మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెడ్డంతో నిలుచున్న లుక్ మైండ్ బ్లాంక్ చేస్తోంది. తన బర్త్ డే బ్లాస్ట్ మామూలుగా ఉండదని, కొత్త ఎనౌన్స్ మెంట్ తో మైండ్ బ్లాక్ చేశాడు రాజమౌళి. వచ్చే ఏడాది జూన్ 11న తుఫాన్ రాబోతోందని ఎనౌన్స్ చేసి, సునామీ క్రియేట్ చేశాడు. ఐతే ఇప్పుడు ఈ ఫిల్మ్ టీం వదిలిన పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ లోపూనకాలు తెప్పిస్తోంది. మరీ సన్నబడ్డాడు, ఎలా ఉంటాడో అన్న కంగారు ఫ్యాన్స్ లో ఉంటే, ఆ భయాలను మర్చిపోయేలా చేసింది పోస్టర్. గెడ్డం లుక్ తోదూరంగా నిలుచున్న తన లుక్, ఊర మాస్ కిక్ ఇస్తోంది.. ఇటు ట్రెండీగా మాడ్రన్ లుక్, అటు గెడ్డంతో మాస్ మతిపోగొట్టే కిక్ రెండూ ఒకే పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఐతే ప్రపంచాన్నే జయించేందుకు రెడీ అవుతున్నాడన్న మాటతో... ఇది పాన్ ఆసియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని తేల్చాడు ప్రశాంత్ నీల్... ఇంతకి డ్రాగన్ లుక్ తో ఇంకేం తేలుతోంది..? అసలు ఈ పోస్టర్ లో కనిపిస్తోంది తాత పాత్రా? మనవడి పాత్రా?
డ్రాగన్ మూవీ పోస్టర్ రాగానే సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఎందుకంటే ఈ మూవీలో తన పాత్రకోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 14 కిలోల వేయిట్ తగ్గాడు.. మరీ బక్కపలుచగా మారాడు. కొన్నియాడ్స్ లో, లేదంటే ఏయిర్ పోర్ట్ లో తను కనిపించినప్పుడు కూడా మరీ ఇంత సన్నబడితే ఎలా అన్న డౌట్లు, కామన్ ఆడియన్స్ కే కాదు, ఫ్యాన్స్ కి కూడా వచ్చాయి. కంగారు పడే పరిస్తితులు కనిపించాయి.కట్ చేస్తే ఒక్క పోస్టర్, ఒకే ఒక్క పోస్టర్ తో లెక్కేమారిపోయింది. గెడ్డం తో శిఖరం అంచున నిలుచున్న హీరో లుక్ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. తను వేసుకున్న జర్కిన్ లాంటి టాప్ కూడా హాలీవుడ్ మూవీ డ్యూన్ లో హీరోలు వేసుకునే డ్రెస్ కోడ్ లా వినూత్నంగా ఉండటం చూస్తుంటే, అసలిది మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తున్న మూవీనేనే అన్న డౌట్లు వస్తున్నాయి.
ఎందుకంటే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ఫీల్ వచ్చేలా ఆ పోస్టర్ లో హీరో లుక్ ఉంది. ఇండో, చైనా, భూటాన్ ట్రైయాంగిల్ బ్యాక్ గ్రాప్ తో కథుంటుందనేసరికి, ఇది పాన్ ఆసియా సినిమా అనుకున్నారంతా. కాని పోస్టర్ లోనే ప్రపంచాన్ని జయంచేందుకు 2027 జూన్ 11న రాబోతున్నాడన్న ఒక్క మాటతో, ఇది పాన్ వరల్డ్ మూవీనే అని క్లారిటీ వచ్చే సింది.ఇక ప్రశాంత్ నీల్ టీం వదిలిన డ్రాగన్ పోస్టర్ లో మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఇది రెండో పాత్ర అయిన మనవడి పాత్ర లుక్కే అనంటున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాలో రెండు పాత్రలు వేస్తున్నాడు ఎన్టీఆర్. అది తాతా మనవడి పాత్రలే అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఐతే ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో మనవడి పాత్ర తాలూకు లుక్కే రివీల్ చేశారనంటున్నారు. అందుక్కారణం పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ చాలా మాడ్రన్ గా ఉండటంతో మనవడిగా ఎన్టీఆర్ లుక్కిదే అనుకుంటున్నారు.ఒకవేళ తాత పాత్ర పోస్టరే వచ్చి ఉంటే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాబట్టి, సెవెంటీస్ లో ఇలాంటి లుక్ తో ఉండే ఛాన్సేలేదు. కాబట్టి అసలు పాత్ర లుక్ ని రివీల్ చేసిన టీం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తాత పాత్రలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో మాత్రం అంతే సస్పెన్స్ లో పెట్టారు. వచ్చే నెల వచ్చే గ్లింప్స్ లో రెండో పాత్ర ఉంటుందా? ఈ ఒక్క పాత్రతోనే గ్లింప్స డిజైన్ చేశారా అన్నది తేలలేదు. డైలాగ్స్ , ఫైట్స్ తో గ్లింప్స్ ని ఎడిట్ చేసినట్టు మాత్రం ప్రచారం జరుగుతోంది.