జోర్టాన్ లో… మ్యాన్ ఆఫ్ మాసెస్ తో.. లేడీ ఆఫ్ మాసెస్..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ లొకేషన్ జోర్డాన్ కి మారినట్టే కనిపిస్తోంది. ఆఫ్రికా ఎపిసోడ్ అయిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2026 | 12:00 PMLast Updated on: Jan 31, 2026 | 12:00 PM

Intersting News About Ntr Upcomimg Movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ లొకేషన్ జోర్డాన్ కి మారినట్టే కనిపిస్తోంది. ఆఫ్రికా ఎపిసోడ్ అయిపోయింది. హైద్రబాద్ లో చాలా వరకు టాకీ పార్ట్ పూర్తైంది… ఇక కొత్త లుక్ లో, రెండో పాత్రకోసం ఎన్టీఆర్ కష్టపడబోతున్నాడు.. అయితే ఇలాంటి టైంలో తన జోడీ విషయంలో ఇద్దరు హీరోయిన్లు ఫోకస్ అవుతున్నారు. 1200 కోట్ల వసూళ్లను రుచి చూసినా బాలీవుడ్ లేడీ ఇప్పుడు ఎన్టీఆర్ తోజోడీ కట్టబోతోంది. డ్రాగన్ లో రుక్మినీ వసంత్ కన్ఫామ్ అయితే, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసే సినిమాకు మాత్రం 1200 కోట్ల లేడీ సీన్ లో కి రావాల్సిందేనా? ఇంతకి ఎవరా లేడీ? పాన్ ఇండియా జర్నీ మొదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ ప్రతీ మూవీకి ఒక్కో హీరోయిన్, ఒక్కోలా చరిత్ర స్రుష్టించేలా ఉంది? మరి గాడ్ ఆఫ్ వార్ లో లేడీకి కూడా అలాంటి హిస్టరీనే ఉందా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం జోర్డాన్ వెళుతున్నాడు. ఇజ్రాయెల్, పాలస్థీనా గొడవలతో మిడిల్ ఈస్ట్ ఆల్రెడీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది.. అయినా జోర్జాన్ లో కొన్ని హిస్టారికల్ ప్లేసెల్ లోఈ సినిమా షూటింగ్ కోసం ఫిల్మ్ టీం వెళ్లబోతోంది. వచ్చేనెల 5 నుంచి కొత్త షెడ్యూల్ షూటింగ్ జోర్డాన్ లో మొదలు కాబోతోంది. ఇందులో హీరోయిన్ రుక్మినీ వసంత్ తో జోడీకడుతున్న ఎన్టీఆర్, ఆతర్వాత మూవీలో స్పెషల్ కాంబినేషన్ కి రెడీ అయ్యాడు..దేవరలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో జోడీ కట్టి ఎన్టీఆర్, మరో హీరోయిన్ కూతురితో కూడా జోడీ కట్టేందుకు సిద్దమయ్యాడు. మరో మూవీలో మరోయాక్టర్ డాటర్ తో రొమాన్స్ కి సిద్ద పడ్డాడు. ఓరకంగా తన సినిమాలతో హీరోయిన్ల వారసురాళ్లని, తెలుగు తెరకి పరిచయం చేస్తున్నాడా? లేదంటే అంతా కోఇన్స్ డెన్సా అన్నది అటుంచితే, ఎన్టీఆర్ ప్రతీ ప్రాజెక్టులో హీరోయిన్ కి ఓ స్పెషాలిటీ ఉంటోంది.

కేవలం గ్లామర్ కే పరిమితం కాని హీరోయిన్ల పాత్రలే తన మూవీల్లో పెరిగిపోతున్నాయి… త్రిబుల్ ఆర్ లో ఒలివియా మోరిస్ పాత్రకు వేయిట్ ఉంటుంది… కట్ చేస్తే దేవరలో శ్రీదేవి కూతురు మెరిసింది. ఇప్పుడు డ్రాగన్ లో పెర్ఫామెన్స్ తో ఫోకస్ అయిన రుక్మిని వసంత్ కి ఛాన్స్ చిక్కింది. ఆతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్.ఇందులోనే తెలుగులో బాలయ్య సరసన మెరిసిన రవీనా టాండన్ వారసురాలు కనిపించబోతోందట. బాలయ్యతో 1993 లో బంగారు బుల్లోడులో బాలయ్య సరసన మెరిసింది రవీనా టాండన్. ఇప్పుడు తన కూతురు హిందీలో ఆజాద్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో గాడ్ ఆఫ్ వార్ లో తనే ఎన్టీఆర్ జోడీగా కనిపించబోతోందంటున్నారు.

ఇదే కాదు ఆతర్వాత నెల్సన్ దిలీప్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేసే సినిమాకు కూడా హీరోయిన్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.బాలీవుడ్ లో ధురందర్ హిట్ తో దూసుకెల్లిన సారా అర్జున్ కి ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. ధురందర్ మూవీ ఇప్పటి వరకు 1200 కోట్లు రాబట్టి పాన్ ఇండియా ని షేక్ చేసింది. రెండో భాగం మార్చ్ లో రిలీజ్ కాబోతోంది. సో పాన్ ఇండియా లెవల్లో సారా అర్జున్ కి రెండో హిట్ కన్పామ్ అయ్యింది. అలాంటి తనకి ఎన్టీఆర్ తో పాన్ వరల్డ్ మూవీ చేసే అవకాశం దక్కుతోంది. ఐతే త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రతీ మూవీలో హీరోయిన్ పాత్రకి, ఆ పాత్ర వేసే హీరోయిన్ కి ఏదో స్పెషాలిటీ ఉండటం కామనైంది… ఆవిషయంలో ఎన్టీఆర్ చాలా చూసీగా ఉంటున్నాడన్న మాట వినిపిస్తోంది. చాలా వరకు తన జోడీలన్నీ క్రేజీగానే అందరి అటెన్షన్ లాక్కుంటున్నాయి.