు రావొచ్చు.. అలాంటి వ్యక్తికి విశ్వం తలరాత మార్చే యంత్రం తెచ్చే పని చెప్పే విలన్ గా ఫృథ్వీరాజ్ కనిపించబోతున్నాడు. అంతవరకు ఎలాంటి డౌట్లు లేవు.. కాని రాముడిగా మహేశ్ బాబు ఇందులో ఎలా కనిపిస్తాడు? ఏం చేస్తాడు?ఇక శివుడిగా మహేశ్ బాబు లుక్ తోపాటు, తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుంది? ఇవన్నీ ప్రస్థుతానికి ఆన్సర్ తెలియని డౌట్ల... ఊహల్లో తేలేలా చేస్తున్న ఆలోచనలు.. ఎందుకంటే ఇంతవరకు మహేశ్ బాబు డివోషనల్ మూవీస్ చేయలేదు. దేవుని పాత్రలు వేసింది లేదు. కాకపోతే రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలు చేయాలనే కోరిక మాత్రంతనకి ఉండేది.

ఆ కోరికే వారణాసితో తీరబోతోంది. కాకపోతే శివుని పాత్రే ఆలోచనలో పడేస్తోంది. ముందు రాముడి పాత్రలో రామాయణం ఎపిసోడ్ 25 నిమిషాలు ఉంటుందని రాజమౌళి తేల్చాడు.. అంటే రామ బానానికి రావణుడు ఎలా మట్టికరిచాడో, ఆ వార్ ఎపిసోడ్ చూపిస్తారా? చూపిస్తే, అందులో మహేశ్ లుక్ తోపాటు, పాత్ర స్వభావం గతంలోచూసిన రామాయణంలా ఉండదా?ఫస్ట్ టైం ఉగ్రరూప రాముడిని వారణాసిలో చూపిస్తున్నారా? ఆల్రెడీ షూటింగ్ జరిగిన రామాయణం ఎపిసోడ్ మీద బయటికి వస్తున్న లీకుల వల్లే ఇలాంటి డౌట్లొస్తున్నాయి. రాముడిగా, కృష్ణుడిగా మహేశ్ బాబు లుక్ డెఫినెట్ గా కిక్ ఇచ్చే ఛాన్స్ఉంది. కాని శివుడి పాత్రలో తనెలా ఉంటాడు? శివతాండవం చేస్తాడా? అసలు ఆ పాత్ర పరిదెంత? ఎందుకు శివుడి పాత్రకి కూడా తననేతీసుకుంటున్నారు? కథతో ఏమైనా లింకుందా?

ఇలాంటి డౌట్లలో ఒక్కటి మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్ పడ్డా.. ఇది ఇండియాలో ఐదువేల కోట్ల సినిమా, వరల్డ్ వైడ్ గా పదివేల కోట్ల డ్రామాగా మారేఛాన్స్ఉంది. పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసే తొలి ఇండియన్ మూవీగా అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమాలో,రాముడి పాత్రకి సమానంగా శివుడి పాత్ర ఉందంటే, అదెలా ఉంటుంది? ఒకే మూవీలో మాడ్రన్ హీరో గా, దేవ దేవుళ్లుగా కనిపించే అద్రుష్టం మహేశ్ బాబుకే దక్కింది. ఆగస్ట్ 15 కి వచ్చే టీజర్ తోనే వారణాసి ఎలాంటి సినిమానో, అసలు విజువల్స్ ఎలా ఉంటాయో ఒక క్లారిటీకి వచ్చేఛాన్స్ఉంది. అప్పటి నుంచి పెరిగే ఎక్స్ పెక్టేషన్స్ లెక్క వేరే లెవల్లో ఉండే ఛాన్స్ఉంది.

Published : 
  • 28 May 2026, 6:50 PM IST