ఎన్టీఆర్ కొత్త లుక్ బాలీవుడ్ తీర్థయాత్రలు చెయాల్సిందే.!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డ్రాగన్'. వార్-2' చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 8 July 2026, 10:30 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డ్రాగన్'. వార్-2' చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తారక్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి సినీ వర్గాల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. 'డ్రాగన్' సినిమాలోని తన పాత్ర కోసం తారక్ ఎన్నడూ లేని విధంగా భారీగా బరువు తగ్గారు. ఈ మధ్య కాలంలో బయటకు వచ్చిన తారక్ అల్ట్రా స్లిమ్ మేకోవర్ చూసి అభిమానులు ఒకంత షాక్‌కు గురయ్యారు. "ఒక సినిమా కోసం ఇంతలా బరువు తగ్గాలా?" అని కంగారు పడుతూ, తమ ప్రియతమ హీరో లుక్ చూసి అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఎన్టీఆర్ ఆరోగ్యం విషయంలో కూడా కొందరు సామాజిక మాధ్యమాల్లో రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు.

అయితే, ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయినప్పటికీ, ఆ లుక్ వెనుక ఉన్న తారక్ కష్టం వారిని ఇబ్బంది పెడుతూనే వచ్చింది. ఇందులో ‘లూగార్’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ లుక్ కోసం ఎన్టీఆర్ తన ప్రాణం పెట్టి పనిచేశారు. సినిమా కోసం, తాను నమ్మిన పాత్ర కోసం తారక్ ఎంతటి రిస్క్ అయినా తీసుకోగలడు, ఏ స్థాయికైనా వెళ్లగలడు అని తన అంకితభావంతో మరోసారి నిరూపించారు.
మొదట ఈ లుక్ చూసి అభిమానులు కొంచెం టెన్షన్ పడినప్పటికీ, ఆ క్యారెక్టర్‌లోని ఇంటెన్సిటీ చూశాక ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో అని అందరిలోనూ ఆసక్తి రెట్టింపయింది. అభిమానుల్లో ఉన్న ఆ టెన్షన్‌ను పటాపంచలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' మూవీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయాన్ని పంచుకుంటూ అఖిల్ తన సోషల్ మీడియాలో తారక్‌తో దిగిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా "హమ్మయ్య" అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

ఎన్టీఆర్ ఇప్పటికీ స్లిమ్‌గానే ఉన్నప్పటికీ, మునపటి కంటే ఎంతో ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుండడంతో నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ సరికొత్త లుక్ చూసి కుదుటపడిన ఫ్యాన్స్, ఇక 'డ్రాగన్' సినిమాలో తారక్ విశ్వరూపం ఎలా ఉండబోతుందో అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తారక్ ముఖంలో మునుపటి తేజస్సు, ఎనర్జీ మళ్లీ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ఇక 'డ్రాగన్' సినిమా తర్వాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇదివరకు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాకుండా, ఎన్టీఆర్ నటనకు వన్-మెన్ షోగా నిలిచింది.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే తదుపరి చిత్రంపై సరికొత్త అంచనాలు మొదలయ్యాయి. ప్రశాంత్ నీల్ సినిమాలో ఊరమాస్, హై-వోల్టేజ్ యాక్షన్ రోల్ తర్వాత.. త్రివిక్రమ్ మైథాలాజికల్ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తారు? అక్కడ తన మేకోవర్ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అప్పుడే టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, ఎన్టీఆర్ నటన తోడైతే థియేటర్లలో పూనకాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా బ్యాక్-టు-బ్యాక్ భారీ ప్రాజెక్టులతో తారక్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు ప్రశాంత్ నీల్‌తో గ్లోబల్ రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, మరోవైపు త్రివిక్రమ్‌తో వైవిధ్యమైన కథాంశంతో కూడిన చిత్రం – ఇలా ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో టాలీవుడ్‌పై తారక్ పంజా స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానుల ఆందోళనలను పటాపంచలు చేస్తూ, మరింత రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు తిరుగులేదని చెప్పవచ్చు.

Published : 
  • 8 July 2026, 10:30 AM IST