సెంటిమెంట్ రిపీట్…!

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Post Published By: dialnews
Updated : 29 April 2026, 5:18 PM IST

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, తారక్ పక్కన ఒకప్పుడు 'హిట్ సెంటిమెంట్'గా పేరు తెచ్చుకున్న విలక్షణ నటుడు రాజీవ్ కనకాల ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడు. స్టూడెంట్ నెం.1, ఆది, వంటి ఇండస్ట్రీ హిట్లలో వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేసింది. ముఖ్యంగా రాజీవ్ కనకాల పాత్ర చనిపోతే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే ఒక 'సెంటిమెంట్' టాలీవుడ్‌లో బలంగా ఉంటుంది.

చాలా ఏళ్ల విరామం తర్వాత, ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించబోతుండటం విశేషం. తాజాగా 'గోదారి గట్టుపై' చిత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ కనకాల, తారక్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తారక్ తో కలిసి నటించబోతున్నాను. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రంలో నాకు ఒక అద్భుతమైన పాత్ర లభించింది. మే 7 నుంచి నేను షూటింగ్‌లో పాల్గొనబోతున్నాను అని ఆయన పేర్కొన్నాడు. దీనితో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మళ్ళీ ఆ పాత 'హిట్ సెంటిమెంట్' వర్కవుట్ అయ్యి, డ్రాగన్ రికార్డులు తిరగరాస్తుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఆమె నటనకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉండటంతో, తారక్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కేజీఎఫ్', 'సలార్' వంటి సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని పెంచిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ వంటి పవర్ హౌస్ పెర్ఫార్మర్‌ను ఎలా చూపిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 'డ్రాగన్' అనే టైటిల్ వింటుంటేనే ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్న అభిమానులకు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 2027, జూన్ 11న 'డ్రాగన్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అంటే మరో ఏడాదిన్నర పాటు అభిమానులు వేచి చూడాల్సిందే. అయితే, ఈ లోపు సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయం.

Published : 
  • 29 April 2026, 5:18 PM IST