గ్లింప్స్ లో ఒక్క డ్రాగనే.. మరి “2వ డ్రాగన్”..?

ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో డ్యూయెల్ రోల్ వేస్తున్నాడని ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. కాకపోతే తండ్రి కొడుకులా? లేదంటే అన్నదమ్ములా?

Post Published By: dialnews
Updated : 4 March 2026, 4:43 PM IST

ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో డ్యూయెల్ రోల్ వేస్తున్నాడని ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. కాకపోతే తండ్రి కొడుకులా? లేదంటే అన్నదమ్ములా? కాదంటే తాతా మనవడా? ఈ మూడీంట్లో ఏది నిజమనేది మరో 77 రోజుల్లో తేలబోతోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ గ్లింప్స్ రాబోతోంది. కాకపోతే ఇప్పటి వరకు అంతా వేయిట్ చేస్తున్నట్టు, బయట ప్రచారం జరుగుతున్నట్టు, డ్రాగన్ గ్లింప్స్ లో అసలు టైటిల్ మాత్రమే తేలబోతుందట. ఇక ఇందులో ఎన్టీఆర్ వేసిన రెండు పాత్రలతో గ్లింప్స్ ఉండదని తెలుస్తోంది. దానికోసం మరికొంత కాలం ఎదురుచూడాల్సి వచ్చేలా ఉంది. కాకపోతే టీజర్ లో మాత్రం ఒకటి కాదు రెండు పాత్రలని పరిచయం చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బర్త్ డేకి ఒక పాత్ర, ఆగస్ట్ 15కి మరో పాత్రని పరిచయం చేయాలనే, గ్లింప్స్ ని ముందు, టీజర్ ని తరవాత లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఇంతకి ఇద్దరు ఎన్టీఆర్లలో ఎవరు ఎవరికి ఎమౌతారు? ఎందుకు రెండు పాత్రలని ఒకేసారి ప్రోమోలో చూపించకూడదని ప్రశాంత్ నీల్ టీం డిసైడ్ చేసింది?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు ప్రశాంత్ నీల్ టీం రంగం సిద్దం చేస్తున్నట్టుంది. గ్లింప్స్ కి టైం అయ్యింది. మే 20 లేదంటే మే 19నే డ్రాగన్ మూవీ అసలు టైటిల్ తో పాటు గ్లింప్స్ ఆరోజే రాబోతున్నాయి. ఐతే ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్ ఒక్కడే కనిపిస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ తప్ప మరో పాత్ర తాలూకు విజువల్స్ లేకుండా, సోలో విజువల్స్ తోనే సాలిడ్ గ్లింప్స్ ని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.మే 20కి ఇంకా 77 రోజుల వరకు టైం ఉంది.. అప్పటి వరకు వేయిట్ చేస్తే ఎన్టీఆర్ గ్లింప్స్ వస్తుందని తెలుస్తోంది. ఇది ఫ్యాన్స్ కి కొంత సంతోషించే విషయమే కాని, మరో ఎన్టీఆర్ పరిస్థితేంటి? ఇది అన్ని సినిమాల్లా ఎన్టీఆర్ సోలో మూవీ కాదు.. మల్టీ స్టారర్ మూవీ... కాకపోతే ఇద్దరు స్టార్లు తానే... ఔను తనే మరోసారి డ్యూయెల్ రోల్ తో ఈ ప్రయోగం చేస్తున్నాడు.

లెక్క ప్రకారం అయితే, డ్రాగన్ మూవీ గ్లింప్స్ వస్తే, అందులో ఇద్దరు ఎన్టీఆర్ పాత్రలను చూపించాలి.. ఫ్యాన్స్ లో పూనకాలు రావాలి.. కాని ఇద్దరు డ్రాగన్స్ లో ఒక్క డ్రాగన్ నే గ్లింప్స్ లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. రెండో డ్రాగన్ కోసం అంతా ఆగస్ట్ 15 వరకు వేయిట్ చేయక తప్పేలా లేదు. డ్రాగన్ మూవీలో రెండో పాత్రని చూపిస్తే, ఇద్దరు డ్రాగన్స్ మధ్యున్న రిలేషన్ షిప్ ముందే రివీల్ అవుతుందనేది ప్రశాంత్ నీల్ టీం అభిప్రాయమని తెలుస్తోంది.మరి టీజర్ లాంచ్ చేసినప్పుడు రెండో డ్రాగన్ పాత్ర రివీల్ అవుతుంది కదా.. అప్పుడు ఇద్దరు ఎన్టీఆర్ ల మధ్యున్నది అన్నదమ్ముల రిలేషనా, తండ్రి కొడుకుల బంధమా తేలే ఛాన్స్ఉంది. కాని దేవరప్రోమో చూసినప్పుడు ఒకరు తండ్రని, ఇంకొకరు కొడుకని ఎవరూ అనుకోలేదు.

అన్నదమ్ములవ్వొచ్చని అంచనా వేశారు. కాబట్టి డ్రాగన్ టీజర్ లో ఎన్టీఆర్ రెండు పాత్రలు రివీల్ చేస్తే తప్పేముందనే వాదన వినిపిస్తోంది.ఐతే, కెరీర్ లో ఇప్పటికే ఆంధ్రావాలా, అదుర్స్, జైలవకుశ, దేవరలో డ్యూయెల్ రోల్ వేసిన ఎన్టీఆర్, అన్నీంట్లో అయితే అన్నాదమ్ములు, లేదంటే తండ్రి కొడుకులుగానే కనిపించాడు. కాని ఫస్ట్ టైం తాతా మనవడి కాన్సెస్ట్ తో డ్రాగన్ వస్తోందని తెలుస్తోంది. సో గ్లింప్స్ లో ఇద్దరి పాత్రలు కనిపిస్తే, సర్ ప్రైజ్ రివీల్ అవుతుందనే ఇలా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఇది తాతా మనవల్ళ కథని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ ఒక్క కారణంతో గ్లింప్స్ లో ఒక పాత్ర, టీజర్ లో మరో పాత్రని రివీల్ చేయాలనుకోవటం వల్ల, క్యూరియాసిటీని వాయిదా వేయటమే అనంటున్నారు.

Published : 
  • 4 March 2026, 4:43 PM IST