డ్రాగన్ గా రగ్గుడ్ పాత్రలో భయపెట్టిన ఎన్టీఆర్, ఇప్పుడు గ్లింప్స్ తర్వాత టీజర్, ఆతర్వాత ట్రైలర్ తో అంచనాల భారం పెంచే ఛాన్స్ ఉంది. దసరా, దీపావళి, సంక్రాంతి ఈ ఫెస్టివల్స్ కోసం ఒక్కో ప్రోమో రెడీ అవుతున్నట్టు కూడా ఫిల్మ్ టీం ఫీలర్స్ వదులుతోంది. ఐతే ఇలాంటి టైంలో అందరిలో ఉన్న కామన్ డౌట్, గాడ్ ఆఫ్ వార్ పరిస్థితేంటి? ఆల్రెడీ రెడీ చేసిన వీడియలో వస్తుందా? బర్త్ డేకి మిస్ అయిన అప్ డేట్ ఇంకెప్పుడు వచ్చే ఛాన్స్ఉంది...? ఇలాంటి డౌట్లకు ఒకే ఒక్క వీడియోతో సమాధానం చెప్పేలా ఉన్నాడు త్రివిక్రమ్. అదే ఈ సినిమా బేసిక్ కాన్సెప్ట్ తాలూకు హింట్.. ఔను గాడ్ ఆఫ్ వార్ మూవీని లార్డ్ సుబ్రహ్మణ్యం జర్నీ బేస్ చేసుకుని తీయబోతున్న సినిమా. అలాని ఇది పూర్తిగా డివోషనల్ కాదు. మైథాలాజికల్ టచ్ ఉన్న ఒక సోషల్ ఎక్స్ పరిమెంట్.. ఔను మనుషులను కాపాడితే దేవుడంటారు.. అలాంటి దేవుడినే కాపాడితే ఏమంటారు... ఈ ఒక్క లైన్ తో నే గాడ్ ఆఫ్ వార్ రాబోతోందా? ఈ విషయమే చిన్న వీడియోలో కన్వే చేసేలా త్రివిక్రమ్ అప్ డేట్ రెడీ చేశాడా?
బాహుబలి వార్ క్లైమాక్స్ లో డైలాగ్ రికాల్ చేసుకుంటే... శత్రువుని అంతమొందిస్తే వీరుడంటారు.. అదే పది మందిని కాపాడితే దేవుడంటారు.. దాన్నే త్రివిక్రమ్ ఎక్స్ టెండ్ చస్తున్నాడు. పది మందిని కాపాడితే దేవుడంటారు. మరి దేవుడినే కాపాడితే ఏమంటారు.. సింపుల్ గా గాడ్ ఆఫ్ వార్ మూవీ స్టోరీ లైన్ ఇది.. ఇదే లైన్ మీద గాడ్ ఆఫ్ వార్ తెరకెక్కబోతోంది.నిజానికి దేవుల్లకి రాజు ఇంద్రుడు.. కాని దేవలోకానికే సమస్య వస్తే, దేవుళ్లకోసం వచ్చిపోరాడిందే సుబ్రహ్మణ్య స్వామి.. తన పుట్టుకే, దేవుళ్లని కాపాడేందుకు అన్నట్టు తన జర్నీ ఉంటుంది. ఆరుగురు దేవతలు పెంచిన షణ్ముఖుడు.. ఇలా చాలా కోణాల్లో లార్డ్ మురుగన్ జర్నీ ఉంటుంది. అవన్నీ మన హీరోయిజానికి మరింత బలాన్నిచ్చే అంశాలు.
కాబట్టే గాడ్ ఆఫ్ వార్ బుక్ ఆధారంగా, లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రేరణతో మైథాలజికల్ డ్రామా స్క్రీప్ట్ రెడీ చేశాడు త్రివిక్రమ్.
అదే మోస్ట్ లీ దసరా నుంచి షూటింగ్ మొదలు కావొచ్చు.. ఈలోపు మాత్రం ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఒక వీడియోని లాంచ్ చేయాలని ప్రయత్నించాడు త్రివిక్రమ్. డ్రాగన్ టీం రిక్వెస్ట్ వల్లే, ఆ లుక్ టెస్ట్ తాలూకు వీడియోని లాంచ్ చేయలేదు. ఐతే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ ని ఏఐలో చూపించి, అందుకోసం హీరో ఎలా రెడీ అవుతున్నాడో, లుక్ టెస్ట్ చేసిన వీడియోని యాడ్ చేసి అప్ డేట్ రెడీ చేశాడట.అదే బర్త్ డే రోజు లాంచ్ చేయాలనుకున్నా డ్రాగన్ టీం రిక్వెస్ట్ చేసిందని హోల్డ్ లో పెట్టాడు.
ఇప్పుడు జూన్ 15 తర్వాత ఏరోజైనా లాంచ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్ డేట్ నటసింహం బాలయ్య బర్త్ డే రోజు రావొచ్చని తెలుస్తోంది. కారణం బయటికి రావట్లేదు కాని, ఆరోజు మాత్రం గాడ్ ఆఫ్ వార్ మూవీ టైటిల్ తోచిన్నా ఎనౌన్స్ మెంట్ ఉంటుందట.బాబాయ్ బాలయ్యకి ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెప్పేలా ఒక ఎనౌన్స్ మెంట్ ని ఎన్టీఆర్, త్రివిక్రమ్ టీం ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అందులోనే ఈ సినిమా వీడియో లాంచింగ్ డేట్ కూడా ఉంటుదట. ఇక టైటిల్ షణ్ముఖడు, మురుగన్ ఈ రెండీంట్లో ఏది టైటిల్ గా ఉంటుంది, గాడ్ ఆఫ్ వార్ అనేది క్యాప్షనా లేదంటే వర్కింగ్ టైటిలా అన్నది జూన్ 10న తేలుబోతోంది. డ్రాగన్ గ్లింప్స్ సునామీ క్రియేట్ చేసిన, 20 రోజులకి రెండో సునామీ రెడీ అయ్యేలా ఉంది.